కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొర్రెల దొడ్లు మరియు గొర్రెల కాపరి

గొర్రెల దొడ్లు మరియు గొర్రెల కాపరి

అధ్యాయము 80

గొర్రెల దొడ్లు మరియు గొర్రెల కాపరి

ప్రతిష్ఠితపండుగ, లేక హనుక్కా పండుగకు యేసు యెరూషలేమునకు వచ్చెను. ఆలయమును మరలా యెహోవాకు ప్రతిష్ఠించు సందర్భములో ఈ పండుగ ఆచరింపబడును. సా.శ.పూ. 168లో షుమారు, 200 సంవత్సరముల పూర్వము అంతియోకిసు ఎపిఫానెసు IV యెరూషలేముపై దాడిచేసి దేవాలయమును దాని బలిపీఠమును అపవిత్రపరచెను. అయితే మూడు సంవత్సరముల తర్వాత, యెరూషలేము మరలా స్వాధీనపరచుకొనబడి ఆలయము తిరిగి ప్రతిష్ఠపరచబడెను. ఆ తర్వాత, వార్షిక ప్రతిష్ఠితపండుగ ఆచరింపబడెను.

ఈ ప్రతిష్ఠిపండుగ, మన ఆధునిక క్యాలండరులోని నవంబరు చివరిభాగమునుండి డిశంబరు మొదటిభాగమునకు సరిసమానముగా ఉండు, యూదానెలయగు కిస్లేవు 25న జరుగును. ఆ విధముగా, మహత్వపూర్వ సా.శ. 33 పస్కాపండుగకు ఇక కేవలము నూరు కంటె కొద్దిరోజులు ఎక్కువ మాత్రమే మిగిలియున్నవి. అది చల్లని వాతావరణముగల కాలమైనందున, అపొస్తలుడైన యోహాను దానిని “శీతాకాలము” అని పిలిచెను.

యేసు ఇక్కడ, మూడు గొర్రెల దొడ్లను గూర్చియు, మంచి గొర్రెల కాపరిగా తన పాత్రనుగూర్చిన ఒక ఉపమానము నుపయోగించును. ఆయన మొదట మాట్లాడిన గొర్రెలదొడ్డి మోషే ధర్మశాస్త్ర నిబంధనా యేర్పాటులో ఉన్నది. ఆ ధర్మశాస్త్రము యూదులను దేవునియొక్క ఈ ప్రత్యేక నిబంధనలోలేని ప్రజల అవినీతి కార్యములనుండి వేరుపరచు ఒక కంచెగా పనిచేసెను. యేసు ఇలా వివరించును: “గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి. . . . అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

ఇతరులు వచ్చి తాము మెస్పీయయని, లేక క్రీస్తని చెప్పుకొనిరి, అయితే యేసు ఇంకను చెప్పునట్లుగా, వారు నిజమైన కాపరివంటి వారు కాదు. “అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. . . . అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవును.”

బాప్తిస్మమిచ్చు యోహాను, మొదటి గొర్రెలదొడ్డికి “ద్వారపాలకుడై” యుండెను. ద్వారపాలకునిగా, యోహాను సూచనార్థక గొర్రెలను పచ్చికబయలుకు నడిపించు వానిగా యేసును గుర్తించి ఆయనకు ‘తలుపు తీసెను.’ యేసు పేరుపెట్టి పిలిచి వాటిని నడిపించు ఈ గొర్రెలు చివరకు మరొక దొడ్డిలో చేర్చుకొనబడును, ఆయనిలా వివరించును: “గొర్రెలు పోవు ద్వారమును నేనే . . . అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను,” అనగా, క్రొత్త గొర్రెలదొడ్డికి ద్వారమని భావము. తన శిష్యులతో యేసు క్రొత్త నిబంధన చేసి, పెంతెకొస్తునాడు పరలోకమునుండి వారిపై పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు, వారు ఈ క్రొత్త గొర్రెలదొడ్డిలోనికి చేర్చుకొనబడి యున్నారు.

తన పాత్రనుగూర్చి ఇంకను వివరించుచు యేసు ఇట్లనును: “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. . . . గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. . . . నేను గొర్రెలకు మంచికాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.”

ఇటీవలనే యేసు, “చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది” అని చెప్పుచు తన శిష్యులను ఊరడించెను. చివరకు 1,44,000 మందిగా తయారగు ఈ చిన్నమంద, ఈ క్రొత్తనిబంధనలోనికి, లేక రెండవ గొర్రెలదొడ్డికి వచ్చును. అయితే యేసు ఇంకను ఇట్లు చెప్పును: “ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అని నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును.”

“వేరే గొర్రెలు” “ఈ దొడ్డివి కావు” గనుక, వారు మరొక దొడ్డివి, మూడవ దొడ్డివి కావలెను. ఈ చివరి రెండు దొడ్లు లేక గొర్రెల కొట్టములు విభిన్న గమ్యములను కలిగియున్నవి. ఒక దొడ్డిలోవున్న “చిన్నమంద” పరలోకములో క్రీస్తుతోకూడ పరిపాలించును, వేరేదొడ్డిలోని “వేరేగొర్రెలు” పరదైసు భూమిపై జీవించును. రెండు దొడ్లువున్నను, గొర్రెలలో ఈర్ష్యలేదు, లేక వారు ప్రత్యేకింపబడినట్లు భావించుట లేదు, ఏలయనగా యేసు తెలుపురీతిగా, వారు “ఒకే కాపరి” క్రింద “ఒకే మందగా” తయారయిరి.

ఈ రెండు దొడ్లలోని గొర్రెల కొరకు మంచి కాపరియైన యేసుక్రీస్తు ఇష్టపూర్తిగా తన ప్రాణమునిచ్చును. “నా అంతట నేనే దానిపెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితినని” అయన చెప్పును. యేసు ఈ మాట చెప్పినప్పుడు యూదులలో భేదము పుట్టును.

జనసమూహములోని అనేకులు, “వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారు?” అని అనగా, మరికొందరు ఇట్లు ప్రత్యుత్తరమిత్తురు: “ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు.” ఆ పిమ్మట, రెండు నెలలక్రితము పుట్టుగ్రుడ్డి వానిని ఆయన స్వస్థపరచిన సంఘటనను స్పష్టముగా సూచించుచు, వారింకను ఇట్లందురు: “దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా?” యోహాను 10:1-22; 9:1-7; లూకా 12:32; ప్రకటన 14:1, 3; 21:3, 4; కీర్తన 37:29.

ప్రతిష్ఠితపండుగ ఏమైయున్నది, మరియు అది ఎప్పుడు ఆచరింపబడుచున్నది?

మొదటి గొర్రెలదొడ్డి ఏమైయున్నది, మరియు దాని ద్వారాపాలకుడు ఎవరు?

ద్వారపాలకుడు గొర్రెలకాపరికి ఎట్లుతలుపు తీయును, మరియు ఆ తర్వాత గొర్రెలు దేనిలో చేర్చుకొనబడును?

మంచికాపరియొక్క రెండు దొడ్లుగా ఎవరు తయారగుదురు, వారు ఎన్ని మందలుగా తయారగుదురు?