కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు ఒక విధవరాలి దుఃఖమును పోగొట్టుట

యేసు ఒక విధవరాలి దుఃఖమును పోగొట్టుట

అధ్యాయము 37

యేసు ఒక విధవరాలి దుఃఖమును పోగొట్టుట

సైనికాధికారి దాసుని బాగుచేసినవెంటనే యేసు కపెర్నహూముకు నైరుతిదిశగా 32 కిలోమీటర్ల దూరమందుగల నాయీనను ఊరికి వెళ్లును. ఆయన శిష్యులును, బహు జనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. వారు నాయీను పరిసరములకు చేరుకొనునప్పటికి బహుశ సాయంకాలమై యుండవచ్చును. ఇక్కడ వారికి చనిపోయిన యొకడు మోసికొనిపోవుట కనబడును. పట్టణపు వెలుపట పాతిపెట్టుటకు వారు ఒక యౌవనస్థుని శవమును మోసికొనిపోవుచుండిరి.

ప్రత్యేకముగా అతని తల్లి పరిస్థితి బహు దుఃఖకరముగా ఉన్నది, ఎందుకనగా ఆమె విధవరాలు, పైగా ఆమెకు అతడొక్కడే కుమారుడు. ఆమె భర్త చనిపోయినప్పుడు, తనకొక కుమారుడున్నందున ఆమె కొంత ఓదార్పు పొందియుండవచ్చును. అతని భవిష్యత్తుమీదనే ఆమె తన సమస్త ఆశలన్నియు పెట్టుకొనినది. అయితే ఇప్పుడు ఆమెను ఓదార్చుటకు ఎవరులేరు. ఊరిజనులనేకులు సమాధినొద్దకు తనతో బయలుదేరివచ్చుచుండగా ఆమె బహుగా దుఃఖించుచున్నది.

యేసు ఆ స్త్రీని చూచినప్పుడు, తీవ్ర విచారముతో ఆయన హృదయము తట్టబడెను. నమ్మకము కలిగించు స్థిరమైన స్వరముతో దయాపూర్వకముగా, ఆయన ఆమెతో, “ఏడువవద్దని” చెప్పును. ఆయన చర్యావిధానము జనుల శ్రద్ధనుచూరగొనినది. కాగా ఆయన పాడెదగ్గరకు వెళ్లి, దానిని ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన ఏమి చేయునోయని వారందరు ఆశ్చర్యపడసాగిరి.

నిజమే ఆయనతోనున్న వారు ఆయన రోగులైన అనేకులను అద్భుతరీతిన బాగుచేయుటను చూసారు. అయితే వారెన్నడును ఆయన చనిపోయినవారిని లేపుట చూడలేదు. ఆయన అటువంటి దానిని చేయగలడా? ఆయన ఆ శవమువైపు తిరిగి, “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననెను.” ఆ వెంటనే అతడు లేచికూర్చొని, మాటలాడసాగెను! యేసు అతనిని అతని తల్లికి అప్పగించును.

ఆ కుర్రవాడు నిజముగా బ్రదికెనని జనులు చూసినప్పుడు, వారిట్లనసాగిరి: “మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడు.” మరికొందరు: “దేవుడు తన ప్రజలవైపు తన శ్రద్ధ మళ్లించాడనిరి.” త్వరలోనే ఈ ఆశ్చర్యకరమైన క్రియనుగూర్చిన వార్త యూదయ మరియు ఆ చుట్టుపట్ల ప్రాంతములన్నిట వ్యాపించును.

బాప్తిస్మమిచ్చు యోహాను ఇంకను చెరసాలలోనేయున్నాడు, ఆయన యేసు చేయగలిగిన పనులన్నింటినిగూర్చి ఇంకను తెలిసికొనవలెనని ఇష్టపడుచున్నాడు. యోహాను శిష్యులు ఈ అద్భుతములనుగూర్చి ఆయనకు తెలియజేసెదరు. ఆయన ప్రతిస్పందన ఏమి? లూకా 7:11-18.

యేసు నాయీనును సమీపించినప్పుడు ఏమి జరుగుచుండెను?

తాను చూసిన దానినిబట్టి యేసు ఎట్లు ప్రభావితుడయ్యెను, మరియు ఆయన ఏమిచేయును?

యేసు చేసిన అద్భుతమునకు ప్రజలెట్లు ప్రతిస్పందించుదురు?