కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చేసిన మొదటి అద్భుతము

యేసు చేసిన మొదటి అద్భుతము

అధ్యాయము 15

యేసు చేసిన మొదటి అద్భుతము

అంద్రెయ, పేతురు, యోహాను, ఫిలిప్పు, నతనియేలు బహుశ యాకోబు అనువారు యేసు మొదటి శిష్యులై ఇప్పటికి కేవలము ఒకటి లేక రెండు రోజులు మాత్రమే అయినది. వారందరు ఇప్పుడు గలిలయ జిల్లాలోని తమ స్వంత ఇండ్లకు తిరిగి వెళ్లుచున్నారు. నతనయేలు స్వంత ఊరైన కానా వారి గమ్యము, ఇది యేసు పెరిగిన నజరేతునుండి ఎంతో దూరములో లేని పర్వతముల మధ్య ఉన్నది. వారు కానాలో ఒక వివాహ విందుకు ఆహ్వానింపబడిరి.

ఆ వివాహమునకు యేసు తల్లియైన మరియకూడ వచ్చెను. వివాహము చేసుకొనుచున్న వారి కుటుంబ స్నేహితురాలిగా మరియ, వచ్చిన అనేకమంది అతిథులకు కావలసిన అవసరతలు తీర్చుటలో నిమగ్నమైయుండును. కాబట్టి ఆమె, కొదువను గమనించిన వెంటనే, “వారికి ద్రాక్షారసము లేదని” యేసుకు తెలియజేయును.

ఆ విధముగా ద్రాక్షారసము లేకపోవుట విషయమై ఏదైనా చేయుమని మరియ యేసుకు సూచించినప్పుడు, యేసు అలాచేయుటకు మొదట అయిష్టపడును. “నాతో నీకేమి పని?” అని ఆయన అనును. దేవుని నియమిత రాజుగా, ఆయన తానుచేయు కార్యమందు కుటుంబము లేక స్నేహితులద్వారా నిర్దేశింపబడకూడదు. కావున జ్ఞానయుక్తముగా ఆ విషయమును కుమారుని చేతులకు వదిలిపెట్టి మరియ పరిచారకులనుచూచి, “ఆయన మీతో చెప్పునది చేయుడనెను.”

ఒక్కొక్కదానిలో దాదాపు 40 లీటర్లకంటె ఎక్కువపట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉన్నవి. అక్కడున్న పరిచారకులతో యేసు, “ఆ బానలు నీళ్లతో నింపుడని చెప్పెను.” కాగా వారు వాటిని అంచులమట్టుకు నింపుదురు. అప్పుడు యేసు వారితో, “మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసుకుపొండని చెప్పెను.”

అద్భుతరీతిలో అది తయారుచేయబడెనని గ్రహించక, ఆ ప్రధాని శ్రేష్ఠమైన ద్రాక్షారసమునుచూసి ముగ్ధుడయ్యెను. ఆయన పెండ్లికుమారుని పిలిచి, “ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొనియున్నావని అతనితో చెప్పెను.”

ఇది యేసుచేసిన మొదటి అద్భుతక్రియ, దీనిని చూసినమీదట ఆయన క్రొత్త శిష్యుల విశ్వాసము బలపర్చబడినది. ఆ తర్వాత వారు ఆయన తల్లి, సహోదరులతో కలిసి గలిలయ సముద్రమునకు సమీపముగానున్న కపెర్నహూమునకు ప్రయాణమై వెళ్లుదురు. యోహాను 2:1-12.

యేసు పరిచర్య కాలములో ఎప్పుడు కానాలో వివాహము జరుగును?

తన తల్లి సూచనకు యేసు ఎందుకు అభ్యంతరము చెప్పును?

యేసు ఏ అద్భుతమును చేయును, కాగా ఇది ఇతరులపై ఎటువంటి ప్రభావము చూపును?