కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోహానుకు విశ్వాసము లోపించెనా?

యోహానుకు విశ్వాసము లోపించెనా?

అధ్యాయము 38

యోహానుకు విశ్వాసము లోపించెనా?

ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరమునుండి చెరసాలలోయున్న యోహానుకు, నాయీనులో విధవరాలి కుమారుని పునరుత్థానమునుగూర్చిన వార్త తెలిసినది. అయితే దీని ప్రాముఖ్యతనుగూర్చి యోహాను సూటిగా యేసునుండి వినవలెనను కోరికతో, విషయమును వాకబు చేయుటకు తన శిష్యులనిద్దరిని పిలిచి, “రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా?” అని అడుగుటకు వారిని ఆయనయొద్దకు పంపును.

దాదాపు రెండు సంవత్సరముల క్రితము యేసుకు బాప్తిస్మమిచ్చునప్పుడు యేసు మీదికి దేవుని ఆత్మ దిగివచ్చుటను చూసి, దేవుని అంగీకారమును తెలియజేయు స్వరము వినిన యోహాను ప్రత్యేకముగా ఆ ప్రశ్నను అడుగుట ఆశ్చర్యకరముగా కన్పించవచ్చును. యోహాను వేసిన ప్రశ్న, ఆయన విశ్వాసమందు బలహీనుడయ్యెనను ముగింపునకు కొంతమందిని నడుపవచ్చును. అయితే విషయమదికాదు. యోహాను అట్లు సందేహించుచున్నట్లయిన, ఈ సందర్భములో చేసినట్లు, యేసు యోహానునుగూర్చి అంత ఉన్నతముగా మాట్లాడియుండెడివాడు కాదు. అట్లయిన మరి, యోహాను ఎందుకు ఆ ప్రశ్న అడిగెను?

యేసు మెస్సీయ అనుటకు యోహాను కేవలము ఆయననుండి వివరణను కోరియుండవచ్చును. చెరసాలలో కృశించుచున్న యోహానుకు ఇది ఎంతో బలమునిచ్చును. అయితే యోహాను ప్రశ్నలో స్పష్టముగా, అంతకంటె ఎక్కువ ఉన్నది. మెస్సీయద్వారా నెరవేర్చబడునని చెప్పబడిన అన్ని సంగతుల నెరవేర్పును సంపూర్ణము చేయుటకు, మరొకరెవరైనా వస్తున్నారా అనునది ఆయన స్పష్టముగా తెలిసికొనగోరెను.

యోహాను ఎరిగియున్న బైబిలు ప్రవచనముల ప్రకారము, దేవుని అభిషక్తుడు విడుదల తీసుకువచ్చు రాజైయుండవలెను. అయితే, యేసు బాప్తిస్మము తర్వాత అనేక నెలలైపోయినను, యోహాను ఇంకను చెరసాలలో ఖైదిగానేయున్నాడు. కాబట్టి, యోహాను స్పష్టముగా, ‘దేవునిరాజ్యమును స్థాపించి దాని శక్తిని ప్రదర్శించువాడవు నీవేనా, లేక నీ తరువాత వేరొక వ్యక్తి, అనగా నీ స్థానమందు మెస్సీయ మహిమకు సంబంధించిన అద్భుతకరమైన ప్రవచనములన్నింటిని నెరవేర్చు మరొకవ్యక్తి కొరకు మేము వేచియుండవలెనా?’ అని యేసును అడుగుచున్నాడు.

‘రావలసిన వాడను నేనే’ అని యోహాను శిష్యులకు చెప్పుటకు బదులు, యేసు ఆ గడియలోనే గుర్తుంచుకొనదగిన రీతిలో సమస్త విధములైన రోగములతో ఉన్నవారిని బాగుచేసెను. ఆ పిమ్మట ఆయన యోహాను శిష్యులతో, “మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది,” అని చెప్పును.

మరొక మాటలో చెప్పాలంటే, యోహాను ప్రశ్నయందు యేసు తాను చేయుచున్న వాటికంటె ఎక్కువచేయవలెనని, యోహానుకు సహితము విడుదల కల్గించవలెనని ఎదురుచూస్తున్న భావము యుండవచ్చును. అయితే, యేసు చేయుచున్న అద్భుతములకంటె యోహాను ఎక్కువ ఎదురుచూడకూడదని యేసు చెప్పుచున్నాడు.

యోహాను శిష్యులు వెళ్లినవెంటనే, యేసు జనసమూహము వైపుతిరిగి, మలాకీ 3:1 లో యెహోవా సెలవిచ్చిన “దూత” మరియు మలాకీ 4:5, 6 లో చెప్పబడిన ప్రవక్తయైన ఏలీయా యోహానేనని చెప్పెను. ఆ విధముగా ఆయన యోహాను తనకు ముందున్న ప్రవక్తలందరితో సమానుడని ఆయనను ఉన్నతపరచెను. దానిని వివరిస్తూ: “స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది,” అని చెప్పును.

ఇక్కడ యేసు, యోహాను పరలోకరాజ్యములో ఉండడని చూపించుచున్నాడు, ఏలయనగా అందలి అల్పుడు యోహానుకంటె గొప్పవాడై యుండును. యేసు కొరకు యోహాను మార్గము సిద్ధముచేసెను అయితే యేసు తన శిష్యులతో తనరాజ్యమందు సహపరిపాలకులుగా ఉండు నిబంధనను, లేక ఒప్పందమును ముద్రించకముందే ఆయన చనిపోవును. అందుకే యేసు, యోహాను పరలోకరాజ్యములో ఉండడని చెప్పుచున్నాడు. బదులుగా యోహాను దేవునిరాజ్యములో భూమిమీద నివసించువాడై యుండును. లూకా 7:18-30; మత్తయి 11:2-15.

రాబోవువాడవు నీవేనా లేక ఇంకొకవ్యక్తి కొరకు కనిపెట్టవలెనాయని యోహాను ఎందుకు యేసును అడుగును?

యోహాను ఏ ప్రవచనములను నెరవేర్చెనని యేసు చెప్పును?

బాప్తిస్మమిచ్చు యోహాను ఎందుకు యేసుతో పరలోకములో ఉండడు?