కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ పాఠం

దేవుడు చెప్తున్న మంచివార్త ఏంటి?

దేవుడు చెప్తున్న మంచివార్త ఏంటి?

1. ఆ మంచివార్త ఏంటి?

 ప్రజలు భూమ్మీద ఆనందంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనుషుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే వాళ్ల కోసం భూమిని, దానిమీదున్న వాటన్నిటినీ సృష్టించాడు. త్వరలోనే ఆయన అన్ని దేశాల ప్రజలు సంతోషంగా ఉండేలా చేయబోతున్నాడు. మనుషుల్ని బాధపెట్టే ప్రతీదాన్ని ఆయన తీసేస్తాడు.యిర్మీయా 29:11 చదవండి.

 ఇప్పటివరకు ఏ ప్రభుత్వం దౌర్జన్యాన్ని, అనారోగ్యాన్ని, మరణాన్ని తీసేయలేకపోయింది. కానీ మంచివార్త ఏంటంటే, అతి త్వరలోనే దేవుడు మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేసి తన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. ఆ పరిపాలన కింద ప్రజలు ఆరోగ్యంగా, శాంతిగా జీవిస్తారు.యెషయా 25:8; 33:24; దానియేలు 2:44 చదవండి.

2. ఆ మంచివార్తను ఇప్పుడే ఎందుకు తెలుసుకోవాలి?

 దేవుడు చెడ్డవాళ్లను తీసేసినప్పుడు మాత్రమే బాధలన్నీ పోతాయి. (జెఫన్యా 2:3) మరి ఆయన వాళ్లను ఎప్పుడు తీసేస్తాడు? ఈ రోజుల్లో మనం చూస్తున్న ఘోరమైన పరిస్థితుల గురించి దేవుడు ముందే చెప్పాడు. వాటిని చూస్తుంటే, దేవుడు చర్య తీసుకునే సమయం దగ్గరపడిందని అర్థమౌతుంది.2 తిమోతి 3:1-5 చదవండి.

3. మనం ఏం చేయాలి?

 మనం దేవుని వాక్యమైన బైబిలు చదువుతూ దేవుని గురించి తెలుసుకోవాలి. అది ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలకు రాసిన ఉత్తరం లాంటిది. ఇప్పుడు మెరుగైన విధంగా జీవించాలంటే, భవిష్యత్తులో భూమ్మీద శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలో అందులో ఉంది. మీరు ఇంకొకరి సహాయంతో బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే, మంచి భవిష్యత్తు పొందే అవకాశాన్ని వదులుకోకండి.సామెతలు 29:25; ప్రకటన 14:6, 7 చదవండి.