కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10

బైబిలు నాకెలా సహాయం చేస్తుంది?

బైబిలు నాకెలా సహాయం చేస్తుంది?

అది ఎందుకు ప్రాముఖ్యం?

‘లేఖనాలన్నీ దేవునిచేత ప్రేరేపించబడ్డాయి’ అని బైబిలు చెప్తుంది. (2 తిమోతి 3:16, 17, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి, ఖచ్చితంగా బైబిలు మీకు అవసరమైన సలహాలు ఇవ్వగలదు.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: డేవిడ్‌ ఓ ప్రాంతంలో డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్నాడు. దారిలో ఉన్నవన్నీ తనకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అక్కడున్న సైన్‌ బోర్డులు చూస్తే, తను వెళ్లాల్సింది అటు కాదని అనిపించింది. దారి తప్పానని డేవిడ్‌కి అర్థమైంది. తన ప్రయాణంలో ఎక్కడో సరైన మలుపు తీసుకోకపోవడం వల్ల డేవిడ్‌ దారి మిస్‌ అయ్యాడు.

డేవిడ్‌ స్థానంలో మీరుంటే, ఏం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

మీ ముందు కొన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి:

  1. వేరేవాళ్లను అడగడం.

  2. మ్యాప్‌ గానీ, GPS గానీ ఉపయోగించడం.

  3. ఎలాగొలా దారి తెలుసుకోవచ్చులే అని ఎవ్వరి సహాయం తీసుకోకుండా డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లడం.

ఆప్షన్‌ C అస్సలు కరెక్ట్‌ కాదని అందరికీ తెలుసు.

మొదటి దానికన్నా ఆప్షన్‌ B మంచిది. మ్యాప్‌గానీ, GPS గానీ ప్రయాణంలో మీతోపాటే ఉంటాయి, కాబట్టి ఎటు వెళ్లాలో మీకు తెలుస్తుంది.

బైబిలు కూడా అదేవిధంగా మీకు సహాయం చేయగలదు!

ప్రపంచంలోనే ఎక్కువమంది చదివే ఈ పుస్తకం,

  • మీ జీవితంలో వచ్చే సమస్యలతో ఎలా నెట్టుకురావాలో చెప్తుంది

  • మీరెలాంటి వ్యక్తో మీకు చెప్తుంది, మిమ్మల్ని మరింత మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది

  • సంతోషంగా ఎలా జీవించవచ్చో చెప్తుంది

జీవితంలో వచ్చే పెద్దపెద్ద ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

మాటలు వచ్చీరాగానే మనం ప్రశ్నల వర్షం కురిపిస్తాం.

  • ఆకాశం నీలంగా ఎందుకు ఉంది?

  • నక్షత్రాలు ఎలా మెరుస్తాయి?

తర్వాత, పెరిగి పెద్దయ్యే కొద్దీ మన చుట్టూ జరుగుతున్నవాటి గురించి ప్రశ్నలు అడగడం మొదలుపెడతాం.

ఒకవేళ ఈ ప్రశ్నలకు జవాబులు బైబిల్లో ఉంటే?

బైబిలు నిండా కట్టుకథలు ఉన్నాయని చాలామంది అంటారు. అది పాతకాలం పుస్తకమని, అర్థం చేసుకోవడానికి చాలాచాలా కష్టమని అనుకుంటారు. కానీ బైబిలు గురించి వాళ్లు అనుకుంటున్నది నిజమేనా? లేదా అది కేవలం ప్రజల ఆలోచన మాత్రమేనా?

ఉదాహరణకు, లోకం దేవుని గుప్పిట్లో ఉందని ప్రజలు అనుకుంటారు. అదెలా సాధ్యం? లోకం చూస్తే అడ్డూఅదుపూ లేకుండా ఉంది! ఎక్కడ చూసినా బాధలు, కష్టాలు, రోగాలు, మరణాలు, పేదరికం, విపత్తులు ఉన్నాయి. ప్రేమగల దేవుడు వాటన్నిటికీ ఎలా బాధ్యుడౌతాడు?

ఈ ప్రశ్నకు మీరు జవాబు తెలుసుకోవాలనుకుంటున్నారా? లోకం ఎవరి గుప్పిట్లో ఉందని బైబిలు చెప్తుందో తెలుసుకుంటే, మీరు ఆశ్చర్యపోతారు!

ఈ బ్రోషుర్‌లో ఉన్న సమాచారం బైబిలు ఆధారంగా ఉందని మీరు గమనించేవుంటారు. బైబిలు మనకు నమ్మదగిన సలహాలు ఇస్తుందని యెహోవాసాక్షులు నమ్ముతారు. ఎందుకంటే, ‘లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపించబడ్డాయి. అవి నీతిని బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతి విషయంలో తర్ఫీదు చేయడానికి ఉపయోగపడతాయి.’ (2 తిమోతి 3:16, 17, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి, ఆధునిక కాలానికి ఉపయోగపడే ఈ ప్రాచీన పుస్తకాన్ని మీరే స్వయంగా పరిశీలించండి!