కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు ఎందుకు ఈ భూమికి వచ్చెను

యేసు ఎందుకు ఈ భూమికి వచ్చెను

అధ్యాయము 24

యేసు ఎందుకు ఈ భూమికి వచ్చెను

తన నలుగురు శిష్యులతో యేసు కపెర్నహూములో గడిపిన ఆ దినము తీరికలేనిదై, కపెర్నహూము ప్రజలు స్వస్థపరచబడుటకు సమస్త రోగులను ఆయనయొద్దకు తీసుకువచ్చుటతో ఆ సాయంకాలమంతా గడిచిపోతుంది. ఏకాంతముగా ఉండుటకు సమయము లేకపోవును.

ఆ మరుసటి దినము ఉదయాన్నే చీకటితోనే లేచి యేసు బయలుదేరి బయటకు వెళ్లును. ఆయన తన తండ్రికి ప్రార్థన చేయుటకు ఎవరులేని ఏకాంత ప్రదేశమునకు వెళ్లును. అయితే యేసు ఎంతోసేపు ఏకాంతముగా ఉండలేడు, ఎందుకనగా పేతురు మరియు ఇతరులు ఆయనలేడని తెలిసికొని ఆయనను వెదకుటకు బయలుదేరుదురు.

వారు యేసును కనుగొనినప్పుడు, పేతురు “అందరు నిన్ను వెదకుచున్నారని” అనును. కపెర్నహూము ప్రజలు యేసు తమతో ఉండవలెనని కోరుచున్నారు. యేసు వారికొరకు జరిగించిన వాటిని వారు నిజముగా గుణగ్రహించిరి! అయితే యేసు ముఖ్యంగా అలా అద్భుతరీతిలో స్వస్థపరచుటకు మాత్రమే భూమికి వచ్చెనా? దీనినిగూర్చి యేసు ఏమిచెప్పును?

బైబిలుయొక్క ఒక వృత్తాంతము ప్రకారము, యేసు తన శిష్యులకు ఇట్లు జవాబిచ్చును: “ఇతర గ్రామములలో నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి ఇందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చినది.” ప్రజలు ఆయనను ఉండవలసినదిగా వేడుకొనినను, ఆయన వారితో ఇట్లనును: “నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలయును. ఇందునిమిత్తమే నేను పంపబడితిని.”

అవును, తన తండ్రి నామమును మహిమపరచి, మానవ రుగ్మతలనన్నింటిని శాశ్వతముగా తీసివేయు దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుటకే యేసు ప్రత్యేకముగా ఈ భూమికి వచ్చెను. అయితే, తాను దేవునివలన పంపబడినవాడని రుజువుపరచుటకు, యేసు స్వస్థపరచు అద్భుతక్రియలను జరిగించును. తాను దేవుని సేవకుడని నమ్ముటకు రుజువుచేయుటకే శతాబ్దముల పూర్వము మోషే ఇదే విధముగా అద్భుతాలు చేశాడు.

ఇప్పుడు, యేసు కపెర్నహూమును విడిచి ఇతర పట్టణములలో ప్రకటించుటకు బయలుదేరగా, ఆయన నలుగురు శిష్యులును ఆయనతోకూడ వెళ్లుదురు. ఈ నలుగురు ఎవరనగా, పేతురు, అతని సహోదరుడగు అంద్రెయ, యోహాను, అతని సహోదరుడగు యాకోబు. కేవలము ఒక వారము క్రితమే వారు యేసుయొక్క మొదటి ప్రయాణ సహచరులుగా ఉండుటకు ఆహ్వానింపబడిరను విషయమును మీరు గుర్తుకు తెచ్చుకొనవచ్చును.

తన నలుగురు శిష్యులతో యేసు గలిలయలో ప్రయాణించుచు చేసిన ప్రచారము అద్భుత విజయాన్ని సాధించును. వాస్తవానికి, ఆయన కార్యములను గూర్చిన సమాచారము సిరియ దేశమందంతటను వ్యాపించును. గలిలయ, యూదయ, మరియు యొర్దాను అవతలనుండియు బహుజనములు యేసును ఆయన శిష్యులను వెంబడించిరి. మార్కు 1:35-39; లూకా 4:42, 43; మత్తయి 4:23-25; నిర్గమకాండము 4:1-9, 30, 31.

కపెర్నహూములో యేసు పనిలో నిమగ్నమైన దినము తరువాత ఉదయము ఏమి సంభవించును?

యేసు ఈ భూమికి ఎందుకు పంపబడెను, మరియు ఆయన చేసిన అద్భుతములు ఏ సంకల్పమును నెరవేర్చును?

గలిలయ ప్రాంతములో ప్రకటించుటకు యేసుతోపాటు ఎవరు వెళ్లుదురు, మరియు యేసుచేసిన కార్యములకు కలిగిన ప్రతిస్పందన ఏమిటి?