కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుయొక్క చివరి పస్కా సమీపమాయెను

యేసుయొక్క చివరి పస్కా సమీపమాయెను

అధ్యాయము 112

యేసుయొక్క చివరి పస్కా సమీపమాయెను

మంగళవారం, నీసాను 11 ఇక ముగియనైయుండగా, యేసు ఒలీవల కొండమీద తన శిష్యులకు బోధించుటను చాలించును. అది ఎంత పనితోనిండిన, చురుకుగా సాగిన దినమైయుండెను! ఇప్పుడు ఆ రాత్రి గడిపేందుకు బహుశ బేతనియకు తిరిగి వచ్చుచుండగా, ఆయన తన అపొస్తలులకు ఇట్లు చెప్పును: “రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు మ్రానున వ్రేలాడదీయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియును.”—NW.

స్పష్టముగా యేసు తర్వాతి దినము అనగా బుధవారం నీసాను 12, తన అపొస్తలులతో విశ్రాంతిగా గడుపును. అంతకుముందు రోజు ఆయన మతనాయకులను బహిరంగముగా గద్దించెను, అందువలన వారు తనను చంప వెదకుచున్నారని ఆయన గ్రహించును. కావున ఆ మరుసటిదిన సాయంకాలము తన అపొస్తలులతో కలిసి ఆచరించు పస్కాకు ఏదియు అడ్డు రాకూడదని కోరుచున్నందున, ఆయన బుధవారం బహిరంగముగా సంచరించడు.

అదే సమయములో, ప్రధానయాజకులు ప్రజల పెద్దలు ప్రధానయాజకుడైన కయప గృహ ఆవరణలో సమకూడుదురు. అంతకు ముందురోజున యేసు దాడిచేత చురకవేయబడిన వారిగా, వారు ఆయనను మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని పథకములు వేయుచున్నారు. అయినను వారు, “ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని” చెప్పుకొందురు. వారు ప్రజలకు భయపడుచుండగా, యేసు వారి అభిమానాన్ని ఆనందించును.

మత నాయకులు ఈ విధముగా యేసును చంపుటకు దుష్టబుద్ధితో కుట్రపన్నుచుండగా వారియొద్దకు ఒకవ్యక్తి వచ్చును. వారి ఆశ్చర్యమునకు, అతడు యేసు అపొస్తలులలో ఒకడైన ఇస్కరియోతు యూదా, తన యజమానుని అప్పగించవలెనను స్థూల ఆలోచనను సాతాను అతని హృదయములో నాటును. “నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని” యూదా వారిని అడిగినప్పుడు వారెంతగా సంతోషింతురు! మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఒక దాసునికి చెల్లించు మూల్యమగు 30 వెండినాణెములను అతనికి చెల్లించుటకు వారు సంతోషముతో అంగీకరింతురు. అప్పటినుండి, యూదా యేసునొద్ద జనులు ఎక్కువలేని సమయములో ఆయనను వారికి అప్పగించుటకు అనువైన అవకాశము కొరకు వెదకుచుండెను.

బుధవారం సూర్యాస్తమయముతో నీసాను 13 ఆరంభమాయెను. యేసు శుక్రవారం యెరికోనుండి వచ్చాడు, కాబట్టి ఇది ఆయన బేతనియలో గడుపు ఆరవ మరియు చివరి రాత్రియైయున్నది. ఆ మరుసటి దినము, గురువారం, పస్కాకు కావలసిన ఏర్పాట్లన్నియు పూర్తిచేయవలెను, అది సూర్యాస్తమయము తర్వాత జరుగును. అంటే పస్కా గొర్రెపిల్లను వధించి దానినంతటిని కాల్చవలెను. వారెక్కడ విందు జరుపుకొందురు, వాటిని ఎవరు సిద్ధము చేయుదురు?

పస్కా ఆచరణ జరుగుచుండగా ప్రధానయాజకులు తమను నిర్బధించునట్లు యూదా వారికి తెలియజేయకుండా ఆపుటకు, యేసు బహుశ ఆ వివరములన్నియు చెప్పలేదు. అయితే ఇప్పుడు, గురువారం మధ్యాహ్నము కావస్తుండగా, “మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని” చెప్పుచు యేసు పేతురు యోహానులను బేతనియనుండి పంపును.

“మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని” వారాయనను అడుగుదురు.

యేసు ఇట్లు వివరించును: “ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంటవెళ్లి, ‘నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిదిగది యెక్కడనని’ బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానితో చెప్పుడి. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడి.”

ఈ యింటియజమాని నిస్సందేహముగా యేసు శిష్యుడైయుండి, ఈ ప్రత్యేక ఆచరణకొరకు తన ఇంటిని ఉపయోగించుటకై యేసుచేయు వినతి కొరకు ఎదురుచూచుచున్న వాడైయుండును. ఏదిఏమైనను, పేతురు యోహానులు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, సమస్తము యేసు చెప్పినట్లే ఉన్నట్లు వారు కనుగొందురు. కావున వీరిద్దరు గొర్రెపిల్ల సిద్ధముగా ఉండునట్లు, యేసు ఆయన 12 మంది శిష్యులతో కలిసి పస్కాను ఆచరించు 13 మందికి సరిపడ ఇతర ఏర్పాట్లన్నియు జరుగునట్లు చూచుదురు. మత్తయి 26:1-5, 14-19; మార్కు 14:1, 2, 10-16; లూకా 22:1-13; నిర్గమకాండము 12:32.

యేసు స్పష్టముగా బుధవారం ఏమిచేయును, ఎందుకు?

ప్రధానయాజకుని గృహములో ఏ సమావేశము జరుగును, యూదా ఏ ఉద్దేశ్యముతో మతనాయకుల దగ్గరకు వెళ్లును?

గురువారం యేసు ఎవరిని యెరూషలేముకు పంపును, ఏ సంకల్పముతో?

యేసు అద్భుతకరమైన శక్తులను మరియొకసారి రుజువుచేసిన దేనిని పంపబడినవారు కనుగొందురు?