24
పదాలను ఎంపిక చేసుకోవడం
పదాలు భావప్రకటనకు శక్తివంతమైన ఉపకరణాలు. మనం ఉపయోగించే పదాలు నిర్దిష్ట ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే మనం వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం. ఒక సందర్భంలో సముచితమైన పదం వేరే సందర్భాల్లో ఊహించని ప్రభావాన్ని చూపవచ్చు. సరదాగా అనే మాటలే అయినా అనుచితంగా ఉపయోగిస్తే అవి “నొప్పించ”వచ్చు. అలా అనుచితంగా మాట్లాడుతున్నారంటే ఆలోచించి మాట్లాడడం లేదన్నమాట. అలా మాట్లాడడం ఇతరులను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని చూపిస్తుంది. కొన్ని పదాలకు ద్వంద్వార్థాలున్నాయి, ఒక అర్థం బాధపెట్టేది గానీ చులకనచేసేది గానీ కావచ్చు. (సామె. 12:18; 15:1) మరొకవైపు ప్రోత్సహించే “దయగల మాట” ఎవరితో చెప్పబడిందో వారి హృదయాన్ని ఆనందింపజేస్తుంది. (సామె. 12:25) సరైన పదాలేవో తెలుసుకోవడానికి ఒక జ్ఞానికైనా సరే కృషి అవసరం. “యింపైన మాటల” కోసమూ ‘సత్యమునుగూర్చి యథార్థభావమునిచ్చే మాటల’ కోసమూ వెదకవలసిన అవసరముందని జ్ఞానియైన సొలొమోను కూడా గుర్తించాడని బైబిలు మనకు చెబుతోంది.—ప్రసం. 12:10.
కొన్ని భాషల్లో, పెద్దవాళ్ళను గానీ అధికార స్థానంలో ఉన్నవారిని గానీ సంబోధించడానికి నిర్దిష్టమైన పదాలను ఉపయోగిస్తారు. అయితే, సమానవయస్కులను గానీ వయస్సులో తమ కన్నా చిన్నవారిని గానీ సంబోధించేటప్పుడు వేరే పదాలు ఉపయోగించబడతాయి. అలాంటి మంచి మర్యాదలను నిర్లక్ష్యం చేయడం సంస్కారహీనతగా దృష్టించబడుతుంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఇతరులను గౌరవపూర్వకంగా సంబోధించడానికి ఉపయోగించే పదాలను తమకు ఉపయోగించుకోవడం కూడా అనుచితమే. గౌరవం చూపించే విషయంలో చట్టం గానీ స్థానిక సాంప్రదాయం గానీ కోరే ప్రమాణాల కన్నా ఉన్నతమైన ప్రమాణాన్ని బైబిలు ఇస్తోంది. “అందరిని సన్మానించుడి” అని అది క్రైస్తవులకు ఉద్బోధిస్తోంది. (1 పేతు. 2:17) హృదయపూర్వకంగా అందరినీ సన్మానించేవారు అన్ని వయస్కులవారితోను గౌరవంగా మాట్లాడతారు.
నిజమే, నిజ క్రైస్తవులు కాని చాలామంది కఠినమైన, నీచమైన భాషను ఉపయోగిస్తారు. అటువంటి భాష తాము చెప్పే విషయాలను మరింత నొక్కి చెబుతాయని వాళ్ళు భావిస్తుండవచ్చు. లేదా వాళ్ళు అలాంటి మాటలను ఉపయోగించడం, వారికి పదసంపద చాలా తక్కువ అనే సూచిస్తుండవచ్చు. యెహోవా మార్గాల గురించి నేర్చుకునే ముందు ఒక వ్యక్తికి అలాంటి మాటలు మాట్లాడే అలవాటు ఉంటే, ఆ అలవాటును మానుకోవడం కష్టంగా ఉన్నట్లు ఆయనకు అనిపించవచ్చు. అయినప్పటికీ అది సాధ్యమే. ఒక వ్యక్తి తన మాట తీరును మార్చుకోవడానికి ఆయనకు దేవుని ఆత్మ రోమా. 12:2; ఎఫె. 4:29; కొలొ. 3:8.
సహాయపడగలదు. అయితే ఆ వ్యక్తి కూడా మంచి పదాలతో కూడిన పదసంపదను, అంటే అనుకూలమైనటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి పదాలతో కూడిన పదసంపదను సంపాదించుకోవడానికీ వాటిని క్రమంగా ఉపయోగించడానికీ కూడా తప్పక సుముఖత చూపించాలి.—సులభంగా అర్థమయ్యే భాష. మంచి మాటల ప్రాథమిక లక్షణం సులభంగా అర్థమయ్యేలా ఉండడం. (1 కొరిం. 14:9) మీరు వాడే పదాలు ప్రేక్షకులకు వెంటనే అర్థంకాకపోతే, మీరేదో అన్యభాష మాట్లాడుతున్నట్లుంటుంది.
కొన్ని పదాలకు ప్రత్యేక వృత్తుల్లో ఉన్న ప్రజల వాడుకలో వేరే అర్థాలుంటాయి. అలాంటి పదాలను వారు ప్రతిరోజు ఉపయోగిస్తుండవచ్చు. కానీ ఆ పదాలను ఉపయోగించకూడని సందర్భాల్లో మీరు ఉపయోగిస్తే అది మీ భావ ప్రకటనా సామర్థ్యానికి అడ్డుగోడ కావచ్చు. అంతేకాక, ప్రతిరోజూ వాడే మాటలనే ఉపయోగిస్తున్నప్పటికీ మీరు అనవసరంగా ఏవేవో వివరాలివ్వడంలో మునిగిపోతే మీ శ్రోతలు తమ మనస్సులను ఇతర విషయాల పైకి మళ్ళించవచ్చు.
ఇతరుల గురించి ఆలోచించే ఒక ప్రసంగీకుడు తక్కువ చదువుకున్న వారికి కూడా అర్థమయ్యే పదాలను ఎంపిక చేసుకుంటాడు. యెహోవాను అనుకరిస్తూ ఆయన “తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి”ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. (యోబు 34:19, NW) వాళ్ళకు అంతగా తెలియని పదాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉందని ప్రసంగీకుడు అనుకుంటే, అప్పుడు ఆయన ఆ పదాన్ని దాని అర్థాన్ని స్పష్టం చేసే సరళమైన పదబంధాలకు అనుబంధంగా ఉపయోగించాలి.
చక్కగా ఎంపిక చేయబడిన సరళమైన పదాలు విషయాలను ఎంతో శక్తివంతంగా తెలియజేస్తాయి. చిన్న వాక్యాలను, సరళమైన పదబంధాలను గ్రహించడం సులభంగా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం పెద్ద వాక్యాలను ఉపయోగించవచ్చు. అలాగైతే మీ ప్రసంగం అకస్మాత్తుగా అక్కడక్కడ ఆగిపోతున్నట్లు ఉండదు. కానీ మీ ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని మీరు అనుకుంటున్న ఆలోచనలకు సరళమైన పదాలను, సంక్షిప్త వాక్యాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
వైవిధ్యభరితమైన ఖచ్చితమైన మాటలు. మంచి పదాలకు కొరత లేదు. అన్ని పరిస్థితులను సూచించేందుకు ఒకేవిధమైన పదాలను ఉపయోగించే బదులు వేర్వేరు పదాలను ఉపయోగించండి. అప్పుడు మీ మాటలు ఆసక్తికరంగానూ అర్థవంతంగానూ ఉంటాయి. మీ పదసంపదను మీరు ఎలా పెంచుకోవచ్చు?
చదివేటప్పుడు మీకు ఏ పదాలైనా సరిగా అర్థంకాకపోతే వాటికి ఏదైనా గుర్తు పెట్టుకొని మీ భాషలోని నిఘంటువు అందుబాటులో ఉంటే అందులో ఆ పదాలను చూడండి. ఆ పదాల్లో కొన్నింటిని ఎంపికచేసుకొని సముచితమైన సందర్భాల్లో వాటిని ఉపయోగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించండి. వాటిని సరిగ్గా ఉచ్చరించడానికీ మీవైపుకు అవధానాన్ని మళ్ళించుకోవడానికి కాక అవి సులభంగా అర్థమయ్యే సందర్భాల్లో వాటిని ఉపయోగించడానికీ శ్రద్ధ చూపించండి.
మీ పదసంపదను పెంచుకోవడం మీ మాటలకు వైవిధ్యాన్నిస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండవలసిన అవసరముంది, ఒక వ్యక్తి పదాలను తప్పుగా ఉచ్చరించినా ఉపయోగించకూడని చోట ఉపయోగించినా ఆయన ఏమి మాట్లాడుతున్నాడో నిజానికి ఆయనకే తెలియదని ఇతరులు అనుకోవచ్చు.మనం మన పదసంపదను పెంచుకోవడానికి గల ఉద్దేశం, సమాచారాన్ని తెలియజేయడమే గానీ మన శ్రోతలను ముగ్ధులను చేయాలన్నది కాదు. సంక్లిష్టమైన మాటలు, పెద్ద పెద్ద పదాలు సాధారణంగా ప్రసంగీకుని గురించి ఆలోచించేలా చేస్తాయి. విలువైన సమాచారాన్ని పంచుకోవాలి, వినేవాళ్ళకి అది ఆసక్తికరంగా ఉండాలి అన్నదే మన కోరికై ఉండాలి. “జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును” అని అంటున్న బైబిలు సామెతను గుర్తు చేసుకోండి. (సామె. 15:2) మంచిపదాలను, సులభంగా అర్థమయ్యేటువంటి సముచితమైన పదాలను ఉపయోగించడం వల్ల మన ప్రసంగం సేదదీర్చేదిగానూ పురికొల్పేదిగానూ ఉంటుందే గానీ నిరుత్సాహంగాను అనాసక్తమైనదిగాను ఉండదు.
మీరు మీ పదసంపదను పెంచుకొంటుండగా సరైన మాటలు ఉపయోగించడానికి జాగ్రత్తగా ఆలోచించండి. ఏవైనా రెండు పదాల అర్థాలు సాదృశ్యమైనవే అయినా, వివిధ సందర్భాల్లో వాటి అర్థాల్లో కొంచెం తేడా ఉండవచ్చు. మీరు అది గుర్తిస్తే మీరు మీ మాటల్లో స్పష్టతను పెంచుకోగలుగుతారు, మీ శ్రోతలకు బాధ కలిగించకుండా జాగ్రత్తపడగలుగుతారు. చక్కగా మాట్లాడేవారి మాటలను జాగ్రత్తగా వినండి. కొన్ని నిఘంటువులు ప్రతీ పదం కింద వాటి పర్యాయ పదాలను (పదాల అర్థాల్లో పోలికవున్నా, సమానార్థకాలు కావు) వ్యతిరేక పదాలను (వ్యతిరేక అర్థంగల పదాలు) ఇస్తాయి. కాబట్టి, ఒకే తలంపును తెలియజేసేందుకు వివిధ మాటలున్నాయని మాత్రమే కాక వాటి అర్థాల్లో సూక్ష్మభేదం ఉంటుందని కూడా మీరు గ్రహిస్తారు. ఒక ప్రత్యేక పరిస్థితి గురించి చెప్పడానికి, సరైన పదం కోసం వెదుకుతున్నప్పుడు ఇదంతా సహాయకరంగా ఉంటుంది. మీ పదసంపదలో మరొక పదాన్ని చేర్చుకునే ముందు, దాని అర్థమేమిటో దాన్ని ఎలా ఉచ్చరించాలో దాన్ని ఏయే సందర్భాల్లో ఉపయోగించాలో ఖచ్చితంగా తెలుసుకోండి.
సాధారణ మాటల కన్నా నిర్దిష్టమైన మాటలే విషయాలను స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు చెబుతాయి. ఒక ప్రసంగీకుడు, “అప్పట్లో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు” అని చెప్పవచ్చు. లేదా “మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతి కొన్ని నెలల్లో దాదాపు 2,10,00,000 మంది ప్రజలు స్పానిష్ ఫ్లూ మూలంగా చనిపోయారు” అని చెప్పవచ్చు. ఆయన “అప్పట్లో,” “చాలామంది,” “అనారోగ్యానికి గురయ్యారు” వంటి పదాలను ఉపయోగిస్తున్నప్పుడు తాను ఉద్దేశిస్తున్నదేమిటో స్పష్టంగా చెబితే ఎంత తేడా ఉంటుంది! మీరు ఆ విధంగా వ్యక్తం చేయాలంటే, మీరు చెబుతున్న విషయానికి సంబంధించిన వాస్తవాలను గురించిన పరిజ్ఞానమూ పదాలను జాగ్రత్తగా ఎంపికచేసుకోవడమూ అవసరం.
సరైన పదాన్ని ఉపయోగించడం, ఎక్కువ పదాలను ఉపయోగించకుండానే చెప్పదల్చుకున్న భావాన్ని స్పష్టం చేయడానికి సహాయపడుతుంది. పదాలు మరీ ఎక్కువైతే ఆలోచనలు మరుగునపడిపోవచ్చు. సరళత, ఇతరులు ప్రాముఖ్యమైన వాస్తవాలను గ్రహించడాన్నీ గుర్తుంచుకోవడాన్నీ మరింత సులభం చేస్తుంది. అది ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి సహాయపడుతుంది. మత్తయి 5:3-12; మార్కు 10:17-21 లో నివేదించబడిన ఉదాహరణలను చూడండి.) చక్కగా ఎంపిక చేసుకున్న పదాలతో విషయాన్ని క్లుప్తంగా వ్యక్తం చేయడాన్ని అభ్యసించండి.
సరళమైన భాషను ఉపయోగించే విషయంలో యేసుక్రీస్తు బోధన గమనార్హమైనదిగా ఉంది. ఆయన నుండి నేర్చుకోండి. (బలాన్నీ భావాలనూ తెలియజేసే పదాలు, వర్ణనాత్మక పదాలు. మీరు మీ పదసంపదను పెంచుకొంటుండగా, క్రొత్త పదాలను గురించి మాత్రమే కాక ప్రత్యేక లక్షణాలు గల పదాలను గురించి కూడా ఆలోచించండి. ఉదాహరణకు, బలాన్ని తెలియజేసే క్రియాపదాలను; వర్ణనాత్మక విశేషణాలను; ఆప్యాయతను, దయను లేదా హృదయపూర్వక భావాలను వ్యక్తం చేసే మాటల గురించి ఆలోచించండి.
బైబిలులో అలాంటి అర్థవంతమైన మాటలకు మంచి ఉదాహరణలు ఉన్నాయి. “కీడు విడిచి మేలు వెదకుడి; . . . కీడును ద్వేషించి మేలును ప్రేమించు[డి]” అని ప్రవక్తయైన ఆమోసు ద్వారా యెహోవా ఉద్బోధించాడు. (ఇటాలిక్కులు మావి.) (ఆమో. 5:14,15) సమూయేలు ప్రవక్త, “నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి . . . యున్నాడు” అని రాజైన సౌలుకు వెల్లడిచేశాడు. (ఇటాలిక్కులు మావి.) (1 సమూ. 15:28) యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు, మరిచిపోలేని భాషను ఉపయోగిస్తూ, “ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై . . . యున్నారు” అని అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (యెహె. 3:7) “మానవుడు దేవునియొద్ద దొంగిలునా?” అని అడిగి, “అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి” అని అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (మలా. 3:8) బబులోనులో ఎదురైన విశ్వాస పరీక్షను వర్ణిస్తూ షద్రకు, మేషాకు, అబేద్నెగోలు తన ప్రతిమను ఆరాధించనందువల్ల “నెబుకద్నెజరు అత్యాగ్రహము నొంది” వారిని బంధించి “వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయు”డని ఆజ్ఞాపించాడని దానియేలు వివరంగా నివేదించాడు. అది ఎంత వేడిగా ఉందో ఊహించుకునేందుకు మనకు సహాయపడుతూ, ‘గుండమును ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుడి’ అని రాజు తన మనుష్యులకు ఆజ్ఞాపించాడని దానియేలు వివరంగా నివేదించాడు. వాళ్ళు ఎంత వేడిమిగా చేశారంటే, రాజు మనుష్యులు ఆ గుండము దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయారు. (ఇటాలిక్కులు మావి.) (దాని. 3:19-22) యేసు తన మరణానికి కొన్నాళ్ళ ముందు యెరూషలేములోని ప్రజలతో మాట్లాడుతూ తనకు కలిగిన గాఢమైన భావాలను వ్యక్తం చేస్తూ, “కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది” అని అన్నాడు. (ఇటాలిక్కులు మావి.)—మత్త. 23:37,38.
చక్కగా ఎంపిక చేసుకున్న పదాలు, విషయాలను మీ శ్రోతల మనస్సులో సజీవంగా చిత్రిస్తాయి. ఇంద్రియాలు తదనుభూతిని చెందేలా చేసేటువంటి పదాలను ఉపయోగిస్తే మీ శ్రోతలు మీరు చెప్పే వాటిని “చూస్తారు” “స్పర్శిస్తారు,” మీరు ప్రస్తావించే ఆహారాన్ని “రుచిచూస్తారు” దాన్ని “ఆఘ్రాణిస్తారు,” మీరు వర్ణించే శబ్దాలనూ మీరు ఉటంకించే ప్రజల మాటలనూ “వింటారు.” మీరు చెప్పే విషయాలు ప్రేక్షకుల కళ్ళ ముందు సజీవంగా కనిపించేలా వారికి సహాయపడతారు గనుక వారు వాటిలో లీనమవుతారు.
కీర్తన 37:10,11,34; యోహాను 3:16; ప్రకటన 21:4,5 వంటి బైబిలు వచనాలు పుట్టించిన నిరీక్షణ భూవ్యాప్తంగా ఉన్న ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తోంది.
విషయాలను కళ్ళకు కట్టినట్లు చెప్పే పదాలు, ప్రజలను నవ్వించగలవు, ఏడిపించగలవు. ఆ పదాలు నిరీక్షణను కలిగించగలవు, మానసికంగా కృంగిపోయిన వ్యక్తికి బ్రతకాలన్న కోరికను పుట్టించి ఆయన అంతరంగంలో సృష్టికర్త మీద ప్రేమను పుట్టించగలవు.మీరు బైబిలును, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ప్రచురణలను చదువుతుండగా వైవిధ్యభరితమైన పదాలను పదబంధాలను గమనిస్తారు. (మత్త. 24:45) వాటిని అలా చదివి వదిలేయకండి. మీకు ఆనందాన్నిచ్చిన వాటిని ఎంపిక చేసుకొని, వాటిని మీ దైనందిన జీవితంలో ఉపయోగించే పదసంపదలో భాగంగా చేసుకోండి.
వ్యాకరణ నియమాలకు అనుగుణంగావున్న మాటలు. తమ మాటలు అన్నిసార్లూ వ్యాకరణ నియమాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని కొందరు గుర్తిస్తారు. వారు ఆ విషయంలో ఏమి చేయవచ్చు?
మీరు ఇప్పటికీ స్కూలులో చదువుకుంటున్నట్లయితే, మంచి వ్యాకరణాన్నీ పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడాన్నీ నేర్చుకోవడానికి మీకు ఇప్పుడున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక వ్యాకరణ నియమానికి గల కారణం గురించి మీకు తెలియకపోతే మీ టీచర్‌ని అడిగి తెలుసుకోండి. ఏదో కాస్త తెలుసుకొని తృప్తిపడకండి. మిగతా విద్యార్థులకు లేని ఒక ఉద్దేశం మీకుంది. మీరు ప్రతిభావంతుడైన సువార్త పరిచారకుడవ్వాలని కోరుకుంటున్నారు.
అయితే వయస్సులో పెద్దవాళ్ళయితే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్న భాష కాక మరొక భాష మాట్లాడి పెరిగినవారైతే అప్పుడెలా? లేదా మీ సొంత భాషలోనే ఎక్కువ చదువుకునే అవకాశం మీకు లభించి ఉండకపోవచ్చు. నిరుత్సాహపడకండి. సువార్త నిమిత్తం, భాషను మెరుగుపరుచుకోవడానికి హృదయపూర్వకంగా కృషి చేయండి. మనకు తెలిసిన వ్యాకరణంలో చాలా మట్టుకు ఇతరులు మాట్లాడుతుండగా విని నేర్చుకున్నదే. కాబట్టి అనుభవజ్ఞులైన ప్రసంగీకులు ప్రసంగించేటప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు బైబిలూ బైబిలు ఆధారిత ప్రచురణలూ చదువుతున్నప్పుడు, వాక్య నిర్మాణాలనూ కలిపి ఉపయోగించబడిన పదాలనూ అవి ఉపయోగించబడిన సందర్భాన్నీ గమనించండి. ఈ మంచి ఉదాహరణలను అనుకరిస్తూ మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి.
జనాదరణ పొందిన కళాకారులూ గాయకులూ వ్యాకరణ ప్రయోగాలకు విరుద్ధమైన పదప్రయోగాలను మాటలను ఉపయోగించవచ్చు. ప్రజలు అలాంటి వ్యక్తులను అనుకరించడానికి మొగ్గు చూపుతారు. మాదక ద్రవ్య వ్యాపారులకు, నేరమయమైన జీవనశైలినో అనైతికమైన జీవనశైలినో అవలంబించే ఇతరులకు తమదంటూ ప్రత్యేక పదజాలముంటుంది, వివిధ పదాలకు వాళ్ళిచ్చే నిర్వచనాలకూ సాధారణంగా వాటికుండే అర్థాలకూ చాలా తేడా ఉంటుంది. ఇలాంటివాళ్ళనెవరినైనా క్రైస్తవులు అనుకరించడం జ్ఞానయుక్తం కాదు. మనం వాళ్ళను అనుకరిస్తున్నామంటే, మనం లోకస్థుల్లో ఒకరమనీ అటువంటి జీవన శైలిని అవలంబిస్తున్నవారిలో ఒకరమనీ సూచిస్తున్నామన్నమాట.—యోహా. 17:16.
ప్రతిరోజు మంచి మాటలను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. దైనందిన సంభాషణలో మీ నోటి నుండి మాటలు నిర్లక్ష్యంగా రావడానికి మీరు అనుమతిస్తే, ప్రత్యేక సందర్భాల్లో మీరు
చక్కగా మాట్లాడగలరని అనుకోకండి. మీరు సాధారణ జీవిత పరిస్థితుల్లో మంచి పదాలను ఉపయోగిస్తే, మీరు వేదిక మీద ఉన్నప్పుడు గానీ సత్యాన్ని గురించి ఇతరులకు సాక్ష్యమిస్తున్నప్పుడు గానీ మంచి పదాలను సులభంగా, సహజంగా ఉపయోగించగలుగుతారు.