కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు పరిసయ్యులను గద్దించుట

యేసు పరిసయ్యులను గద్దించుట

అధ్యాయము 42

యేసు పరిసయ్యులను గద్దించుట

ఒకవేళ ఆయన సాతాను శక్తివలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల సాతాను తనకుతానే విరోధముగా లేచినట్లగునని యేసు వాదించును. “చెట్టు మంచిదని యెంచి దానిపండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.”

దయ్యములను వెళ్లగొట్టు మంచి పని సాతానును సేవించినందువలన యేసు చేశాడని ఆరోపించుట బుద్ధిహీనమైనది. చెట్టు మంచిదైన, దానిఫలము చెడ్డది కానేరదు. మరోవైపున, యేసుపై పరిసయ్యుల చేసిన అయుక్త ఆరోపణల చెడుఫలం మూలంగాను, నిరాధారమైన వ్యతిరేకత వలనను, వారి మట్టుకు వారే చెడ్డవారైయున్నారని రుజువైయున్నది. అందుకే యేసు, “సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండుదానిని బట్టి నోరు మాటలాడును గదా” అని వ్యక్తపరచును.

మన మాటలు మన హృదయ పరిస్థితిని ప్రతిబింబించును గనుక మనము మాట్లాడునది మన తీర్పుకు ఆధారమవుతుంది. యేసు, “నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటనుగూర్చియు విమర్శదినమున లెక్కచెప్పవలసియుండును. నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు,” అని చెప్పును.

యేసు ఎన్నో శక్తివంతమైన పనులు చేసినను, పరిసయ్యులు శాస్త్రులు: “బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పిరి.” యెరూషలేమునుండి వచ్చిన ఈ మనుష్యులు వ్యక్తిగతముగా ఆయన చేసిన అద్భుతములను చూడకపోయినను, వాటినిగూర్చిన తిరుగులేని రుజువుకలదు. కావున యూదా నాయకులతో యేసు ఇట్లనును: “వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచకక్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.”

ఆ మాటల భావమేమిటో వివరిస్తు యేసు, “యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండునని” చెప్పును. చేపచే మ్రింగబడిన యోనా పునరుత్థానమైనట్లు మూడవ దినమున బయటికి వచ్చాడు. కావున యేసు, తాను కూడ చనిపోయి మూడవ దినమున సజీవునిగా లేచెదనని ప్రవచించుచున్నాడు. అయితే ఆ తరువాత యేసు పునరుత్థానుడైనను యూదా నాయకులు “యోనాను గూర్చిన సూచనను తిరస్కరించిరి.

ఆ విధముగా యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిన నీనెవెవారు విమర్శ సమయమున యేసును తిరస్కరించిన యూదులపై నేరస్థాపన చేయుటకై లేచుదురని యేసు చెప్పుచున్నాడు. అదే ప్రకారము సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చి తానుచూసి, విన్నదానిపై ఆశ్చర్యమునొందిన షేబ దేశపురాణికి సమాంతరము చూపుతు“ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని,” యేసు తెలియపరచును.

ఆ పిమ్మట అపవిత్రాత్మ వదిలిపోయిన ఒక మనుష్యుని ఉపమానమును యేసు ఇచ్చును. అయితే ఆ మనుష్యుడు ఖాళీయైన ఆ స్థలమును మంచి విషయములతో నింపనందున మొదటి దానికంటె చెడ్డవైన మరి ఏడు దయ్యముల చేత అతడు నింపబడెను. “ఆలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించునని” యేసు చెప్పును. అపవిత్రాత్మ విడిచి వెళ్లినట్లే ఇశ్రాయేలు జనాంగము అనేక నూతన మార్పులను అనుభవించెను. అయితే ఆ జనాంగము దేవుని ప్రవక్తలను తిరస్కరించుట, చివరకు క్రీస్తును కూడ తీవ్రముగా వ్యతిరేకించుటతో దాని దుష్టస్థితి మొదటికంటె మరి చెడ్డదైనట్లు బయలుపడును.

యేసు ఇంకను మాట్లాడుచుండగా, ఆయన తల్లి, సహోదరులు వచ్చి జనసమూహమునకు చివర నిలుచుండిరి. అప్పుడొకడు, “ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.”

అందుకు యేసు, “నాతల్లి యెవరు? నా సహోదరు లెవరు?” అని అడిగి, తన శిష్యులవైపు చెయ్యిచాపి, “ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను.” ఈ విధముగా యేసు తన బంధువులతో తనకెంతటి ప్రీతికరమైన బంధమున్నను, తన శిష్యులతో తనకున్న బంధము అంతకంటె గొప్పదని చూపించును. మత్తయి 12:33-50; మార్కు 3:31-35; లూకా 8:19-21.

ఎట్లు పరిసయ్యులు “చెట్టును” దాని “పండును” మంచిదిగా చేయలేకపోయిరి?

“యోనానుగూర్చిన సూచకక్రియ” ఏమైయున్నది, ఆ తర్వాత అది ఎట్లు తిరస్కరింపబడెను?

మొదటి శతాబ్దపు ఇశ్రాయేలు జనాంగము ఎట్లు అపవిత్రాత్మ వదిలిపెట్టిన ఒక మనుష్యుని పోలియున్నది?

తన శిష్యులతో తనకున్న సన్నిహిత సంబంధమును యేసు ఎట్లు నొక్కి తెలియపరచెను?