కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు స్వంత పట్టణపు సమాజమందిరములో

యేసు స్వంత పట్టణపు సమాజమందిరములో

అధ్యాయము 21

యేసు స్వంత పట్టణపు సమాజమందిరములో

యేసు ఇంటికి తిరిగివచ్చినప్పుడు నజరేతులో నిస్సందేహముగా ఎంతో ఉత్తేజము కలిగినది. ఒక సంవత్సరముకంటె కొద్దిగా ముందు యోహానుచే బాప్తిస్మము పొందుటకు వెళ్లినప్పుడు, యేసు అక్కడి వారికి కేవలము ఒక వడ్రంగి వానిగా మాత్రమే తెలియును. అయితే ఇప్పుడు అద్భుత కార్యములు చేయువానిగా ఆయన ప్రఖ్యాతిగాంచెను. ఈ ప్రాంతము వారుకూడ ఆయన తమ మధ్య కొన్ని అటువంటి ఆశ్చర్యకార్యములు చేస్తే చూడవలెనను ఆతురతను కలిగియున్నారు.

తన వాడుకచొప్పున యేసు స్థానిక సమాజమందిరమునకు వెళ్లునప్పుడు, వారి ఆసక్తి మరింతగా పెరుగును. సేవా కార్యక్రమముల సమయములో, ఆయన చదువుటకై నిలువబడగా, ప్రవక్తయైన యెషయా గ్రంథపుచుట్ట ఆయన చేతికివ్వబడును. ఆయన దానియందు యెహోవా ఆత్మచే అభిషేకింపబడిన వానినిగూర్చి చెప్పబడిన చోటును కనుగొనును, అది ఈనాడు మన బైబిలులో 61వ అధ్యాయమందున్నది.

అభిషక్తుడు, చెరలోనున్నవారికి ఎట్లు విడుదల కలిగిస్తాడో, గ్రుడ్డివారికెట్లు మరలచూపునిస్తాడో, యెహోవా అంగీకృత సంవత్సరాన్ని ఎట్లు ప్రకటిస్తాడో అందులోనుండి చదివిన తర్వాత, యేసు ఆ గ్రంథపుచుట్టను పరిచారకునికి అందించి కూర్చొనును. అందరి దృష్టి ఆయనమీదే వున్నది, అప్పుడు ఆయన, బహుశ కొంత వివరించిన తరువాత, వారితో మాట్లాడుచు, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది” అనును.

ఆయన “దయగల మాటలకు” అందరు ఆశ్చర్యపడి ఒకనితోనొకడు ఇలా చెప్పుకొందురు: “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అయితే తాను అద్భుతకార్యములు చేయవలెనని వారు ఎదురుచూస్తున్న సంగతి ఎరిగినవాడై, యేసు వారితో ఇంకను ఇట్లనును: “‘వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెతచెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీస్వదేశమందును చేయుమని’ మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు.” మొదట తన స్వంత ప్రజల ప్రయోజనమగునట్లు తన స్వదేశములోనే ఆయన స్వస్థపరచు పని ప్రారంభించవలెనని, యేసుయొక్క పూర్వపు ఇరుగుపొరుగువారు నిజంగా తలంచుదురు. కావున, వారు యేసు తమను చిన్నచూపు చూసెనని అనుకుంటారు.

వారి ఆలోచనను ఎరిగినవాడై, దానికి అన్వయింపుగల చరిత్రను కొంత ఆయన వివరిస్తాడు. ఏలీయా దినములలో ఇశ్రాయేలు దేశమందు అనేకమంది విధవరాండ్రు ఉండిరి, కాని ఏలీయా వీరిలో ఎవరి ఇంటికిని పంపబడలేదు. అయితే ఆయన సీదోనులోని ఇశ్రాయేలీయురాలు-కాని విధవరాలి ఇంటికి వెళ్లెను. అక్కడ ఆయన ప్రాణమును రక్షించిన ఒక అద్భుత క్రియను జరిగించును. ఆలాగే ఎలీషా కాలములోను, అనేకమంది కుష్ఠరోగులుండినను, ఎలీషా సిరియ దేశస్థుడైన నయమానును మాత్రమే శుద్ధిచేసెను అని ఆయన వారికి చెప్పును.

వారి స్వార్థమును, అవిశ్వాసమును బహిర్గతము చేసిన ఈ అననుకూల చరిత్రాత్మక సారూప్యములద్వారా కోపోద్రేకులై సమాజమందిరములో నున్న వారు లేచి, యేసును పట్టుకొని పట్టణము వెలుపలి వరకు తోలుకొనిపోవుదురు. నజరేతు నిర్మింపబడిన కొండపేటు మీద, వారు పర్వతపు అంచునుండి ఆయనను క్రిందికి పడద్రోయవలెనని ప్రయత్నిస్తారు. అయితే యేసు వారి పట్టు విడిపించుకొని సురక్షితముగా అక్కడనుండి వెళ్లిపోయెను. లూకా 4:16-30; 1 రాజులు 17:8-16; 2 రాజులు 5:8-14.

నజరేతునందు ఉత్తేజము ఎందుకు కలుగును?

యేసు ప్రసంగమునుగూర్చి ప్రజలు ఏమని తలంచెదరు, అయితే ఏది వారిని కోపోద్రేకులను చేయును?

ప్రజలు యేసును ఏమిచేయవలెనని ప్రయత్నిస్తారు?