45
బోధించే ఉపమానాలు/ఉదాహరణలు
ఉపమానాలు, ఉదాహరణలు శక్తివంతమైన బోధనా పద్ధతులు. అవి గొప్ప ప్రభావంతో తరచూ అవధానాన్ని ఆకర్షించి, నిలిపివుంచుతాయి. అవి ఆలోచనా సామర్థ్యాలను ప్రేరేపిస్తాయి. అవి భావోద్వేగాలను పురికొల్పుతాయి, ఆ విధంగా మనస్సాక్షిని హృదయాన్ని కదిలిస్తాయి. కొన్నిసార్లు ఉపమానాలు ప్రజల్లో ఉన్న దురభిమానాన్ని అధిగమించడానికి ఉపయోగించవచ్చు. అవి జ్ఞాపక శక్తికి కూడా సమర్థంగా దోహదపడతాయి. మీరు మీ బోధలో వాటిని ఉపయోగిస్తారా?
సాధారణంగా కొన్ని పదాలు మాత్రమే అవసరమయ్యే ఉపమానాలనే అలంకారాలు అంటారు; పదాలు కొన్నే అయినా అవి మనస్సుల్లో విస్పష్టమైన చిత్రాలు చిత్రిస్తాయి. వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే చాలా మట్టుకు వివరించకుండానే అర్థం అవుతాయి. కానీ బోధకుడు క్లుప్తమైన వివరణ ఇవ్వడం ద్వారా వాటి విలువను మరింత పెంచుతాడు. మీరు ఈ పద్ధతిని నేర్చుకోవడం కోసం బైబిలులో ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఉపమాలంకారాలు, రూపకాలంకారాలతో ప్రారంభించండి. ఉపమాలంకారాలు అలంకారాల్లోకెల్లా అతి సరళమైనవి. మీరు ఉపమానాలు ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నట్లైతే ఉపమాలంకారాలతో ప్రారంభించడం మీకు సులభంగా ఉంటుంది. సాధారణంగా ఉపమాలంకారాల్లో “లాంటి” లేదా “వలె” వంటి పదాలు ఉపయోగించబడతాయి. పూర్తి భిన్నంగా ఉన్న రెండు విషయాలను ఒకదానితో ఒకటి పోల్చేటప్పుడు, ఆ రెంటికీ మధ్య ఉన్న సామ్యాన్ని గురించి ఉపమాలంకారాలు నొక్కిచెబుతాయి. బైబిలులో అలంకారిక భాష సమృద్ధిగా ఉంది—అందుకు సృష్టిలోని చెట్లు, జంతువులు, సూర్యచంద్ర నక్షత్రాదులు వంటివాటిని ఉపయోగిస్తుంది—అలాగే మానవుల అనుభవాలను కూడా ఉపయోగిస్తుంది. బైబిలు కీర్తన 1:3 లో, దేవుని వాక్యాన్ని అనునిత్యం చదివే వ్యక్తి “నీటికాలువల యోరను నాటబడిన . . . చెట్టువలె,” వాడబారక ఫలములిచ్చే చెట్టువలె ఉంటాడని మనకు చెబుతోంది. దుష్టుడు వేటకోసం పొంచివుండే “సింహమువలె” ఉంటాడని బైబిలు చెబుతోంది. (కీర్త. 10:9) అబ్రాహాము సంతానం సంఖ్య “ఆకాశ నక్షత్రములవలె” అవుతుందని, “సముద్రతీరమందలి యిసుకవలె” తయారవుతుందని యెహోవా వాగ్దానం చేశాడు. (ఆది. 22:17) యెహోవా తనకూ ఇశ్రాయేలు జనాంగానికీ మధ్య తనే సాధ్యం చేసిన సన్నిహిత సంబంధం గురించి, “నేను ఇశ్రాయేలు వంశస్థులనందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసితిని” అని అన్నాడు.—యిర్మీ. 13:11.
రూపకాలంకారాలు కూడా అదే విధంగా రెండు పూర్తి భిన్నమైన విషయాల మధ్య సామ్యాన్ని మత్త. 5:14) అదుపుతప్పిన నోరు తీసుకురాగల నష్టాన్ని వర్ణిస్తూ శిష్యుడైన యాకోబు, “నాలుక అగ్నియే” అని వ్రాశాడు. (యాకో. 3:6) దావీదు యెహోవాను సంబోధిస్తూ ఇలా పాడాడు: “నా కొండ నా కోట నీవే.” (కీర్త. 31:3) చక్కగా ఎంపిక చేసుకున్న రూపకాలంకారానికి వివరించవలసిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది, కొన్నింటినైతే అసలు వివరించాల్సిన అవసరమే ఉండదు. అది ఎంత క్లుప్తంగా ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఒక వాస్తవాన్ని మామూలు మాటల్లో చెప్పడం కన్నా, ఒక రూపకాలంకారాన్ని ఉపయోగిస్తూ చెబితే మీ ప్రేక్షకులు మీరు చెబుతున్న విషయాన్ని ఇంకా బాగా గుర్తుంచుకుంటారు.
చూపిస్తాయి. కానీ రూపకాలంకారము మరింత శక్తివంతంగా ఉంటుంది. అది ఆ రెండూ ఒకటే అన్నట్లుగా చెబుతుంది, ఆ విధంగా ఒక దానిలోని కొన్ని లక్షణాలు మరో దానికి ఆపాదించబడతాయి. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు.” (అతిశయోక్తి అనే అలంకారములో విషయాలను అతిగా చేసి చెప్పడం జరుగుతుంది, దీన్ని వివేచనతో ఉపయోగించాలి లేదంటే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మరచిపోలేని ఒక చిత్రాన్ని మనస్సుల్లో చిత్రించేందుకు యేసు ఈ అలంకారాన్ని ఉపయోగించాడు, ఆయనిలా అన్నాడు: “నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?” (మత్త. 7:3) దీన్ని లేదా మరితర అలంకారాలను ఉపయోగించడానికి ప్రయత్నించే ముందు ఉపమాలంకారాన్నీ రూపకాలంకారాన్నీ సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకోండి.
ఉదాహరణలు ఉపయోగించండి. అలంకారిక భాష ఉపయోగించడానికి బదులుగా మీరు మరో బోధనా పద్ధతియైన ఉదాహరణలను ఉపయోగించాలనుకోవచ్చు, అవి కల్పిత వృత్తాంతాలే కావచ్చు లేదా నిజజీవిత అనుభవాలే కావచ్చు. ఈ విషయంలో మనం కొన్నిసార్లు అదుపుతప్పే ప్రమాదం ఉంది కాబట్టి వీటితో వివేచనాపూర్వకంగా వ్యవహరించాలి. అలాంటి ఉదాహరణలను నిజంగా ముఖ్యమైన విషయాలకు మద్దతుగా మాత్రమే ఉపయోగించాలి; అంతేకాదు, వాటిని కేవలం కథ చెబుతున్నట్లుగా కాక, అసలు హితవేమిటో గుర్తుంచుకొనే విధంగా అందించాలి.
ఉదాహరణలన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కానవసరం లేకపోయినా అవి ప్రజల జీవితాల్లోని వైఖరులను, పరిస్థితులను ప్రతిబింబించాలి. పశ్చాత్తాపం చెందిన పాపులను ఏ విధంగా దృష్టించాలో బోధిస్తున్నప్పుడు యేసు, తప్పిపోయిన గొఱ్ఱెను కనుగొన్న ఒక వ్యక్తి ఆనందం గురించి చెబుతూ దృష్టాంతపరిచాడు. (లూకా 15:1-7) పొరుగువాడిని ప్రేమించమని ధర్మశాస్త్రము చెబుతుండగా, ఆ ఆజ్ఞలోని పూర్తి భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్న ఒక వ్యక్తికి జవాబిస్తూ యేసు, గాయపడిన ఒక వ్యక్తికి ఒక యాజకుడు ఒక లేవీయుడు సహాయం చేయకపోయినా ఒక సమరయుడు సహాయం చేసిన కథను చెప్పాడు. (లూకా 10:30-37) ప్రజల వైఖరులు వారి చర్యలు జాగ్రత్తగా గమనించడాన్ని మీరు అభ్యసిస్తే ఈ బోధనా పద్ధతిని మీరు సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు.
ప్రవక్తయైన నాతాను రాజైన దావీదును గద్దించడానికి ఒక కాల్పనిక పరిస్థితిని వివరించాడు. ఆ కథ 2 సమూ. 12:1-14) మీరు భావోద్వేగపరమైన పరిస్థితుల్లో అవతలి వ్యక్తి మనస్సు నొప్పించకుండా వ్యవహరించడం సాధనతో నేర్చుకోగలుగుతారు.
చాలా సమర్థవంతమైనది, ఎందుకంటే అది దావీదు తనను తాను సమర్థించుకొనే విధంగా ప్రతిస్పందించనివ్వలేదు. ఆ కథలో విస్తారమైన గొఱ్ఱెలున్న ఒక ఐశ్వర్యవంతుడు, తనెంతో ప్రేమగా సాకుతున్న చిన్న ఆడు గొఱ్ఱెపిల్ల తప్ప మరింకేమీ లేని ఒక దరిద్రుడు ఉన్నారు. దావీదు ఒకప్పుడు గొఱ్ఱెల కాపరిగా ఉన్నాడు, అందుకే ఆయన ఆ గొఱ్ఱెపిల్ల యజమాని భావాలను అర్థంచేసుకోగలడు. ఆ బీదవాడి దగ్గరినుండి ప్రాణసమానమైన గొఱ్ఱెపిల్లను కాజేసిన ఆ ఐశ్వర్యవంతుడిపై దావీదు నీతియుక్తమైన రీతిలో మండిపడ్డాడు. అప్పుడు నాతాను దావీదుతో సూటిగా ఇలా అన్నాడు: “ఆ మనుష్యుడవు నీవే!” నాతాను దావీదు హృదయాన్ని స్పృశించాడు, దావీదు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాడు. (బోధించే పనికి సంబంధించి ఎన్నో విలువైన ఉదాహరణలను లేఖనాల్లో నమోదు చేయబడిన సంఘటనల నుండి తీసుకోవచ్చు. యేసు కేవలం నాలుగు పదాల్లో ఒక ఉదాహరణను చెప్పాడు: “లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.” (లూకా 17:32) తన ప్రత్యక్షతకు వివరణాత్మకమైన సూచననిస్తూ యేసు “నోవహు దినముల” గురించి మాట్లాడాడు. (మత్త. 24:37-39) అపొస్తలుడైన పౌలు హెబ్రీయులు 11వ అధ్యాయంలో విశ్వాసానికి మాదిరులుగా 16 మంది స్త్రీపురుషుల పేర్లను పేర్కొన్నాడు. మీరు బైబిలును మరింతగా తెలుసుకొంటుండగా, అందులోని సంఘటనల గురించి ప్రజల గురించి అదేమి చెబుతోందో గ్రహిస్తూ వాటి నుండి శక్తివంతమైన ఉదాహరణలు తీసుకోగలుగుతారు.—రోమా. 15:4; 1 కొరిం. 10:11.
కొన్నిసార్లు ఉపదేశంలోని ఒక అంశానికి నిజజీవిత, ఆధునిక అనుభవాన్ని జోడించడం ద్వారా దానికి బలాన్ని చేకూర్చడం ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరు గ్రహిస్తారు. అయితే ఇలా చేస్తున్నప్పుడు, కేవలం ధృవపరచబడిన అనుభవాలను మాత్రమే ఉపయోగించేలా, మీ ప్రేక్షకుల్లో ఎవరినైనా అనవసర ఇబ్బందికి గురిచేసేవి లేదా మీ చర్చాంశానికి సంబంధించని ఒక వివాదాస్పద విషయంవైపు అవధానాన్ని ఆకర్షించేవి చేర్చకుండా జాగ్రత్తపడండి. ఆ అనుభవం ఒక ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా కూడా ఉండాలని గుర్తుంచుకోండి. మీ అందింపు లక్ష్యం నుండి అవధానాన్ని మళ్ళించే అనవసరపు వివరాలను చెప్పకండి.
అది అర్థమవుతుందా? మీరు ఉపయోగించే ఉపమానం లేదా ఉదాహరణ ఏదైనా, అది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలి. మీరు చర్చిస్తున్న విషయానికి వాటిని అన్వయించకపోతే మీరు మీ లక్ష్యాన్ని సాధించగలరా?
యేసు తన శిష్యులు “లోకమునకు వెలుగైయున్నారు” అని చెప్పిన తర్వాత, దీపాన్ని ఎలా ఉపయోగిస్తారో వ్యాఖ్యానించి, దాన్నిబట్టి వారి బాధ్యత ఏమిటో అర్థం చేసుకునేలా వారికి వివరించాడు. (మత్తయి 5:15,16) తప్పిపోయిన గొఱ్ఱె గురించిన ఉపమానం చెప్పిన తర్వాత, ఆయన పశ్చాత్తాపపడిన ఒక పాపి విషయమై పరలోకంలో ఎలా సంతోషం కలుగుతుందో వ్యాఖ్యానించాడు. (లూకా 15:7) మంచి పొరుగువాడైన సమరయుడి కథ చెప్పిన తర్వాత యేసు తను చెప్పేది వింటున్న వ్యక్తిని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, ఆ తర్వాత సూటిగా ఒక సలహా ఇచ్చాడు. (లూకా 10:36,37) దీనికి భిన్నంగా యేసు, వివిధ రకాల నేలల గురించిన, పొలంలో గురుగుల గురించిన ఉపమానాలను నమ్రతతో అడిగినవారికి మాత్రమే వివరించాడు, జనసమూహానికి వివరించలేదు. (మత్త. 13:1-30, 36-43) యేసు తన మరణానికి మూడు రోజులు ముందు, హంతకులైన ద్రాక్షతోట కాపుల గురించిన ఉపమానాన్ని చెప్పాడు. ఆయన దాని అన్వయింపును గురించి చెప్పలేదు; అది అవసరం లేకపోయింది. ‘ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించిరి.’ (మత్త. 21:33-45) అన్వయింపు అవసరమా, అవసరమైతే ఎంతమట్టుకు అన్వయించాలన్నది ఉపమానం ఎలాంటిది, ప్రేక్షకుల వైఖరి ఎటువంటిది, మీ లక్ష్యం ఏమిటి అన్నవాటిపై ఆధారపడివుంటుంది.
ఉపమానాలను ఉదాహరణలను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి సమయం పడుతుంది, కానీ కృషికి తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి. చక్కగా ఎంపిక చేసుకున్న ఉపమానాలు, అటు మేధాపరంగాను ఇటు భావోద్వేగపరంగాను రంజింపజేస్తాయి. ఫలితంగా, వాస్తవాలను సాదాసీదా మాటల్లో చెప్పినప్పుడు ఉండని బలం, ఉపమానాలతో చెప్పిన మీ సందేశానికి ఉంటుంది.