కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టుట

యేసు అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టుట

అధ్యాయము 52

యేసు అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టుట

గలిలయ అంతటా చేసినప్రచార యాత్రయందు 12 మంది అపొస్తలులు ఆనందించారు. ఇప్పుడు, యోహాను చంపబడిన తర్వాత కొద్దిదినములకే, వారు యేసునొద్దకు తిరిగివచ్చి తమ అద్భుతమైన అనుభవాలను వివరిస్తారు. వారు అలసియున్నారని, అనేకప్రజలు వచ్చుచు పోవుచు ఉన్నందున వారికి తినుటకుకూడా సమయము లేక పోవుటచూచి యేసు: ‘మనము ఏకాంత ప్రదేశమునకు వెళ్లుదమురండి, మీరచ్చట కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని’ చెప్పును.’

బహుశా కపెర్నెహూమువద్ద వారు పడవ ఎక్కి, ఎవరికి కనబడకూడదని ఖచ్ఛితముగా బేత్సయిదాను దాటి, యొర్దాను తూర్పు ప్రాంతానికి వెళ్లసాగిరి. అయినను, వారు బయలుదేరినప్పుడు అనేకులు వారిని చూచినందున, యితరులుకూడ దానిని తెలిసికొందురు. వీళ్లంతా తీరంవెంబడి వారి కంటెముందుగా పరుగెత్తి అక్కడకు చేరుకొంటారు, కాగా పడవ ఆగగానే తమను కలిసికొనుటకు వచ్చిన ప్రజలను వీరు చూస్తారు.

పడవ దిగిన తరువాత జనసమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె ఉండుటనుబట్టి యేసు వారిమీద జాలిపడును. గనుక వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరచి వారికి అనేక సంగతులను బోధించ మొదలుపెట్టును.

సమయం త్వరగా గడచిపోవును, యేసుశిష్యులు ఆయన యొద్దకు వచ్చి, “ఇది అరణ్యప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమునకేమైన కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని” చెప్పుదురు.

అయితే దానికి ప్రత్యుత్తరముగా యేసు, “మీరు వారికి భోజనము పెట్టండి” అని అనును. అటుపిమ్మట తాను చేయబోవునది యేసుకు తెలుసు గనుక, పరీక్షించుటకు ఆయన ఫిలిప్పును ఇట్లడుగును: “వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పించెదము?”

ఫిలిప్పు దృష్టియందు అది అసాధ్యమైన స్థితియైయున్నది. ఎందుకనగా, అక్కడ పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీలను, పిల్లలను కలిపి లెక్కపెడితే వారు మొత్తం 10,000 కంటె ఎక్కువమంది ఉండవచ్చు! “వారిలోప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల (దేనారము ఆ కాలమందు ఒక దినపు బత్తెము) రొట్టెలుచాలవు,” అని ఫిలిప్పు చెప్పును.

అంతమందికి ఆహారము పెట్టడం సాధ్యంకాదని చూపడానికి కాబోలు అంద్రెయ స్వచ్ఛందంగా ముందుకువచ్చి: “ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవలరొట్టెలు, రెండు చిన్నచేపలు ఉన్నవిగాని ఇంతమందికి యివి ఏమాత్రము?” అని అనును.

అది వసంత ఋతువు అనగా సా.శ. 32 పస్కా పండుగకు కొంచెము ముందు, అక్కడ పచ్చిక ఏపుగా పెరిగియున్నది అందుకే జనసమూహమును 50, మరియు 100 మంది చొప్పున పంక్తులుగా కూర్చొనమని చెప్పుడని యేసు తన శిష్యులతో అనును. ఆయన ఆ అయిదు రొట్టెలు, రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కనులెత్తి ఆశీర్వదించును. పిమ్మట ఆయన రొట్టెలను విరిచి, చేపలను విడదీయును. ఆయన వాటిని తన శిష్యులకు యిచ్చుచుండగా వారు వాటిని ప్రజలకు పంచుదురు. కాగా అద్భుతరీతిలో ప్రజలంతా సమృద్ధిగా భుజింతురు!

ఆ తర్వాత యేసు తన శిష్యులకు యిట్లు చెప్పును: “ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయండి.” వారు అలా చేసినప్పుడు, వారంతా తినగా మిగిలినవన్నీ 12 గంపలు అగును. మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-13.

▪ తన అపొస్తలుల కొరకు యేసు ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎందుకు వెదకును?

▪ యేసు తన శిష్యులను ఎచ్చటికి తీసికొనివెళ్లును, విశ్రాంతి పొందగోరిన వారి అవసరత ఎందుకు నెరవేరలేదు?

▪ ప్రొద్దుగ్రుంకినప్పుడు శిష్యులేమని వేడుకొందురు, అయితే యేసు ప్రజలయెడల ఎలా శ్రద్ధను చూపును?