కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎందుకింతటి వేదన, అన్యాయమున్నది?

ఎందుకింతటి వేదన, అన్యాయమున్నది?

అధ్యాయం 6

ఎందుకింతటి వేదన, అన్యాయమున్నది?

1, 2. మానవ అనుభవం దృష్ట్యా, ఎలాంటి ప్రశ్నలు అడుగవచ్చును?

1 పరదైసు పరిస్థితుల్లో పరిపూర్ణ ప్రజలు భూమ్మీద నిత్యము జీవించాలని సర్వోన్నతుడు సంకల్పిస్తే, అందింకా ఆయన సంకల్పమైతే ఇప్పుడు పరదైసు ఎందుకు లేదు? దానికి బదులు, మానవులు ఇన్ని శతాబ్దాలుగా ఎందుకు వేదనను, అన్యాయాన్ని అనుభవిస్తూవస్తున్నారు?

2 నిస్సందేహంగా, యుద్ధం, ఏకఛత్రాధిపత్య పోరాటాలు, మోసం, అన్యాయం, దారిద్ర్యం, విపత్తు, రోగమరణాల ద్వారా మానవ చరిత్ర దుఃఖంతో నిండిపోయింది. ఇంతమంది అమాయకులకు ఇంత చెడ్డవి ఎందుకు సంభవించాయి? దేవుడు సర్వశక్తిమంతుడైతే, వేలాది సంవత్సరాలుగా ఇంతగొప్ప వేదనను ఆయనెందుకు అనుమతించాడు? దేవుడు ఈ విశ్వాన్ని ఇంత చక్కగా రూపించి క్రమపర్చాడు గదా, మరి భూమిపై ఆయనెందుకు ఇంత అక్రమాన్ని, నాశనాన్ని అనుమతిస్తాడు?

ఒక ఉదాహరణ

3-5. (ఎ) క్రమముగల దేవుడు భూమిపై ఎందుకు అక్రమాన్ని అనుమతిస్తాడో అర్థంచేసుకోవడానికి మనకే ఉదాహరణ సహాయపడగలదు? (బి) భూమ్మీది పరిస్థితికున్న అనేక ప్రత్యామ్నాయాల్లో ఏది సరిపోతుంది?

3 క్రమంగల దేవుడు భూమిపై ఎందుకు అక్రమాన్ని అనుమతిస్తాడో ఉదహరించుటకు మనమొక దృష్టాంతము నుపయోగిద్దాం. మీరొక అరణ్యంలో నడుస్తూ ఒక యింటి దగ్గరకు వచ్చారనుకోండి. ఆ యిల్లంతా చెల్లాచెదురుగావుంది. కిటికీలు విరిగిపోయాయి, పైకప్పు బాగా చెడిపోయింది, చెక్కలతో నిర్మించిన వరండా పైభాగం పూర్తిగా చిల్లులు పడిపోయింది, తలుపు సగంవిరిగి వ్రేలాడుతోంది, కుళాయిలు పనిచేయడం లేదు.

4 ఈ ఇంటికి ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి, ఆ యింటిని తెలివిగల వాడెవడు నిర్మించియుండడని మీరొక నిర్ణయానికొస్తారా? అలా చిందరవందరగా ఉండుట ఆ యింటిని ఒక ఆకస్మిక సంఘటన రూపించిందని మీరు నమ్ముతారా? అలాకాకుండ దానినెవరో రూపించి, నిర్మించారని మీరొక నిర్ణయానికొస్తే, ఆ వ్యక్తికి నైపుణ్యంగాని, ఆలోచనగాని లేదని మీరనుకుంటారా?

5 మీరా నిర్మాణాన్ని బాగుగా పరిశీలిస్తే, అది మొదట చక్కగా, జాగ్రత్తగా ఆలోచించి కట్టబడిందనే రుజువును మీరు చూస్తారు. అయితే అదిప్పుడు బాగా దెబ్బతిని శిథిలావస్థలో ఉంది. దాని లోపాలు, సమస్యలు ఏమి సూచిస్తున్నాయి? అవి ఈ విషయాల్ని సూచించవచ్చును: (1) ఆ గృహ యజమాని మరణించాడు; (2) సామర్థ్యంగల నిర్మాణకుడే గాని ఆయనకిప్పుడు ఈ యింటిపై ఏ మాత్రం ఆసక్తిలేదు; లేదా (3) ఆయన యింటిని ఏ ప్రశంసలేని వారికి తాత్కాలికంగా అద్దెకిచ్చివుంటాడు. ఈ చివరి పరిస్థితే ఈ భూమి విషయంలో జరిగింది.

ఎక్కడ తప్పిదం దొర్లింది

6, 7. ఆదాము హవ్వలు దేవుని నియమాన్ని ఉల్లంఘించినప్పుడు వారికేమి సంభవించింది?

6 ప్రజలు బాధననుభవించాలని, లేదా మరణించాలని దేవుని సంకల్పము కాదనే విషయం మనం బైబిలు తొలిచరిత్ర నుండి నేర్చుకుంటాము. మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులైనందున మరణించారు. (ఆదికాండము 2, 3 అధ్యాయములు) వారు అవిధేయులైనప్పుడు, వారెంత మాత్రం దేవుని చిత్తంచేసే వారిగా లేకుండిరి. వారు దేవుని సంరక్షణ నుండి వైదొలగారు. నిజానికి వారు దేవునినుండి, అనగా “జీవపు ఊట” నుండి తమ్మునుతాము వేరుపరచుకున్నారు.—కీర్తన 36:9.

7 విద్యుత్‌ కనెక్షన్‌ తీసివేసినప్పుడు నెమ్మదిగా ఆగిపోవు యంత్రమువలె వారి శరీరము, మనస్సులు శక్తిహీనమయ్యాయి. తత్ఫలితంగా, ఆదాము హవ్వలు క్రమేపి క్షీణించి, చివరకు చనిపోయారు. అప్పుడేమి జరిగింది? వారెక్కడనుండి వచ్చారో అక్కడికే వారు తిరిగివెళ్లారు: “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” తన నియమాల ఉల్లంఘన ఫలితంగా మరణం సంభవిస్తుందని దేవుడు వారినిలా హెచ్చరించాడు: “నీవు నిశ్చయముగా చచ్చెదవు.”—ఆదికాండము 2:17; 3:19.

8. మన మొదటి తలిదండ్రుల పాపము మానవకుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపింది?

8 మన మొదటి తలిదండ్రులు చనిపోవడమే కాదు, వారి సంతానమంతా అనగా యావత్‌ మానవ కుటుంబం మరణానికి లోనయ్యింది. ఎందుకు? ఎందుకనగా జన్యు నియమాల ప్రకారం, పిల్లలు తమ తలిదండ్రుల లక్షణాలను వారసత్వంగా పొందుతారు. మన మొదటి తలిదండ్రుల పిల్లలందరు అసంపూర్ణతను, మరణాన్ని వారసత్వంగా పొందారు. రోమీయులు 5:12 మనకిలా చెబుతుంది: “ఒక మనుష్యుని [మానవజాతి పితరుడగు ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున [అసంపూర్ణతను, అనగా పాప స్వభావాలను స్వాస్థ్యంగా పొందినందున] మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” ప్రజలకు కేవలం పాపము, అసంపూర్ణత, మరణము మాత్రమే తెలుసు గనుక, అవి సహజమని, అగత్యమని కొందరనుకొంటారు. అయితే, ఆది మానవులు నిత్యము జీవించే సామర్థ్యముతో, కోరికతో సృష్టింపబడ్డారు. అందుకే అనేకమంది ప్రజలు తమ జీవితం మరణంతో ముగుస్తుందనే ఉత్తరాపేక్ష ఎంతో నిరాశ కల్గించేదిగా ఉందని కనుగొన్నారు.

ఎందుకింత కాలం

9. ఇంత దీర్ఘకాలంగా వేదన ఉండటానికి దేవుడెందుకు అనుమతించాడు?

9 మానవులు ఇంతకాలం తమ స్వంత మార్గంలోనే వెళ్లడానికి దేవుడు వారినెందుకు అనుమతించాడు? ఇన్ని శతాబ్దాలపాటు వేదన ఉండటానికి ఆయనెందుకు అనుమతించాడు? పరిపాలించడానికి ఎవరికి హక్కుంది? మానవులపై దేవుడు పరిపాలకునిగా ఉండాలా లేక ఆయన లేకుండా మానవులే విజయవంతంగా తమ్మునుతాము పరిపాలించుకొనగలరా? అనే ఒక ప్రాముఖ్యమైన వివాదాంశం ఉత్పన్నం కావడమే దానికిగల ఒక ముఖ్య కారణం.

10. మానవులకు ఏ బాధ్యతతో ఎలాంటి సామర్థ్యం ఇవ్వబడింది?

10 మానవులు స్వేచ్ఛాచిత్తంతో అనగా ఎంపిక చేసుకునే సామర్థ్యంతో సృష్టింపబడ్డారు. వారు మరమనుష్యులుగా లేదా కేవలం పశుజ్ఞానంతో నడుచుకొనే జంతువులవలె చేయబడలేదు. కావున తాము ఎవరిని సేవించాలో మానవులు ఎంపిక చేసుకొనగలరు. (ద్వితీయోపదేశకాండము 30:19: 2 కొరింథీయులు 3:17) దేవుని వాక్యమిలా సలహానిస్తుంది: “స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.” (1 పేతురు 2:16) స్వేచ్ఛగా ఎంచుకునే అద్భుతకరమైన వరం మానవులకున్ననూ, తామెంచుకున్న క్రియా పరిణామాలను వారు అంగీకరించాల్సిందే.

11. దేవునినుండి స్వతంత్రంగా ప్రవర్తించే విధానం జయప్రదమౌతుందా లేదాని తెలిసికొనుటకున్న ఒకేఒక మార్గమేమిటి?

11 మన మొదటి తలిదండ్రులు తప్పుడు ఎంపిక చేసుకున్నారు. వారు దేవునినుండి స్వేచ్ఛగావుండే మార్గాన్ని ఎంచుకున్నారు. నిజమే, మొదటి జత తమ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగపర్చిన ఆ తిరుగుబాటుదారులను దేవుడు వెంటనే చంపగలిగి యుండేవాడే. అయితే మానవులను పరిపాలించే దేవుని హక్కును గూర్చి ఉత్పన్నమయిన ప్రశ్ననది పరిష్కరించి యుండేది కాదు. మొదటి జత దేవునినుండి స్వేచ్ఛను కోరుకొన్నందున, ఆ ప్రశ్నకు జవాబివ్వాలి: వారి చర్య సంతోషభరితమైన, విజయవంతమైన జీవితాన్ని తీసుకురాగలదా? అది వారు స్వంతగా ఎంచుకున్న విధానం గనుక, మన మొదటి తలిదండ్రులను, వారి సంతానమును వారి స్వంతమార్గంలో వెళ్లనిచ్చుటే దానికున్న ఏకైక పరిష్కార మార్గం. మానవులు తమ సృష్టికర్తనుండి స్వతంత్రంగా తమనుతాము విజయవంతముగా పరిపాలించుకొనుటకు సృష్టింపబడ్డారా లేదాయని కాలమే చూపుతుంది.

12. మానవ పరిపాలన ఎలావుంటుందని యిర్మీయా చెప్పాడు, ఎందుకలా ఉంటుంది?

12 దాని ఫలితమేమిటో బైబిలు రచయిత యిర్మీయాకు తెలుసు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేక చురుకైన శక్తితో నడిపింపబడి ఉన్నసత్యాన్ని ఆయనిలా చెప్పాడు: ‘యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా నన్ను సరిదిద్దుము.’ (యిర్మీయా 10:23, 24) మానవులకు దేవుని పరలోక జ్ఞాన నిర్దేశకత్వము అవసరమని ఆయనకు తెలుసు. ఎందుకు? ఎందుకంటే, తన నడిపింపు లేకుండా విజయవంతముగా ప్రవర్తించునట్లు దేవుడు మానవులను సృష్టించలేదు.

13. వేలాది సంవత్సరాల మానవ పరిపాలనా ఫలితాలు నిస్సందేహంగా దేనిని చూపించాయి?

13 వేలాది సంవత్సరాల మానవుని పరిపాలనా ఫలితాలు సృష్టికర్త ప్రమేయం లేకుండ మానవులు తమ మార్గము నేర్పరచుకోలేరని నిస్సందేహముగా చూపిస్తున్నవి. తాముగా ప్రయత్నించిన మీదట వారికి కలిగిన విపత్కర ఫలితాలనుబట్టి వారు తమనే నిందించుకోవాలి. బైబిలు ఈ విషయాన్ని యిలా స్పష్టం చేస్తున్నది: “[దేవుడు] ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు, ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు, మూర్ఖతగల వక్రవంశము.”—ద్వితీయోపదేశకాండము 32:4, 5.

దేవుడు త్వరలో జోక్యం చేసుకుంటాడు

14. మానవ వ్యవహారాల్లో జోక్యంచేసుకోవడాన్ని దేవుడెందుకు ఇక ఎంతమాత్రం ఆలస్యంచేయడు?

14 మానవ పరిపాలనా వైఫల్యాన్ని ప్రదర్శించుటకు సరిపడునట్లు శతాబ్దాల కాలాన్ని అనుమతించినందున, దేవుడిప్పుడు మానవ వ్యవహారాల్లో జోక్యంచేసుకొని వేదనను, దుఃఖాన్ని, రోగాన్ని, మరణాన్ని అంతమొందించే చర్యగైకొనుటకు ఉపక్రమించగలడు. విజ్ఞాన రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్యరంగంలో, ఇతర రంగాల్లో మానవులు ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు అనుమతించినందున, సృష్టికర్త లేకుండా మానవులు తాముగా శాంతిప్రదమైన, పరదైసులాంటి ప్రపంచాన్ని తీసుకురాగలరో లేదో ప్రదర్శించడానికి దేవుడు మరిన్ని శతాబ్దాల కాలాన్ని వారికి అనుమతించాల్సిన అవసరం ఎంతమాత్రము లేదు. వారలా చేయలేదు, చేయలేరు కూడ. దేవుని నుండి స్వతంత్రముగా ఉండుట ఫలితంగా లోకం అసహ్యంగా, ద్వేషపూరితంగా, మరణకరమైనదిగా తయారైంది.

15. మనమే బైబిలు సలహాను లక్ష్యపెట్టడం మేలు?

15 మానవజాతికి సహాయం చేయాలనే చిత్తశుద్ధిగల పరిపాలకులుండిననూ, వారి ప్రయత్నాలు జయప్రదం కాలేదు. నేడు ప్రతిచోట మనం మానవ సంబంధాలు పాడైపోయిన రుజువులనే చూస్తున్నాం. అందుకే బైబిలిలా సలహానిస్తుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.”—కీర్తన 146:3.

[అధ్యయన ప్రశ్నలు]

[24, 25వ పేజీలోని చిత్రం]

చిత్తశుద్ధిగల లోక పరిపాలకులు సహితం శాంతిప్రదమైన, పరదైసువంటి లోకాన్ని తీసుకురాలేకపోయారు