భూపరదైసులో నిత్యము జీవించుము
అధ్యాయం 8
భూపరదైసులో నిత్యము జీవించుము
1, 2. దేవుని రాజ్యం క్రింద జీవితం ఎలావుంటుంది?
1 దేవుడు ఈ భూమినుండి దుష్టత్వాన్ని, వేదనను తొలగించి, తన ప్రేమగల పరలోక రాజ్య అధీనంలో నూతనలోకాన్ని ప్రవేశపెట్టినప్పుడు జీవితమెలా ఉంటుంది? ‘తన గుప్పిలిని విప్పి ప్రతిజీవి కోరికను తృప్తిపరచెదనని’ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.—కీర్తన 145:16.
2 మీ న్యాయమైన కోర్కెలేమి? అవి సంతోషభరితమైన జీవితము, ప్రయోజనకరమైన పని, వస్తు సమృద్ధి, అందమైన పరిసరాలు, ప్రజలమధ్య సమాధానము, మరియు అన్యాయం, రోగం, వేదన, మరణం నుండి విడుదలకు సంబంధించినవి కావా? మరి ఆనందదాయకమైన ఆత్మీయ దృక్కోణం విషయమేమి? అవన్నియు దేవుని రాజ్య పరిపాలన క్రింద త్వరలోనే నిజమౌతాయి. నూతన లోకంలో లభించే అద్భుతకరమైన ఆశీర్వాదాల్ని గూర్చి తెలియజేసే బైబిలు ప్రవచనాల్ని గమనించండి.
మానవజాతికి పరిపూర్ణ సమాధానము
3-6. నూతన లోకంలో మానవులకు సమాధానం ఉంటుందని మనకే అభయం కలదు?
3 “[దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:9.
4 “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.
5 “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
6 “భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు.”—యెషయా 14:7.
మనిషి, మృగానికి సమాధానము
7, 8. ప్రజలకు, మృగాలకు మధ్య ఎలాంటి సమాధానం ఉంటుంది?
7 “తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును, చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును. దూడయు కొదమసింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా, బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దుమేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తనచెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశనము చేయదు.”—యెషయా 11:6-9.
8 “ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. . . . వారిని నిర్భయముగా నివసింపజేయుదును.”—హోషేయ 2:18.
పరిపూర్ణ ఆరోగ్యము, నిత్యజీవము
9-14. నూతన లోకమందలి ఆరోగ్య పరిస్థితులను వర్ణించండి.
9 “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులువేయును, మూగవాని నాలుక పాడును.”—యెషయా 35:5, 6.
10 “[దేవుడు] వారి కన్నుల ప్రతిబాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:4.
11 “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.
12 “అప్పుడు వాని మాంసము బాలుర మాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.”—యోబు 33:25.
13 “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము.”—రోమీయులు 6:23.
14 “ఆయన . . . యందు విశ్వాసముంచు ప్రతివాడును . . . నిత్యజీవము” పొందును.—యోహాను 3:16.
మృతులు జీవమునకు తేబడుదురు
15-17. చనిపోయిన వారికే నిరీక్షణ కలదు?
15 “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.”—అపొస్తలుల కార్యములు 24:15.
16 “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో [దేవుని జ్ఞాపకమందు] నున్నవారందరు ఆయన శబ్దమువిని . . . బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.
17 “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును [సమాధి] వాటి వశముననున్న మృతుల నప్పగించెను.”—ప్రకటన 20:13.
భూమి, సమృద్ధిగల పరదైసు
18-22. యావత్ భూమి దేనిగా మార్చబడుతుంది?
18 “దీవెనకరమగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు.”—యెహెజ్కేలు 34:26, 27.
19 “అపుడు భూమి దాని ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.”—కీర్తన 67:6.
20 “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును.”—యెషయా 35:1.
21 “మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును, దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును.”—యెషయా 55:12, 13.
22 “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.”—లూకా 23:43.
అందరికి మంచి గృహములు
23, 24. ప్రతివారికి సరిపడునన్ని మంచి గృహాలుంటాయనే ఏ అభయం మనకుంది?
23 “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు . . . వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. . . . తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు.”—యెషయా 65:21-23.
24 “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును.”—మీకా 4:4.
మీరు పరదైసులో నిత్యము జీవించగలరు
25. భవిష్యత్తు యెడల మనకెటువంటి మహోజ్వల మనోభావం కలదు?
25 భవిష్యత్తు కొరకు ఎంతటి మహోజ్వల ఉత్తరాపేక్ష! దేవుని నూతన లోకంలో నేటి సమస్యలన్నియు శాశ్వతంగా సమసిపోవుననే బలమైన నిరీక్షణకు ముడిపెట్టినప్పుడు ప్రస్తుత జీవితాలకు నిజంగా ఎంతచక్కని సంకల్పముండగలదు! “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.” (యెషయా 65:17) అప్పుడు జీవము నిరంతరముండునని తెలుసుకొనుట ఎంత ఓదార్పుకరం: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన [దేవుడు] మ్రింగివేయును.”—యెషయా 25:8.
26. దేవుని నూతన లోకమందలి నిత్యజీవానికి కీలకమైనదేమి?
26 ప్రస్తుతం ఎంతో సమీపంగానున్న నూతన పరదైసు లోకంలో మీరు నిత్యజీవాన్ని కోరుకుంటున్నారా? ‘ఈ లోకాంతమందు దేవుని అనుగ్రహం పొంది ఆయన నూతన లోకంలో జీవించాలంటె నాకేమి అవసరం?’ అని మీరడుగవచ్చు. దేవునికి చేసిన ప్రార్థనలో యేసు సూచించిన దానిని మీరు చేయాలి: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
27. దేవుని సంకల్పమందు భాగం వహించడానికి మీరేమీ చేయాలి?
27 కాబట్టి, మీరొక బైబిలును సంపాదించి ఈ బ్రోషర్‌నందు మీరు చదివిన వాటిని రూఢిపరచుకోండి. ఈ బైబిలు సత్యాలను పఠించి, బోధించేవారి కొరకు అన్వేషించండి. బైబిలుకు విరుద్ధమైన కార్యాలు బోధించి వాటినిచేయు వేషధారణగల మతాలను విడిచిపెట్టండి. ఇప్పటికే దేవుని చిత్తంచేయు లక్షలాదిమందితో కలిసి పరదైసు భూమిపై మానవులు నిత్యం జీవించగలరను దేవుని సంకల్పమందు ఎలా భాగం వహించగలరో నేర్చుకోండి. సమీప భవిష్యత్తును గూర్చి దేవుని ప్రేరేపిత వాక్యం ప్రకటించు దానిని హృదయంలోనికి తీసికొనండి: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.”—యోహాను 2:17.
[అధ్యయన ప్రశ్నలు]
[31 వ పేజీలోని చిత్రం]
భూపరదైసును పునరుద్ధరించే దేవుని సంకల్పం త్వరలోనే నిజమౌతుంది