కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రహస్యముగా యెరూషలేమును పర్యటించుట

రహస్యముగా యెరూషలేమును పర్యటించుట

అధ్యాయము 65

రహస్యముగా యెరూషలేమును పర్యటించుట

అది సా.శ 32 శరత్కాలము, పర్ణశాలల పండుగ సమీపించినది. యూదులు ఆయనను చంపుటకు ప్రయత్నించినప్పుడు, సా.శ. 31 నుండి యేసు తన పరిచర్యలో అధికభాగమును గలిలయ ప్రాంతమునకు పరిమితము చేసెను. అప్పటినుండి, యూదుల మూడు వార్షిక పండుగలకు హాజరగుటకు మాత్రమే యేసు బహుశ యెరూషలేమును సందర్శించును.

యేసు సహోదరులు ఆయననుచూచి, “ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుమని” బ్రతిమిలాడుదురు. యెరూషలేము యూదయ దేశానికి ముఖ్యపట్టణము మరియు ఆ దేశమంతటికి మత కేంద్రమై యున్నది. “బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తనపని రహస్యమున జరిగింపడని” ఆయన సహోదరులు ఆయనతో తర్కించుదురు.

యాకోబు, సీమోను, యోసేపు మరియు యూదా అనువారు తమ పెద్దన్నయగు యేసు, నిజంగా మెస్సీయయని నమ్మకపోయినను, పండుగనాడు అక్కడకు చేరిన వారందరికి ఆయన తన అద్భుత శక్తులను చూపించవలెనని వారు కోరుదురు. అయితే, యేసు ప్రమాదమును పసికట్టి యున్నాడు. “లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నదని” ఆయన చెప్పును. కావున యేసు తన సహోదరులతో, “మీరు పండుగకు వెళ్లుడి; . . . నేను ఈ పండుగకు ఇంకను వెళ్లనని” చెప్పును.

పర్ణశాలల పండుగ ఏడుదినములుండును. ఎనిమిదవ దినమున పవిత్రకార్యములతో అది ముగియును. ఈ పండుగ వ్యవసాయక సంవత్సరపు ముగింపును గుర్తించును, కావున అది బహుగా ఆనందించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును సమయమై యుండును. ఇతర ప్రయాణికులందరితో కలిసి యేసు సహోదరులు వెళ్లిన అనేక దినముల తర్వాత, ఆయన తన శిష్యులతో కలిసి ఇతరుల కంటబడకుండ రహస్యముగా వెళ్లుదురు. అనేకులు ప్రయాణమై వెళ్లు యొర్దాను సమీపమునగల దారికి బదులు, వారు తమ ప్రయాణమును సమరయ ప్రాంతముగుండా సాగింతురు.

యేసుకు ఆయన సహవాసులకు సమరయ గ్రామములో వసతులు కావలసి యుండును. గనుక, వాటిని సిద్ధపరచుటకు ఆయన తమకంటె ముందుగా దూతలను అక్కడికి పంపును. అయితే ఆయన యెరూషలేముకు వెళ్లుచున్నాడని తెలిసికొని ప్రజలెవరును ఆయనను చేర్చుకొనుటకు నిరాకరించుదురు. కోపగించిన యాకోబు, యోహానులు అందుకు, “ప్రభువా, ఆకాశమునుండి అగ్నిదిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా?” అని అడుగుదురు. అటువంటి దానిని సూచించినందుకు యేసు వారిని గద్దించును, మరియు వారు మరొక గ్రామముగుండా ప్రయాణించుదురు.

వారు దారినపోవుచుండగా, శాస్త్రి ఒకడు యేసుతో, “బోధకుడా నీవెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని” అనును.

దానికి ప్రత్యుత్తరముగా యేసు, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.” శాస్త్రి తన అనుచరుడైనట్లయిన అతడు కష్టము ననుభవించునని యేసు అతనికి వివరించుచున్నాడు. మరియు అటువంటి జీవితమును అంగీకరించుటకు శాస్త్రి వెరయుననే ఉద్దేశ్యమిక్కడ కనబడుతుంది.

మరొక మనుష్యునికి యేసు, “నా వెంటరమ్మని చెప్పెను.”

దానికి అతడు, “నేనువెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని” జవాబిచ్చును.

అందుకు యేసు, “మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవువెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని” వానితో చెప్పును. నిజానికి, ఆ మనుష్యుని తండ్రి ఇంకను చనిపోలేదు, అలా జరిగియున్నట్లయిన అతడు యేసు చెప్పుదానిని వినుటకు ఇక్కడ ఉండేవాడుకాదు. ఆ కుమారుడు తనతండ్రి చనిపోవువరకు తనకు సమయమిమ్మని అడుగుచున్నాడు. దేవుని రాజ్యమును తన జీవితములో మొదటిస్థాన మందుంచుటకు అతడు సిద్ధపడలేదు.

వారు యెరూషలేముకు వెళ్లుచుండగా, మరొక మనుష్యుడు యేసునొద్దకు వచ్చి, “ప్రభువా, నీవెంట వచ్చెదను గాని నా యింటనున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని” అడుగును.

దానికి జవాబుగా యేసు, “నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పును.” యేసు శిష్యులుగా ఉండువారు తప్పక తమదృష్టిని రాజ్యసేవపై కేంద్రీకరించవలెను. దున్నువాడు తిన్నగా చూడకపోయినట్లయిన, చాళ్లు వంకరటింకరగా వచ్చునట్లే, ఈ పాతవిధానమువైపు వెనుకకు తిరిగిచూచు వారెవరైనను నిత్యజీవమునకు నడుపు దారిలోనుండి తప్పి పడిపోవుదురు. యోహాను 7:2-10; లూకా 9:51-62; మత్తయి 8:19-22.

యేసు సహోదరులు ఎవరు, మరియు వారు ఆయననుగూర్చి ఎట్లు భావింతురు?

సమరయులు ఎందుకు అంత అనాగరికముగా ప్రవర్తింతురు, కాగా యాకోబు, యోహాను ఏమిచేయగోరుదురు?

దారిలో యేసు ఏ మూడు విధములైన సంభాషణలు చేయును, మరియు ఆయన ఎట్లు స్వయం-త్యాగ సేవయొక్క అవసరతను నొక్కితెలియజేయును?