కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మ్రానుపై వేదన

మ్రానుపై వేదన

అధ్యాయము 125

మ్రానుపై వేదన

యేసుతోపాటు ఇద్దరు బందిపోటు దొంగలును సంహరింపబడుటకు తీసుకు వెళ్లబడుదురు. పట్టణమునకు ఎంతో దూరములేని, కపాలస్థలము లేక గొల్గొతా అనబడు చోటికి వారందరు చేరుదురు.

ఖైదీల వస్త్రములు చించివేసి, ఆ పిమ్మట వారికి బోళము (మెర్‌) కలిసిన ద్రాక్షారసము ఇత్తురు. దీనిని యెరూషలేము స్త్రీలు తయారుచేసియుందురు, మరియు నొప్పితెలియకుండా చేయు ఈ ద్రావకమును వ్రేలాడదీయబడు వారికిచ్చుటను రోమీయులు నివారించలేదు. అయితే, యేసు దాని రుచిచూసి, త్రాగుటకు నిరాకరించును. ఎందుకు? విశ్వాసముయొక్క ఈ సర్వోన్నత పరీక్షలో తాను సంపూర్ణముగా తెలివితో యుండవలెనని ఆయన కోరుచున్నాడు.

యేసును మ్రానుపై పరుండబెట్టి ఆయన చేతులను తలకుపైగాచాచి పట్టుకొని, ఆ తరువాత సైనికులు ఆయన చేతులలోను కాళ్లలోను పెద్దపెద్ద మేకులను దిగగొట్టుదురు. మాంసము మరియు ఎముకల మధ్యనుండి మేకులు చీల్చుకొని పోవుచుండగా బాధతో ఆయన మెలికలు తిరుగును. మ్రానును నిలబెట్టినప్పుడు, బరువైన శరీరము మేకుల గాయములయొద్ద చీల్చబడుటతో ఆ నొప్పి భరించరానిదై యుండును. అయినను, యేసు రోమా సైనికులను దూషించుటకు బదులు వారికొరకు ఇట్లు ప్రార్థించెను: “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.”

పిలాతు, “యూదులరాజైన నజరేయుడగు యేసు” అని చదువబడు పైవిలాసము వ్రాయించి మ్రానుమీద పెట్టించును. తాను యేసును గౌరవించినందుననే కాకుండా, తననుండి యేసు మరణమును వక్రీకరించినందున యూదా యాజకులను అసహ్యించుకొనుటను బట్టియు అతడు దీనిని వ్రాయింపజేయును. అందరు చదువ వీలగులాగున, పిలాతు దానిని మూడు భాషలలో—హెబ్రీ, అధికార లాటీను మరియు సామాన్య గ్రీకులో—వ్రాయింపజేయును.

ప్రధాన యాజకులగు కయప మరియు అన్న అయిష్టపడుదురు. ఈ వాస్తవిక ప్రకటన వారి విజయోత్సాహమును పాడుచేయును. కావున వారు దానిని నిరసించుచు, “—నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని—యూదులరాజు అని వ్రాయవద్దని” అనిరి. యాజకులు చెప్పినట్లే ఆడుటకు నిరాకరించుచు, పిలాతు తీర్మానపూర్వకముగా ఇట్లు జవాబిచ్చును: “నేను వ్రాసినదేమో వ్రాసితిని.”

యాజకులు, పెద్ద జనసమూహముతో ఇప్పుడు ఆ సంహరణ స్థలముయొద్ద సమకూడగా, యాజకులు సూచనయొక్క సాక్ష్యమును తిరస్కరింతురు. వారు అంతకుముందు మహాసభ విచారణలో ఇచ్చిన అబద్ధపుసాక్ష్యమునే పునరావృతము చేయుదురు. కాబట్టి, అటుగా వెళ్లువారు దూషించుచు, హేళనతో తమ తలలూచుచు ఇట్లనుట కారంభించిరనుటలో ఆశ్చర్యములేదు: “దేవాలయము పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే మ్రానుమీదనుండి (NW) దిగుము.”

“వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు మ్రానుమీదనుండి (NW) దిగినయెడల వాని నమ్ముదురు. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును” అని ప్రధాన యాజకులు మరియు వారి మతనాయకులు ఆయనను దూషించి అపహాస్యము చేయుదురు.

ఆ మాటల ప్రభావమునకులోనై సైనికులును యేసు గేలి చేయుదురు. అపహసించుచు వారు ఆయనకు ద్రాక్షారసమునిచ్చి, దానిని ఆయన తడారిన పెదాల దగ్గరగా వుంచుదురు. “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని” వారు నిందింతురు. బందిపోటు దొంగలు సహితము—ఒకడు యేసుకు కుడివైపున, వేరొకడు ఆయన ఎడమవైపున వ్రేలాడదీయబడిరి—ఆయనను అపహసింతురు. దానిని ఊహించుము! జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, అవును సమస్త సృష్టిలో యెహోవాతో పాలుపంచుకొనినవాడు తీర్మానపూర్వకముగా ఈ దురాగమంతటిని సహించును.

సైనికులు ఆయన పైవస్త్రములను నాలుగు భాగములు చేయుదురు. అవి ఎవరికి వచ్చునో చూచుటకు వారు చీట్లు వేయుదురు. ఆయన అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది, నాణ్యమైనది. గనుక సైనికులు, “దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని” యొకరితో ఒకరు చెప్పుకొందురు. ఆ విధముగా, తమకు తెలియకుండానే, “వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి” అని చెప్పిన లేఖనమును వారు నెరవేర్చుదురు.

కొంత సమయానికి, బందిపోటు దొంగలలో ఒకడు యేసు నిజముగా రాజైయుండవలెనని గ్రహించును. కావున వాడు తన తోటివాడిని గద్దిస్తూ ఇట్లనును: “నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవుని భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదు.” ఆ పిమ్మట అతడు యేసును సంబోధించుచు, “నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము” అని వేడుకొనెను.

“నిజముగా నేడు నేను నీతో చెప్పుచున్నాను, నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” అని యేసు ప్రత్యుత్తరమిచ్చును. రాజుగా యేసు పరలోకములో పరిపాలించుచు, ఈ పశ్చాత్తాపము చూపిన నేరస్థుని పరదైసు భూమిపై జీవమునకు పునరుత్థానము చేసినప్పుడు ఈ వాగ్దానము నెరవేరును. ఆ సాగుచేయు ఆధిక్యతను హార్‌మెగిద్దోనునుండి రక్షింపబడినవారు, వారి సహవాసులు కలిగియుందురు. మత్తయి 27:33-44; మార్కు 15:22-32; లూకా 23:27, 32-43; యోహాను 19:17-24.

బోళము కలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు యేసు ఎందుకు నిరాకరించును?

యేసు వ్రేలాడదీయబడిన కొయ్యపై పైవిలాసము ఎందుకు తగిలించబడెను, ఇది పిలాతు మరియు ప్రధాన యాజకుల మధ్య ఏ మాటలకు నడిపెను?

కొయ్యపై యేసు మరింకే దుర్భాషను భరించెను, అది దేనికి నడిపెను?

యేసు వస్త్రములకు జరిగింపబడిన దాని విషయములో ప్రవచనము ఎట్లు నెరవేరెను?

బందిపోటు దొంగలలో ఒకడు ఏ మార్పు చేసికొనును, యేసు అతని విన్నపమును ఎట్లు నెరవేర్చును?