కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెరూషలేమునకు పర్యటనలు

యెరూషలేమునకు పర్యటనలు

అధ్యాయము 10

యెరూషలేమునకు పర్యటనలు

వసంత కాలము వచ్చింది. ఇది తమ స్నేహితులతోను బంధువులతో యోసేపు కుటుంబము సంవత్సరమున కొకసారి ఈ వసంత కాలములోనే పస్కాను ఆచరించుటకు యెరూషలేమును పర్యటించుదురు. దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించుటకు వారు బయలుదేరుచుండగా, వారిలో ఉత్సాహము ఉరకలువేసింది. యేసుకు ఇప్పుడు 12 సంవత్సరములు, ఆయన ప్రత్యేకమైన ఆసక్తితో పండుగ కొరకు ఎదురుచూస్తున్నాడు.

యేసుకు ఆయన కుటుంబమునకు, కేవలము పస్కాపండుగ ఒక్కటే కాదు, వెంటనేవచ్చు, ఏడు దినముల పులియని రొట్టెల పండుగకుకూడ వారక్కడనే ఉందురు. దీనిని వారు పస్కా కాలములోని భాగముగానే పరిగణింతురు. అందుచేత, నజరేతులోని వారి ఇంటినుండి బయలుదేరునప్పటినుండి యెరూషలేములో వారుండబోవు సమయముతో కలిపితే వారిపర్యటనకు షుమారు రెండువారములు పడుతుంది. అయితే ఈ సంవత్సరము, యేసు చిక్కుకున్న ఒక సమస్య మూలముగా, అది ఇంకా ఎక్కువరోజులు పడుతుంది.

వారు యెరూషలేమునుండి తిరిగివచ్చుచుండగా ఆ సమస్య బయటపడింది. అందరు కలిసి ప్రయాణము చేయుచున్న వారి బంధువులు మరియు స్నేహితుల గుంపులో యేసు ఉన్నాడని యోసేపు మరియలు అనుకొందురు. అయితే రాత్రి విడిది చేసిన సమయమున ఆయన కన్పించలేదు, కాగా వారు తమతో ప్రయాణించుచున్న వారందరి మధ్య ఆయన కొరకు ఆదుర్దాతో వెదుకుదురు. కానీ ఆయన ఎక్కడా కనబడలేదు. కావున యోసేపు మరియలు ఆయనను వెదకుచు మరలా అంతదూరము యెరూషలేమునకు తిరిగివత్తురు.

ఆ దినమంతా వారు వెదుకుదురు, కాని ఎక్కడ వారికి కన్పించడు. రెండవ దినమునకూడ వారికి ఆయన కన్పించడు. చివరకు, మూడవ దినమున, వారు దేవాలయమునకు వెళ్లుదురు. అక్కడ ఒక పెద్దగదిలో, యూదా బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండిన యేసును వారు చూస్తారు.

మరియ ఆయనతో, “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి” అని అనును.

తనను ఎక్కడ కనుగొనవలెనో వారికి తెలియనందుకు యేసు ఆశ్చర్యపడుచు, వారితో ఇట్లనును: “మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?”

తన తలిదండ్రులకు ఇదెందుకు తెలియదో యేసుకు అర్థము కాలేదు. అంతట, యేసు తన తలిదండ్రులతో ఇంటికి తిరిగివచ్చి వారికి లోబడియుండును. ఆయన జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండును. అవును, తన చిన్నతనమునుండికూడ యేసు ఆత్మీయ సంగతులను వెదకుటయందేకాక, తన తలిదండ్రులకు గౌరవమును చూపుటలో కూడ శ్రేష్ఠమైన మాదిరినుంచును. లూకా 2:40-52; 22:7.

వసంత రుతువులో యేసు తనకుటుంబముతో క్రమముగా ఏ పర్యటన చేయును, అదెన్ని రోజులుండును?

యేసు 12 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు వారు చేసిన పర్యటనలో ఏమి జరుగును?

ఈనాటి యౌవనులకు యేసు ఎటువంటి మాదిరినిస్తున్నాడు?