కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుయొక్క మొదటి శిష్యులు

యేసుయొక్క మొదటి శిష్యులు

అధ్యాయము 14

యేసుయొక్క మొదటి శిష్యులు

యేసు అరణ్యములో 40 దినములు గడిపిన తర్వాత, తనకు బాప్తిస్మము ఇచ్చిన యోహానుయొద్దకు తిరిగివచ్చును. తనను సమీపించుచుండగా యోహాను అక్కడున్న వారికి ఆయనను చూపిస్తూ, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. నావెనుక వచ్చువాడు నాకు పూర్వమే జీవించియున్నందున నాకంటె ముందటి వాడాయెనని, నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన” (NW) అని చెప్పును. తన తోబుట్టువైన యోహాను యేసుకంటె పెద్దవాడైనను, యేసు పరలోకములో ఆత్మీయవ్యక్తిగా తనకంటే ముందు ఉనికిలో యుండెనని యోహాను ఎరిగియున్నాడు.

అయినను, కొన్ని వారములముందు, బాప్తిస్మము తీసికొనుటకు యేసు వచ్చినప్పుడు, యేసే మెస్సీయ కావలసియుండెనని ఖచ్ఛితంగా యోహానుకు తెలియదు. యోహాను ఇలా అంగీకరించెను: “నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితిని.”

తాను యేసుకు బాప్తిస్మమిచ్చినప్పుడు ఏమిజరిగెనో తన దగ్గరున్నవారికి ఇంకను వివరించుచు యోహాను ఇట్లనును: “ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు, ‘నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని’ నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిని.”

ఆ మరుసటి దినము యెహాను తన ఇద్దరు శిష్యులతో నిలుచుండగా, మరలా అతడు సమీపించుచున్న యేసు వైపుచూచి, “ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను.” ఈ మాటవినిన, స్నానికుడైన యోహాను శిష్యులిద్దరు యేసును వెంబడింతురు. వారిలో ఒకడు అంద్రెయ కాగా మరొకడు నిజానికి ఈ సంగతులను వ్రాసిన వ్యక్తియే, అతని పేరుకూడ యోహానే. గుర్తుల ప్రకారము, మరియ సహోదరియగు సలోమే కుమారుడైన ఈ యోహానుకూడ యేసుకు బంధువే.

యేసు వెనుకకు తిరిగి అంద్రెయ, యోహానులు తన్ను వెంబడించుట చూచి, “మీరేమి వెదుకుచున్నారని వారినడిగెను.”

వారు “రబ్బీ, నీవు ఎక్కడ నివసించుచున్నావని (NW) ఆయనను అడిగిరి.”

“వచ్చి చూడుడని” యేసు వారికి జవాబిచ్చెను.

అది మధ్యాహ్నము దాదాపు నాలుగు గంటల సమయము, అంద్రెయ యోహానులు ఆ దినము అక్కడే యేసుతో బసచేసిరి. అంద్రెయ ఎంతగా ఉప్పొంగిపోయెనంటే, ఆ వెంటనే అతడు పేతురు అని పిలువబడిన తన సహోదరుని కలిసికొనుటకు వేగముగావెళ్లి, అతని కలిసికొని, “మేము మెస్సీయను కనుగొంటిమని,” అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొనివచ్చును. బహుశ అదే సమయములో యోహాను తన సహోదరుడగు యాకోబును కనుగొని, అతని యేసునొద్దకు తెచ్చియుండవచ్చును; అయినను, యోహాను తన విశేషలక్షణమును అనుసరించి తన వ్యక్తిగత సమాచారమును తన సువార్తనుండి వదిలివేయుచున్నాడు.

ఆ మరునాడు, అంద్రెయ పేతురులయొక్క స్వంత పట్టణమగు బేత్సయిదాలో యేసు ఫిలిప్పును కనుగొని, “నన్ను వెంబడింపుమని” అతనిని ఆహ్వానించును.

ఆ పిమ్మట ఫిలిప్పు బర్తెలొమయి అనికూడ పిలువబడిన నతనయేలును కనుగొని, “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరినిగూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.” నతనయేలు దానిని సందేహించుచు, “నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా?” అని అతని అడుగును.

“వచ్చి చూడుమని” ఫిలిప్పు అతనితో చెప్పును. వారు యేసువైపు వచ్చుచుండగా, యేసు నతనయేలునుగూర్చి ఇట్లు చెప్పును: “ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదు.”

“నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు?” అని నతనయేలు అడుగును.

అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టుక్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని” అతనితో చెప్పును.

దానికి నతనయేలు ఎంతో ఆశ్చర్యపడి, “రబ్బీ [బోధకుడా అనిభావము], నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు” అని ఆయనకు ఉత్తరమిచ్చును.

అందుకు యేసు “ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.” ఆ పిమ్మట ఆయన ఇట్లు వాగ్దానము చేయును: “మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

దీని తర్వాత అది త్వరలోనే, యేసు క్రొత్తగా సమకూర్చుకొనిన ఈ శిష్యులతో, యొర్దాను లోయను దాటి గలిలయకు ప్రయాణమై వెళ్లును. యోహాను 1:29-51.

యేసు మొదటి శిష్యులు ఎవరైయున్నారు?

పేతురు, ఆలాగే బహుశ యాకోబు యేసుకు ఎట్లు పరిచయము చేయబడిరి?

యేసు దేవుని కుమారుడని నతనయేలును ఏది ఒప్పించెను?