కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చివరి పస్కాలో వినయము

చివరి పస్కాలో వినయము

అధ్యాయము 113

చివరి పస్కాలో వినయము

యేసు ఉపదేశించిన పేతురు యోహానులు పస్కా ఏర్పాట్ల కొరకు ఇప్పటికే యెరూషలేముకు చేరుకున్నారు. స్పష్టముగా యేసు మిగతా పదిమంది అపొస్తలులతో కలిసి మధ్యాహ్నము తరువాత అక్కడకు చేరుకొనును. యేసు ఆయన శిష్యులు ఒలీవకొండ దిగుచుండగా సూర్యుడు ప్రొద్దుగ్రుంకును. యేసు పునరుత్థానము తర్వాత వరకు ఒలీవకొండ మీదనుండి దినసమయములో ఆయన పట్టణమును చూచుట ఇది చివరిసారి.

త్వరలోనే యేసు ఆయనతోకూడ ఉన్నవారు పట్టణములో ప్రవేశించి తాము పస్కా ఆచరించు స్థలమునకు వెళ్లుదురు. వారు మెట్లెక్కి ఒక పెద్ద గదిలో ప్రవేశించిరి, అక్కడ రహస్యముగా పస్కాను ఆచరించుటకు కావలసినవి ఏర్పాటుచేయబడి యుండుటను చూతురు. “నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని” అని యేసు చెప్పినట్లుగా ఆయన ఈ సందర్భము కొరకు ఎదురుచూశాడు.

సాంప్రదాయకముగా, పస్కాను ఆచరించువారు నాలుగు కప్పుల ద్రాక్షారసమును పుచ్చుకుంటారు. మూడవ కప్పును అంగీకరించిన తర్వాత, యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇట్లనును: “మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవునిరాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగను.”

వారు భోజనము చేయుచుండగా, యేసు లేచి తన వస్త్రములను ప్రక్కనబెట్టి ఒక తువ్వాలు తీసికొని, ఒక తాంబోళములో నీళ్లునింపును. సాధారణముగా అతిథేయి అతిథుల కాళ్లు కడుగబడునట్లు చూచును. అయితే ఇక్కడ ఏ అతిథేయి లేనందున, యేసు వ్యక్తిగతముగా ఈ పని చేయుటకు పూనుకొనును. దీనిని చేయుటకు అపొస్తలులలో ఎవరో ఒకరు ఈ అవకాశమును తీసికొనవచ్చును కాని, వారిమధ్య కొంత విరోధమున్నందున, ఎవరును ముందుకు రాలేదు. ఇప్పుడు యేసు వారి పాదములను కడుగుటకు ఆరంభించుటతో వారు కలవరపడుదురు.

యేసు తనయొద్దకు వచ్చినప్పుడు పేతురు అడ్డుపడి, “నీవెన్నడును నా పాదములు కడుగరాదని” ఆయనతో అనును.

అందుకు యేసు, “నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.”

దానికి పేతురు ప్రత్యుత్తరమిచ్చుచు, “ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని” చెప్పును.

అందుకు యేసు, “స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరు పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారని” సమాధానమిచ్చును. ఆయనిట్లెందుకు అనెనంటే ఇస్కరియోతు యూదా తనను అప్పగింపవలెనని పథకము వేయుచున్నాడని ఆయన ఎరిగియున్నాడు.

తనను అప్పగించు యూదాతోసహా 12 మంది పాదములను కడుగుట పూర్తిచేసి, యేసు తన పైవస్త్రములు తీసికొని మరలా బల్లయొద్ద కూర్చొని, ఆ పిమ్మట ఇట్లడుగును: “నేను మీకు చేసినపని మీకు తెలిసినదా? ‘బోధకుడనియు ప్రభువనియు’ మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకుచేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపినవానికంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.”

వినయముతో చేయు సేవకు ఇది ఎంతచక్కని పాఠము! తాము ఎంతో ప్రముఖులైనందున ఇతరులు అన్ని సమయములలో తమకు సేవచేయవలెనని ఆలోచించుచు, అపొస్తలులు మొదటి స్థానమును వెదకకూడదు. వారు యేసు ఉంచిన మాదిరిని అనుసరించవలెను. ఇది ఆచారబద్ధముగా పాదములు కడుగుట కాదు. అయితే ఇది పని ఎంత అల్పమైనదైనను లేక అయిష్టపూర్వకమైనదైనను, నిష్పక్షపాతముగా సేవచేయుటకు ఇష్టముచూపునదై యున్నది. మత్తయి 26:20, 21; మార్కు 14:17, 18; లూకా 22:14-18; 7:44; యోహాను 13:1-17.

పస్కాను ఆచరించుటకు యేసు పట్టణములో ప్రవేశించుచుండగా ఆయన యెరూషలేమును చూచుటలో ఏది ఉన్నతమై యున్నది?

పస్కా సమయములో, ఆశీర్వచనము పలికిన తర్వాత, యేసు ఏ కప్పును 12 మంది అపొస్తలులకు అందించును?

యేసు భూమిపైనుండగా సాధారణముగా అతిథులకు ఎటువంటి వ్యక్తిగత సేవ సమకూర్చుట వాడుకలో ఉండును, అయితే యేసు ఆయన అపొస్తలులు పస్కాను ఆచరించు సమయమున అది ఎందుకు సమకూర్చబడలేదు?

తన అపొస్తలుల పాదములను కడుగు ఆ అల్పమైన సేవను జరిగించుటలో యేసు ఉద్దేశ్యమేమై యున్నది?