కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జన్మదిన వేడుకలో హత్య

జన్మదిన వేడుకలో హత్య

అధ్యాయము 51

జన్మదిన వేడుకలో హత్య

యేసు తనశిష్యులకు ఉపదేశములనిచ్చిన తరువాత, ప్రాంతములోనికి వారిని ఇద్దరిద్దరినిగా పంపును. బహుశ సహోదరులైన పేతురు, అంద్రెయ; ఆలాగే యాకోబు, యోహాను; ఫిలిప్పు, బర్తలొమయి; తోమా, మత్తయి; యాకోబు, తద్దయి; మరియు సీమోను, ఇస్కరియోతు యూదా కలిసివెళ్లియుండవచ్చును. ఈ ఆరు జతల సువార్తికులు వారు వెళ్లు ప్ర

తిచోట రాజ్యసువార్త ప్ర

కటించి అద్భుతరీతిగా స్వస్థతలు చేయుదురు.

ఈ లోగా, బాప్తిస్మమిచ్చు యోహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరముల నుండి అతడు అక్కడ ఉంటున్నాడు. హేరోదు అంతిప తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను, తనభార్యగా ఉంచుకొనుట న్యాయముకాదని లోగడ యోహాను బహిరంగముగా ప్ర

కటించెనని మీరు గుర్తుతెచ్చుకొనవచ్చును. మోషే ధర్మశాస్త్రమును అనుసరించుచున్నానని హేరోదు అంతిప చెప్పుకొనెను గనుక యోహాను వారి వ్యభిచార కలయికను బయటపెట్టుట సరియే. కాబట్టి హేరోదియ కోరినమీదట బహుశ హేరోదు యోహానును చెరసాలలో వేయించియుండవచ్చును.

యోహాను నీతిమంతుడని హేరోదు అంతిప ఎరిగి అతని మాటలు సంతోషముతో వినుచుండెను. అందువలన యోహానును ఏమిచేయలేని స్థితిలో ఉన్నాడు. మరోవైపు, హేరోదియ యోహానును ద్వేషించి అతనిని చంపించగోరును. తుదకు ఆమె ఎదురుచూచుచున్న అవకాశము రానేవచ్చును.

సా.శ. 32లో పస్కాపండుగకు కొద్దిరోజులముందు హేరోదు తన జన్మదినోత్సవమునకు ఘనమైన ఏర్పాట్లుచేయును. అచ్చటికి సమకూడిన వారిలో హేరోదుయొక్క సహస్రాధిపతులు, ప్ర

ధానులు, గలిలయ దేశప్ర

ముఖులు ఉన్నారు. సాయంకాలమున హేరోదియకు తన మొదటి భర్తయైన ఫిలిప్పు వలన పుట్టిన కుమార్తెయగు సలోమే అను చిన్నది, అతిథులకొరకు నాట్యమాడుటకు లోపలికి పంపబడును. ఆమె నాట్యప్రదర్శనకు అక్కడి పురుషులు పరవశులగుదురు.

హేరోదు సలోమే విషయమై మిక్కిలి సంతోషించెను. “నీ కిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీ కిచ్చెదను,” అని అతడు ప్ర

కటించును. ఇంకా అతడిట్లు ఒట్టుపెట్టుకొనును: “నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీ కిచ్చెదను.”

బదులిచ్చుటకుముందు, సలోమే తన తల్లితో సంప్ర

దించుటకు వెళ్లును. “నేను ఏమి అడగాలి?” అని ఆమె ప్ర

శ్నించును.

చివరికి అవకాశం లభించింది! “బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడుగు” అని హేరోదియ నిస్సంకోచముగా సమాధానమిచ్చును.

వెంటనే సలోమే హేరోదునొద్దకు తిరిగివచ్చి యిట్లు కోరును: “బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములోపెట్టి యిప్పుడే నాకిప్పింపగోరుచున్నాను.”

హేరోదు బహుగా దుఃఖించును. కాని తనతో కూర్చుండియున్నవారు తన ఒట్టును వినినందున అది ఒక నీతిమంతుని హత్యచేయుట అయినను ఇయ్యను అని చెప్పనొల్లకపోవును. వెంటనే ఒక తలారి అతని భయంకర ఆజ్ఞను పురస్కరించుకొని చెరసాలకు పంపబడును. త్వరలోనే అతడు యోహాను తలగల పళ్లెముతో తిరిగివచ్చి దానిని సలోమేకి యిచ్చును. ఆమె దానిని తన తల్లియొద్దకు తీసుకొనిపోవును. యోహాను శిష్యులు జరిగిన దానిని వినినప్పుడు, వారువచ్చి ఆయన శరీరమును తీసికొనిపోయి పాతిపెట్టి, ఆ విషయమును యేసునకు తెలియజేయుదురు.

అటు పిమ్మట, యేసు ప్ర

జలను స్వస్థపరచుచు, దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని హేరోదు వినినప్పుడు, నిజముగా యేసు మృతులలోనుండి లేచిన యోహానేయని మిగుల భయపడును. అటుతరువాత అతడు ఆయన బోధ వినుటకు కాదుగాని అతని భయము సరియైనదాకాదా అని నిశ్చయపర్చుకొనుటకు యేసును మిక్కిలి చూడగోరును. మత్తయి 10:1-5; 11:1; 14:1-12; మార్కు 6:14-29; లూకా 9:7-9.

▪ యోహాను ఎందుకు చెరసాలలో ఉండెను, హేరోదు అతనిని ఎందుకు చంపగోరలేదు?

▪ చివరికి హేరోదియ యోహానును ఎలా చంపించగల్గెను?

▪ యోహాను మరణము తరువాత, హేరోదు ఎందుకు యేసును చూడగోరును?