కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రూరపాలకుని నుండి తప్పించుకొనుట

క్రూరపాలకుని నుండి తప్పించుకొనుట

అధ్యాయము 8

క్రూరపాలకుని నుండి తప్పించుకొనుట

ఒక అత్యవసరమైన వార్తను చెప్పుటకు యోసేపు మరియను మేల్కొల్పును. అంతకుముందే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఇట్లు చెప్పెను: “హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుము.”

వెంటనే వారు ముగ్గురు తప్పించుకొని పారిపోవుదురు. అది సరిగ్గా యుక్త సమయమైయుండెను, ఎందుకనగా జ్యోతిష్కులు తనను మోసగించి దేశము విడిచి వెళ్లిపోయిరని హేరోదు అప్పుడే తెలిసికొన్నాడు. యేసును వారు కనుగొనిన పిమ్మట వారు దానిని ఆయనకు తెలియజెప్పవలసి యుండిరని గుర్తుతెచ్చుకొనుము. హేరోదు ఉగ్రుడయ్యెను. కాబట్టి యేసును చంపే ప్రయత్నములో, అతడు బేత్లెహేములోను దాని సకల జిల్లాలలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని చంపవలెనని ఆజ్ఞాపించును. అంతకుముందు తూర్పునుండి వచ్చిన జ్యోతిష్కులనుండి పొందిన సమాచారము మీద ఆధారపడి అతడు ఈ వయస్సును లెక్కించును.

మగపిల్లలందరిని సంహరించుట చూచుటకెంతో దారుణంగా వుంటుంది! హేరోదు సైనికులు ఇంటింటనుజొచ్చి, మగపిల్లవాడు కనబడితేచాలు, తల్లి చేతులనుండి ఆ పిల్లవానిని బలవంతముగా లాక్కొనేవారు. అలా వారెంతమంది పిల్లలను సంహరించిరో మనకు తెలియదు గాని, దేవుని ప్రవక్తయైన యిర్మీయా బైబిలునందు చెప్పిన ప్రవచనమును ఆ తల్లుల మహా రోదనమును, అంగలార్పు నెరవేర్చుచున్నది.

అదే సమయములో, యోసేపు అతని కుటుంబము సురక్షితముగా ఐగుప్తు చేరుకొని, ఇప్పుడు అక్కడ నివసించును. అయితే మరలా ఒకనాటి రాత్రి యెహోవా దూత యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమగును. ఆ దూత అతనితో, “నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను.” కాబట్టి దేవుని కుమారుడు ఐగుప్తుదేశములోనుండి పిలువబడునని చెప్పిన మరొక బైబిలు ప్రవచన నెరవేర్పుగా, ఆ కుటుంబము తమ స్వంత ఊరికి తిరిగివచ్చును.

వారు ఐగుప్తునకు పారిపోకముందు వారు నివసించుచుండిన బేత్లెహేము పట్టణమున్న, యూదయలోనే స్థిరపడుటకు యోసేపు నిజంగా ఉద్దేశించును. అయితే హేరోదు దుష్ట కుమారుడైన అర్కెలాయు ఇప్పుడు యూదయకు రాజని తెలిసికొనెను, కాగా మరొక స్వప్నమందు యెహోవా ఆయనకు రాబోవు అపాయమునుగూర్చి హెచ్చరించును. కాబట్టి యోసేపు అతని కుటుంబము ఉత్తరదిక్కుగా ప్రయాణించి గలిలయ ప్రాంతమందలి నజరేతను ఊరికివచ్చి అక్కడ స్థిరపడుదురు. ఇక్కడ ఈ సమాజములో, యూదామత పద్ధతియొక్క కేంద్రమునకు దూరముగా యేసు పెరుగుచుండును. మత్తయి 2:13-23; యిర్మీయా 31:15; హోషేయ 11:1.

జ్యోతిష్కులు తిరిగి రాకపోయేసరికి, రాజైన హేరోదు ఏ భయంకరమైన పనిచేయును, అయితే యేసు ఎట్లు కాపాడబడును?

ఐగుప్తునుండి తిరిగివచ్చినప్పుడు, మరలా యోసేపు ఎందుకు బేత్లెహేములో నివసించలేదు?

ఈ కాలములో ఏ బైబిలు ప్రవచనములు నెరవేరును?