కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్రాంతిదినమందు వెన్నులు త్రుంచుట

విశ్రాంతిదినమందు వెన్నులు త్రుంచుట

అధ్యాయము 31

విశ్రాంతిదినమందు వెన్నులు త్రుంచుట

త్వరలోనే యేసు ఆయన శిష్యులు యెరూషలేమును విడిచి గలిలయకు ప్రయాణమైరి. అది వసంతకాలము, పొలములలో కాడలపై ధాన్యపువెన్నులున్నవి. శిష్యులు ఆకలిగాయున్నారు. అందువలన వారు వెన్నులు త్రుంచి తినసాగిరి. అయితే అది విశ్రాంతిదినమైనందున, వారి చర్యలు గమనించబడెను.

యెరూషలేములోని మతనాయకులు విశ్రాంతిదినమును ఉల్లంఘించుచున్నాడను ఆరోపణతో యేసును చంప ప్రయత్నించిరి. ఇప్పుడు పరిసయ్యులు ఒక నిందనుతెచ్చుదురు. “ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని” వారు ఆరోపింతురు.

వెన్నులు త్రుంచి చేతులతో నలిపి తినుటను పంటనూర్చుటయని పరిసయ్యులు వాదింతురు. పనినిగూర్చి వారిచ్చు నిష్కర్ష భావము విశ్రాంతిదినమును భారమైనదిగా చేసెను, అయితే అది సంతోషమిచ్చునదిగా, ఆత్మీయముగా క్షేమాభివృద్ధికరమైనదిగా యుండవలెను. కాబట్టి తన విశ్రాంతి దినమునకు అటువంటి అనవసరపు నిష్కర్ష, అన్వయింపును యెహోవా దేవుడు ఎన్నడును సంకల్పించడని చూపించుటకు యేసు వారికి అనేక లేఖనానుసారమైన ఉదాహరణలను చూపును.

దావీదు మరియు ఆయన మనుష్యులు ఆకలిగొనియున్నప్పుడు, వారు దేవుని మందిరమందలి సముఖపు రొట్టెలు తినిరని యేసు చెప్పును. ఆ రొట్టెలు అప్పటికే యెహోవా సన్నిధినుండి తీసివేయబడి అక్కడ వెచ్చని రొట్టెలు ఉంచబడెను, అవి సాధారణముగా యాజకులు తినుటకు కేటాయించబడును. అయినను, ఆ పరిస్థితిలో వాటిని తినినందున దావీదు మరియు ఆయన మనుష్యులు ఖండింపబడలేదు.

మరొక ఉదాహరణ చెప్పుచూ యేసు ఇట్లనును: “యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?” అవును, విశ్రాంతిదినమున సహితము యాజకులు జంతుబలులను సిద్ధముచేయుటలో జంతువులను చంపుట మరియు ఇతర కార్యములను జరిగించేవారు. “అయితే దేవాలయముకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నానని” యేసు వారికి తెలియజేయును.

పరిసయ్యులకు బుద్ధిచెప్పుచు యేసు ఇంకను, “‘కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను’ అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పుతీర్చకపోదురు” అని చెప్పును. ఆ తర్వాత ఆయనిట్లు తేల్చిచెప్పును: “కాగా మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు.” ఈ మాట చెప్పుటలో యేసు భావమేమి? యేసు తన వెయ్యి సంవత్సరముల సమాధానకరమైన రాజ్యపరిపాలనను సూచించుచున్నాడు.

నేడు వాడుకగాయున్న బలత్కారము మరియు యుద్ధముతో ఇప్పటికి గత 6,000 సంవత్సరములుగా మానవజాతి అపవాదియైన సాతాను ప్రాబల్యముక్రింద ఘోరమైన దాసత్వమును అనుభవించుచున్నది. దానికి బదులుగా క్రీస్తుయొక్క మహాగొప్ప విశ్రాంతిదిన పరిపాలన అటువంటి బాధ, వేదనలనుండి విశ్రాంతినిచ్చు సమయమై యుండును. మత్తయి 12:1-8; లేవీయకాండము 24:5-9; 1 సమూయేలు 21:1-6; సంఖ్యాకాండము 28:9; హోషేయ 6:6.

యేసు శిష్యులకు వ్యతిరేకముగా ఏమి ఆరోపింపబడును, దానికి యేసు ఎట్లు జవాబిచ్చును?

పరిసయ్యులు తప్పిపోయిన దేనిని యేసు ఎత్తిచూపును?

ఏ విధముగా యేసు “విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు”?