కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్గము సరాళము చేయువాడు జన్మించును

మార్గము సరాళము చేయువాడు జన్మించును

అధ్యాయము 3

మార్గము సరాళము చేయువాడు జన్మించును

ఎలీసబెతు కుమారుని ప్రసవించే కాలము దాదాపు సమీపించినది. గతించిన ఈ మూడునెలలు, మరియ ఆమెతోకూడ ఉండును. అయితే ఇప్పుడు వెళ్లివచ్చెదనని చెప్పి మరియ దూరమందుగల తన స్వంత పట్టణమైన నజరేతుకు తిరిగివెళ్లు సమయము ఆసన్నమగును. ఇక ఆరునెలలకు తనుకూడ ఒక శిశువును కనును.

మరియ వెళ్లినవెంటనే, ఎలీసబెతు ప్రసవించును. సుఖంగా ప్రసవించిన ఎలీసబెతు ఆమె బిడ్డ ఆరోగ్యవంతముగా ఉండుట ఎంత ఆనందమో! ఎలీసబెతు ఆ పసివానిని తన పొరుగువారికి బంధువులకు చూపించినప్పుడు, వారును ఆమెతోకూడ సంతోషింతురు.

శిశువు జన్మించిన ఎనిమిదవ దినమున, దేవుని ధర్మశాస్త్రము ప్రకారము ఇశ్రాయేలీయులలోని మగశిశువుకు సున్నతి చేయవలెను. ఈ సందర్భములో స్నేహితులు, బంధువులు దర్శించవత్తురు. అలా వచ్చిన వారు పిల్లవానికి తండ్రిపేరునుబట్టి జెకర్యా అని పేరు పెట్టవలెనని అనిరి. అయితే ఎలీసబెతు మాట్లాడుచు, “ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.” పిల్లవానికి ఆ పేరు పెట్టవలెనని గబ్రియేలు దూత చెప్పుటను గుర్తుతెచ్చుకొనుము.

అయితే, స్నేహితులు దానిని వ్యతిరేకించుచు, “నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే” అనిరి. ఆ పిమ్మట వారు సంజ్ఞలుచేసి, పిల్లవానికి ఏ పేరు పెట్టవలెనని తాను కోరుచున్నాడని అతని తండ్రినడుగుదురు. వ్రాతపలక తెమ్మని అడిగి, జెకర్యా వారందరు ఆశ్చర్యపడునట్లు, “వాని పేరు యోహానని వ్రాసెను.”

దానితో అద్భుతరీతిన, జెకర్యా నోటిమాట పునరుద్ధరించబడును. ఎలీసబెతు కుమారుని కనునని దూత ప్రకటించినప్పుడు దానిని నమ్మనందున అతడు మాట్లాడు శక్తిని కోల్పోయిన సంగతిని మీరు గుర్తుతెచ్చుకొందురు. సరే, జెకర్యా మాట్లాడినప్పుడు, వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరు ఎంతో ఆశ్చర్యపడి వారిలోవారు, “ఈ బిడ్డ యేలాటివాడగునో” అని అనుకొనిరి.

ఇప్పుడు జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇట్లు మహిమపరచును: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలవైపు శ్రద్ధమళ్లించి, వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును లేవదీసెను.” ఈ “రక్షణ శృంగము” అనగా ఇంకను జన్మించనైయున్న ప్రభువైన యేసుయై యుండెను. జెకర్యా చెప్పినదేమనగా, దేవుడు ఆయనద్వారా, “మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించెను.”

ఆ పిమ్మట జెకర్యా తన కుమారుడైన యోహానునుగూర్చి ఇట్లు ప్రవచించును: “ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు, మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు, చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.”

నిజానికి ఇంకను అవివాహిత స్త్రీగానేయున్న మరియ ఈ సమయమునకు, నజరేతులోని తన ఇంటికి వచ్చును. ఆమె గర్భవతియను విషయము స్పష్టమైనప్పుడు ఆమెకు ఏమి జరుగును? లూకా 1:56-80; లేవీయకాండము 12:2, 3.

యోహాను యేసుకంటె వయస్సులో ఎంత పెద్దవాడు?

యెహాను ఎనిమిది దినముల శిశువుగా ఉన్నప్పుడు ఏ సంగతులు జరుగును?

దేవుడు ఎట్లు తన ప్రజలవైపు తన శ్రద్ధను మళ్లించును?

యెహాను ఏ పనిచేయునని ప్రవచింపబడెను?