కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నలుగురు శిష్యులు పిలువబడిరి

నలుగురు శిష్యులు పిలువబడిరి

అధ్యాయము 22

నలుగురు శిష్యులు పిలువబడిరి

తన స్వంత దేశమైన నజరేతులో యేసుపై హత్యాప్రయత్నం చేయబడిన తర్వాత, ఆయన గలిలయ సముద్ర సమీపమునగల కపెర్నహూమను పట్టణమునకు వెళ్లును. ఇది యెషయాయొక్క మరొక ప్రవచనమును నెరవేర్చును. అది గలిలయ సముద్రతీరమున కాపురముండు ప్రజలు గొప్ప వెలుగు చూచెదరు అని చెప్పబడిన ప్రవచనమై యున్నది.

ఇక్కడ వెలుగు ప్రకాశింపజేయు తన రాజ్య ప్రచారపు పనిని యేసు కొనసాగించుచుండగా, ఆయన తన నలుగురు శిష్యులను కనుగొంటాడు. వీరు ఇంతకుముందు ఆయనతోకూడ ప్రయాణము చేశారు, అయితే వారు యేసుతోపాటు యూదయనుండి తిరిగివచ్చినప్పుడు తమ చేపలుపట్టు వృత్తిని మరలా చేపట్టుదురు. బహుశ యేసు వారిని వెదకుచుండవచ్చును, ఏలయనగా తాను వెళ్లిపోయిన తర్వాత పరిచర్యను కొనసాగించుటకు తాను శిక్షణనివ్వగల స్థిరమైన, క్రమమైన సహాయకులను కలిగియుండుటకు అది సమయమైయున్నది.

కావున యేసు సముద్రతీరమున నడచుచుండగా, ఆయన సీమోను పేతురును అతని సహచరులు తమ వలలను కడుగుచుండగా చూచి, వారియొద్దకు వెళ్లును. ఆయన పేతురు దోనెనెక్కి దానిని దరినుండి కొంచెము త్రోయుమని చెప్పును. వారు అలా కొంచెము దూరము త్రోసిన తర్వాత, యేసు దోనెలో కూర్చుని సముద్రము ఒడ్డునవున్న జనసమూహమునకు బోధింప మొదలుపెట్టును.

ఆ తర్వాత యేసు పేతురుతో, “లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని” చెప్పును.

అందుకు పేతురు, “ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.”

వారు వలలను వేయగానే వారి వలలు పిగిలిపోవునంత విస్తారముగా చేపలుపడును. వెంటనే వారు తమ సమీపమున దోనెలోనున్న తోటివారికి సైగచేసి సహాయము చేయుటకు రమ్మని కోరుదురు. త్వరలోనే వారి రెండు పడవలుకూడ చేపలతో నిండి మునుగుటకు ఆరంభించాయి. అదిచూసి, పేతురు యేసు ఎదుట సాగిలపడి, “ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని” చెప్పును.

అందుకు యేసు, “భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని” ప్రత్యుత్తరమిచ్చును.

పేతురు సహోదరుడైన అంద్రెయనుకూడ యేసు పిలిచి, “నన్ను వెంబడించుము, మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని” వారితో చెప్పును. వారి సహచరులగు, జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులకును అదే ఆహ్వానమియ్యగా వారును తడవు చేయక ప్రతిస్పందించిరి. కాగా వీరు నలుగురు తమ చేపల వర్తకమును విడిచి యేసుయొక్క మొదటి స్థిరమైన, క్రమమైన అనుచరులైరి. లూకా 5:1-11; మత్తయి 4:13-22; మార్కు 1:16-20; యెషయా 9:1, 2.

తనను అనుసరించుమని యేసు తన శిష్యులను ఎందుకు పిలుచును, మరియు వీరు ఎవరు?

ఏ అద్భుతము పేతురును భయకంపితుని చేయును?

యేసు తన శిష్యులను, ఎటువంటి చేపలుపట్టు పనికొరకు ఆహ్వానించును?