కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్తకు సలహా, మరియు ప్రార్థనమీద ఉపదేశము

మార్తకు సలహా, మరియు ప్రార్థనమీద ఉపదేశము

అధ్యాయము 74

మార్తకు సలహా, మరియు ప్రార్థనమీద ఉపదేశము

యేసు యూదయలో పరిచర్య చేయుచున్న కాలములో, ఆయన బేతనియ అను గ్రామములో ప్రవేశించును. ఇక్కడే మార్త, మరియ వారి సహోదరుడైన లాజరు నివసించునది. యేసు బహుశ ఈ ముగ్గురిని తన పరిచర్యలో ఇదివరకే కలిసికొనియుండవచ్చును, గనుక ఇప్పుడాయన వారి సన్నిహిత స్నేహితుడాయెను. ఏమైనను, యేసు ఇప్పుడు మార్త ఇంటికి వెళ్లగా ఆమె ఆయనను సాదరంగా ఆహ్వానించును.

మార్త తాను కలిగియున్న దానిలో శ్రేష్ఠమైన వంటనుచేసి యేసుకు పెట్టవలెనని ఆతురపడుచుండును. వాగ్దానము చేయబడిన మెస్సీయ ఒకరి ఇంటిని దర్శించుట నిజముగా, మహా ఘనమైన సంగతియై యుండును! కావున మార్త ఆయన కొరకు మంచి భోజనము తయారు చేయుటకును మరియు ఆయన అక్కడ సంతోషముగా సౌఖ్యముగా ఉండుటకై అన్ని ఏర్పాట్లుచేయుటలో నిమగ్నమై యుండును.

మరొకవైపున మార్త సహోదరియగు మరియ యేసు పాదములయొద్ద కూర్చొని ఆయన చెప్పునది వినుచున్నది. కొంతసేపైన తర్వాత, మార్త వచ్చి యేసుతో, “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.”

అయితే యేసు మరియకు ఏమియు చెప్పలేదు. బదులుగా, భోజన ఏర్పాట్లకొరకు అధికముగా మునిగియున్నందుకు మార్తకు ఆయన సలహానిచ్చును. “మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే” అని ఆయన ఆమెను దయాపూర్వకముగా గద్దించును. ఒకసారి భోజనము కొరకు ఎన్నెన్నో వంటలు చేయుటలో ఎక్కువ సమయము గడుపుట అనవసరమని, కేవలము కొద్దిపాటి లేక ఒక్కటి మాత్రమే చాలును అని యేసు చెప్పుచున్నాడు.

మార్త ఉద్దేశ్యములు మంచివే; ఆమె అతిథ్యమిచ్చు స్త్రీగా ఉండవలెనని కోరుచున్నది. అయినను, భోజన ఏర్పాట్ల కొరకు అధిక ఆతురతచూపుట వలన, దేవుని స్వకుమారునినుండి వ్యక్తిగత ఉపదేశమును పొందు అవకాశమును ఆమె పొగొట్టుకొనుచున్నది! కావున యేసు ఇట్లనును: “మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు.”

ఆ తర్వాత, మరొక సందర్భములో, శిష్యులలో ఒకడు యేసును ఇట్లడుగును: “ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుము.” దాదాపు ఒక సంవత్సరమున్నర క్రితము తన కొండమీది ప్రసంగములో యేసు మాదిరి ప్రార్థననుగూర్చి చెప్పినప్పుడు బహుశ ఈ శిష్యుడు అక్కడ లేకుండవచ్చును. కావున యేసు తన ఉపదేశములను మరలా చెప్పును, అయితే ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు అవసరతను నొక్కితెల్పుటకు ఆయన వారికి ఒక ఉపమానము చెప్పును.

“మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా,” అని యేసు మొదలుపెట్టి, “అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితునియొద్దకు వెళ్లి, ‘స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని’ అతనితో చెప్పినయెడల అతడు లోపలనేయుండి, ‘నన్ను తొందరపెట్టవద్దు; తలుపువేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని’ చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును.”

ఉపమానములోని స్నేహితునివలె, యెహోవా దేవుడు మన విన్నపములకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఇష్టములేనివాడను భావముతో యేసు ఈ పోలికను చెప్పుటలేదు. అయితే పట్టుదలతో అడుగుటవలన ఇష్టములేని స్నేహితుడు సహితము ప్రత్యుత్తరమియ్యగా మన ప్రేమగల పరలోకపు తండ్రి మరి ఎంతగా ప్రతిస్పందించును అని ఆయన ఉదహరించుచున్నాడు. కావున యేసు ఇంకను ఇట్లనును: “అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.”

ఆ తర్వాత యేసు అసంపూర్ణులును, పాపులైన మానవ తండ్రులను ఉదహరించుచు, ఇట్లనును: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీతండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” నిజముగా, యేసు ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుటకు ఎటువంటి చైతన్యవంతమగు ప్రోత్సాహమునిచ్చుచున్నాడు. లూకా 10:38–11:13.

మార్త ఎందుకు యేసుకు పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లుచేయ తలంచెను?

మరియ ఏమిచేయును, యేసు మార్తకు బదులు మరియను ఎందుకు మెచ్చుకొనును?

ప్రార్థన విషయములో తన ఉపదేశములను పునరుద్ఘాటించుటకు యేసును ఏది ప్రోత్సహించెను?

ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు అవసరతను యేసు ఎట్లు ఉదహరించును?