కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థాన నిరీక్షణ

పునరుత్థాన నిరీక్షణ

అధ్యాయము 90

పునరుత్థాన నిరీక్షణ

చివరకు యేసు, యెరూషలేమునుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరమందుగల బేతనియ గ్రామ పొలిమేరలకు చేరుకొనును. లాజరు చనిపోయి సమాధిచేయబడి అప్పటికి కేవలము కొద్దిదినములే అయినది. ఆయన సహోదరీలు మరియ మార్తలు ఇంకను దుఃఖించుచున్నారు, వారిని ఓదార్చుటకు అనేకులు వారియింటికి వచ్చుచుండిరి.

వారు దుఃఖించుచుండగా ఎవరోవచ్చి యేసు వచ్చుచున్నాడని మార్తకు తెలియజేతురు. ఆమె తన సహోదరికి చెప్పకుండానే, త్వరగా ఆయనను కలిసికొనుటకు పరుగెత్తును. యేసునొద్దకు వచ్చి, తను తన సహోదరి గతనాలుగు దినములుగా పలుమారులు అనుకొనిన మాటలనే మార్త యేసుతో మరలా చెప్పును: “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.”

అయితే మార్త, తన సహోదరుని విషయములో యేసు ఏమైనను చేయుననుకొనుచు తన ఆశను ఇట్లు వ్యక్తపరచును: “ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదును.”

“నీ సహోదరుడు మరలా లేచునని” యేసు వాగ్దానము చేయును.

అబ్రాహాము మరియు దేవుని ఇతర సేవకులుకూడ ఎదురుచూసిన ఆ భవిష్యత్‌ భూపునరుత్థానమును గూర్చియే యేసు మాట్లాడుచున్నాడని మార్త అర్థము చేసికొనును. కావున ఆమె ఇట్లు ప్రత్యుత్తరమిచ్చును: “అంత్యదినమున (అతడు) పునరుత్థానమందు లేచునని యెరుగుదును.”

అయితే, యేసు వెంటనే ఉపశమనము పొందుట కొరకైన నిరీక్షణనిచ్చుచు ఇట్లు జవాబిచ్చును: “పునరుత్థానమును జీవమును నేనే.” మరణముపై దేవుడు తనకు శక్తినిచ్చెనని మార్తకు గుర్తుచేయుచు ఆయన ఇట్లనును: “నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.”

అప్పుడు జీవించియున్న విశ్వాసులు ఎన్నటికి చనిపోరని యేసు మార్తకు చెప్పుటలేదు. కానీ, ఆయన చెప్పుచున్న అసలు అంశమేమనగా, తనయందు విశ్వాసముంచుట నిత్యజీవమునకు నడిపించగలదు. అంత్యదినమున పునరుత్థానము చేయబడుటద్వారా అనేకమంది అటువంటి జీవితమును అనుభవింతురు. విశ్వాసులైన ఇతరులు ఈ విధానాంతమునుండి తప్పించబడి భూమిలో నివసింతురు, వీరి విషయంలో యేసు మాటలు అక్షరార్థముగా సత్యమైయుండును. వారు ఎన్నటికిని చనిపోరు! ప్రాముఖ్యమైన ఈ మాటలను చెప్పిన తర్వాత, యేసు మార్తను ఇట్లడుగును: “ఈ మాట నమ్ముచున్నావా?”

“అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను” అని ఆమె జవాబిచ్చును.

ఆ పిమ్మట మార్త తన సహోదరిని పిలుచుటకు వడిగావెళ్లి, ఆమెతో రహస్యముగా, “బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని” చెప్పును. ఆమె వెంటనే ఇంటినుండి బయలుదేరును. ఆమె వెళ్లుట చూచిన ఇతరులును, ఆమె సమాధియొద్దకు వెళ్లుచున్నదనుకొని, ఆమెను అనుసరింతురు.

మరియ యేసునొద్దకు వచ్చి, ఆయన పాదములమీద పడి, “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.” మరియను ఆమెతో వచ్చిన జనసమూహములు ఏడ్చుటయు చూసినప్పుడు యేసు ఎంతో చలించిపోవును. ఆయన, “అతనినెక్కడ ఉంచితిరని” వారినడుగును.

వారు “ప్రభువా, వచ్చిచూడుమని” ఆయనతో చెప్పుదురు.

యేసుకూడ కన్నీళ్లు విడువగా యూదులు, “అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడి” అని చెప్పుకొందురు.

కొన్నినెలల క్రితము పర్ణశాలల పండుగ సమయములో, యేసు పుట్టుగ్రుడ్డివానిని బాగుచేయుటను కొందరు గుర్తుతెచ్చుకొని, “ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా”? అని అడుగుదురు. యోహాను 5:21; 6:40; 9:1-7; 11:17-37.

చివరకు యేసు ఎప్పుడు బేతనియకు వచ్చును, అక్కడ పరిస్థితి ఎలావున్నది?

పునరుత్థానమందు నమ్మికయుంచుటకు మార్త ఏ ఆధారమును కలిగియున్నది?

లాజరు మరణం యేసుపై ఎట్లు ప్రభావం చూపినది?