కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితానికొక గొప్ప సంకల్పముంది

జీవితానికొక గొప్ప సంకల్పముంది

అధ్యాయం 5

జీవితానికొక గొప్ప సంకల్పముంది

1, 2. దేవుడు మనయెడల శ్రద్ధచూపిస్తున్నాడని మనమెలా చెప్పగలము, జీవిత ప్రశ్నలకు తగిన సమాధానముల కొరకు మనమెటువైపు తిరుగవలెను?

1 ఈ భూమి దానియందలి జీవరాసుల నిర్మాణపు తీరుతెన్నులు వాటిని సృష్టించినవాడు నిజంగా శ్రద్ధచూపే ప్రేమగల దేవుడని చూపిస్తున్నవి. ఆయన శ్రద్ధ వహిస్తున్నాడని ఆయన వాక్యమగు బైబిలు చూపిస్తూ, మనమీ భూమ్మీద ఎందుకున్నాము? మనమెక్కడికి వెళ్తున్నాము? అనే ప్రశ్నలకు శ్రేష్ఠమైన సమాధానాలిస్తుంది.

2 ఆ జవాబుల కొరకు మనము బైబిలును పరిశోధించాలి. దేవుని వాక్యము ఇట్లంటున్నది: “మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.” (2 దినవృత్తాంతములు 15:2) కాబట్టి, దేవుని వాక్యాన్ని పరిశోధించుట ఆయన సంకల్పాన్ని గూర్చి మనకేమి వెల్లడిచేస్తుంది?

దేవుడు మానవుల్ని ఎందుకు సృజించాడు

3. దేవుడు భూమినెందుకు సృష్టించాడు?

3 ప్రత్యేకంగా మానవుల్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఈ భూమిని సిద్ధం చేశాడని బైబిలు చూపిస్తున్నది. దేవుడు భూమిని “నిరాకారముగానుండునట్లు . . . సృజింపలేదు, నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను” అని యెషయా 45:18 చెబుతున్నది. ప్రజలు కేవలం ఉనికిలో ఉండుటకు కాదుగాని వారు జీవితాన్ని సంపూర్ణముగా అనుభవించునట్లు వారికి కావలసిన సమస్తాన్ని ఆయన భూమియందు సమకూర్చాడు.—ఆదికాండము 1, 2 అధ్యాయములు.

4. దేవుడు మొదటి మానవులను ఎందుకు సృష్టించాడు?

4 తన వాక్యమందు, దేవుడు మొదటి మానవులగు ఆదాము హవ్వలను సృష్టించుటను గూర్చి తెలియజేస్తూ, మానవ కుటుంబం విషయంలో తన మదిలో ఉన్నదేమిటో వెల్లడిచేశాడు. ఆయనిట్లన్నాడు: “మన స్వరూపమందు మనపోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక.” (ఆదికాండము 1:26) మానవులు “సమస్త భూమిని” అందలి జంతు సృష్టిని పర్యవేక్షించాల్సి యుండిరి.

5. మొదటి మానవులు ఎచ్చట ఉంచబడిరి?

5 మధ్య ప్రాచ్యమందు ఏదెను అని పిలువబడిన ప్రాంతంలో దేవుడు ఒకపెద్ద ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశాడు. ఆ పిమ్మట ఆయన “నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.” అది మొదటి మానవులు తినడానికి సమస్తమును కలిగివున్న పరదైసు. దానిలో “చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతివృక్షమును,” ఆలాగే ఇతర వృక్షాలు, వింతైన అనేకరకాల జంతుజాలములు ఉండెను.—ఆదికాండము 2:7-9, 15.

6. ఎటువంటి మానసిక, భౌతిక లక్షణాలతో మానవులు సృజించబడ్డారు?

6 రోగగ్రస్థులై, వృద్ధులై లేదా మరణించకుండునట్లు మొదటి మానవుల శరీరములు పరిపూర్ణముగా చేయబడెను. స్వేచ్ఛాచిత్తం వంటి ఇతర లక్షణాలు కూడా వారికి ఇవ్వబడ్డాయి. వారు కలుగజేయబడిన విధం ఆదికాండము 1:27 లో యిలా వివరింపబడింది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” మన దేవుని స్వరూపమందు సృజింపబడినందున, మనకు మానసిక, భౌతిక గుణాలే కాదు నైతిక, ఆత్మీయ లక్షణాలు కూడా ఇవ్వబడ్డాయి, కాగా మనం నిజంగా సంతోషంగా ఉండాలంటె ఇవి సంతృప్తికరంగా ఉండాలి. ఈ అవసరతలను ఆలాగే ఆహారము, నీరు, గాలి కొరకైన అవసరతలను తీర్చే ఏర్పాటు దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.”—మత్తయి 4:4.

7. మొదటి మానవజతకు ఏ ఉత్తరువు ఇవ్వబడింది?

7 అంతేకాకుండ, మొదటి మానవ దంపతులు ఏదెనులో ఉండగా దేవుడు వారికి ఈ అద్భుతకరమైన ఉత్తరవునిచ్చాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించుడి.” (ఆదికాండము 1:28) దీనితోవారు పరిపూర్ణమైన పిల్లలకు జన్మనివ్వగల వారయ్యారు. అలా జనము వృద్ధియగు కొలది, వారు పరదైసగు ఏదెను తోట హద్దులను విస్తరింపజేసే ఆనందదాయకమైన పని కలిగియుండేవారు. చివరకు, ఈ యావత్‌ భూమి నిత్యమూ జీవించగల పరిపూర్ణమైన, సంతోషభరితులైన ప్రజలతో నింపబడిన పరదైసుగా విరజిల్లేది. దీనినంతటిని చేసిన తర్వాత “దేవుడు తానుచేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెనని” బైబిలు మనకు తెల్పుతున్నది.—ఆదికాండము 1:31; కీర్తన 118:17 కూడ చూడండి.

8. భూమియెడల మానవులెట్లు శ్రద్ధచూపవలసియుండిరి?

8 మానవులు తమకు లోబర్చబడిన భూమిని తమ ప్రయోజనము కొరకు ఉపయోగించవలసియుండెననుట స్పష్టం. అయితే దీనిని వారు బాధ్యతాయుతంగా చేయాలి. మానవులు ఈ భూమియొక్క గౌరవపూర్వక నిర్వాహకులై యుండాలి, అంతేగాని దానిని పాడుచేయువారై యుండకూడదు. మనమీనాడు చూస్తున్నట్లుగా భూమిని నాశనం చేయడం దేవుని చిత్తానికి వ్యతిరేకం, ఆలాగే ఆ నాశనమందు భాగం వహించువారు ఈ భూమ్మీది జీవిత సంకల్పానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వారు దానికి అపరాధ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ఎందుకంటె దేవుడు “భూమిని నశింపజేయు వారిని నశింపజేయునని” బైబిలు చెబుతున్నది.—ప్రకటన 11:18.

ఇంకనూ దేవుని సంకల్పము

9. దేవుని సంకల్పం నెరవేరుతుందని మనకెందుకు దృఢనమ్మకం కలదు?

9 ఆ విధంగా, మొదటినుండి కూడ పరిపూర్ణ మానవ కుటుంబము భూపరదైసులో నిత్యమూ జీవించాలనేదే దేవుని సంకల్పం. ఆయన సంకల్పమింకనూ అదే, పైగా ఆ సంకల్పము తప్పక నెరవేరుతుంది. బైబిలు ఇలా చెబుతున్నది: “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును.” “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను దాని సఫలపరచెదను.”—యెషయా 14:24; 46:11.

10, 11. పరదైసును గూర్చి యేసు, పేతురు, కీర్తనల రచయిత దావీదు ఎలా మాట్లాడారు?

10 తనకు భవిష్యత్తు నిరీక్షణనిమ్మని ఒక మనుష్యుడు అడిగినప్పుడు భూపరదైసును పునరుద్ధరించు దేవుని సంకల్పాన్ని గూర్చి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇట్లన్నాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.” (లూకా 23:43) రానైయున్న నూతన లోకాన్నిగూర్చి అపొస్తలుడైన పేతురు కూడ యిలా ప్రవచించాడు: “మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల [పరలోకమునుండి పరిపాలించే క్రొత్త ప్రభుత్వ ఏర్పాటు] కొరకును క్రొత్త భూమి [క్రొత్త మానవసమాజము] కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.

11 కీర్తనల రచయిత దావీదు కూడా రానైయున్న నూతన లోకాన్ని, అది నిలిచే కాలాన్నిగూర్చి వ్రాశాడు. ఆయనిలా ప్రవచించాడు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) అందుకే యేసు యిలా వాగ్దానం చేశాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”—మత్తయి 5:5.

12, 13. మానవజాతి యెడల దేవుని దివ్య సంకల్పాన్ని క్లుప్తీకరించండి.

12 సమస్త దుష్టత్వం, నేరం, రోగం, దుఃఖం, వేదనలేని పరదైసు భూమిలో నిత్యము జీవించుట ఎంత గొప్ప ఉత్తరాపేక్ష! బైబిలు చివరి పుస్తకమందు దేవుని ప్రవచనవాక్యము ఈ గొప్ప సంకల్పాన్ని క్లుప్తీకరిస్తూ యిలా ప్రకటించింది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” అదింకా ఇట్లనుచున్నది: “సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుము.”—ప్రకటన 21:4, 5.

13 అవును, దేవుని మదిలో మహాదివ్య సంకల్పమున్నది. అదేమనగా, నిత్యపరదైసువంటి ఒక నీతియుక్త నూతనలోకమే. తాను సంకల్పించిన దానిని నెరవేర్చగలవాడు దీనిని ప్రవచించాడు, ఆయన “మాటలు నమ్మకమును నిజమునై యున్నవి.”

[అధ్యయన ప్రశ్నలు]

[20, 21వ పేజీలోని చిత్రం]

భూపరదైసులో మానవులు నిత్యము జీవించాలని దేవుడు సంకల్పించాడు. అదింకనూ ఆయన సంకల్పమైయుంది

[22 వ పేజీలోని చిత్రం]

అద్దెకున్న వారు తన యింటిని పాడుచేస్తే యజమాని వారిని లెక్క అడుగుతాడు