కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుయొక్క బాల్యజీవితము

యేసుయొక్క బాల్యజీవితము

అధ్యాయము 9

యేసుయొక్క బాల్యజీవితము

యేసు నజరేతులో పెరుగునప్పుడు, అది చిన్నదియు, అంతప్రాముఖ్యముకాని పట్టణమై యుండెను. అది అందమైన యెజ్రెయేలు లోయకు ఎంతో దూరములో లేని, గలిలయ అని పిలువబడిన పర్వతప్రాంతపు గ్రామములో ఉన్నది.

బహుశ యేసుకు రెండు సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, యోసేపు మరియలు ఆయనను ఐగుప్తునుండి ఇక్కడకు తీసుకువస్తారు. అప్పటికి మరియకు నిజంగా ఆయన ఒక్కడే కుమారుడు. అయితే కొద్దికాలమునకే, వారికి యాకోబు, యోసేపు, సీమోను, యూదా జన్మింతురు, ఆలాగే మరియ యోసేపులు ఆడపిల్లలకును తలిదండ్రులైరి. చివరికి యేసుకు కనీసం ఆరుగురు తమ్ముళ్లు, చెల్లెండ్రకంటే తక్కువలేరు.

యేసుకు ఇతర బంధువులును ఉండిరి. అక్కడికి అనేక కిలోమీటర్ల దూరమందున్న యూదయలో నివసించుచున్న, ఆయనకంటె పెద్దవాడును సమీపబంధువైన యోహానునుగూర్చి మనకిప్పటికే తెలుసు. అయితే నిజానికి గలిలయకు సమీపములో మరియ సహోదరియగు సలోమే నివసించుచుండెను. సలోమే జెబెదయిని వివాహము చేసికొనెను, వారికి ఇద్దరు కుమారులు ఉండిరి, యాకోబు యోహాను అను వీరును యేసునకు సమీపబంధువులై (తోబుట్టువులై) యుండిరి. పెరుగుచున్న కాలములో యేసు ఈ పిల్లలతో ఎక్కువ సమయము గడిపెనో లేదో మనకు తెలియదుగాని, ఆ తర్వాత వారు ఆయన సన్నిహిత సహవాసులైరి.

పెరుగుచున్న తన కుటుంబమును పోషించుటకు యోసేపు ఎంతో కష్టించి పనిచేయవలసి యున్నది. ఆయన ఒక వడ్రంగి. యోసేపు యేసును తన స్వంత కుమారునిగా పెంచును, అందువలన యేసు “వడ్లవాని కుమారుడని” పిలువబడును. యోసేపు యేసుకు వడ్రంగముకూడ నేర్పును, దానిని ఆయన బాగుగా నేర్చుకొనును. అందువలన ప్రజలు ఆ తర్వాత యేసును, “వడ్లవాడని” పిలిచేవారు.

యోసేపు కుటుంబ జీవితమంతా యెహోవా దేవుని ఆరాధనచుట్టూ నిర్మింపబడును. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి యోసేపు మరియలు ‘ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనునప్పుడు, లేచునప్పుడు’ తమ పిల్లలకు ఆత్మీయ ఉపదేశమునిచ్చేవారు. నజరేతులో సమాజమందిరమొకటి కలదు, గనుక ఆరాధన కొరకు యోసేపు తన కుటుంబమును క్రమముగా అక్కడకు తీసుకువెళ్లుచున్నాడని మనము నిశ్చయముగా నమ్మవచ్చును. అయితే యెరూషలేములోని యెహోవా ఆలయమునకు క్రమముగా వెళ్లివచ్చుటద్వారా వారు అత్యంత ఆనందమును అనుభవిస్తున్నారనుటలో సందేహము లేదు. మత్తయి 13:55, 56; 27:56; మార్కు 15:40; 6:3; ద్వితీయోపదేశకాండము 6:6-9.

యేసుకు కనీసము ఎంతమంది తమ్ముళ్లు మరియు చెల్లెండ్రు కలరు, వారిలో కొందరి పేర్లు ఏమైయున్నవి?

యేసు తోబుట్టువులలో ఏ ముగ్గురు సుప్రసిద్ధులు?

చివరకు యేసు లోకరీత్యా ఏ వృత్తిని చేపట్టును, మరియు ఎందుకు?

యోసేపు ఏ ఆవశ్యకమైన ఉపదేశమును తన కుటుంబమునకు సమకూర్చును?