ఏ బాధలేని లోకం
భాగం 2
ఏ బాధలేని లోకం
1, 2. అనేకులు ఏ భిన్నమైన దృక్పథాన్ని కల్గియున్నారు?
అయితే, ప్రపంచ వ్యాప్తంగానున్న లక్షలాదిమందికి పూర్తిగా భిన్నమైన దృక్పథమున్నది. మానవజాతికి అద్భుతమైన భవిష్యత్తు ఉన్నదని వారు గ్రహిస్తున్నారు. దుష్టత్వం, బాధనుండి పూర్తిగా విముక్తిచెందిన లోకం త్వరలో ఇదే భూమిపై నెలకొంటుందని వారంటున్నారు. చెడుతనమనేది త్వరలోనే లేకుండ తుడిచిపెట్టబడి, ఒక సంపూర్ణ నూతన లోకం స్థాపించబడుతుందని వారి పూర్తినమ్మకం. ఈ నూతన లోక పునాదులు యిప్పుడే వేయబడుతున్నవని కూడ వారు చెబుతున్నారు.
2 ఆ నూతన లోకంలో యుద్ధం, క్రూరత్వం, నేరం, అన్యాయం, పేదరికము ఉండవని ఈ ప్రజలు నమ్ముతున్నారు. రోగం, దుఃఖం, కన్నీళ్లు, మరణం సహితం ఉండని లోకమది. అప్పుడు ప్రజలు పరిపూర్ణతకు ఎదిగి భూపరదైసు నందు నిరంతరం సంతోషముతో జీవిస్తారు. అంతేకాదు, మరణించిన వారు సహితం పునరుత్థానము చేయబడి నిరంతరం, జీవించే అవకాశాన్ని పొందుతారు.
3, 4. తమ దృక్పథం విషయమై అట్టి వ్యక్తులు ఎందుకంత నమ్మకాన్ని కల్గియున్నారు?
3 భవిష్యత్తును గూర్చిన ఈ దృక్పథం కేవలం ఒక కలేనా, కేవలం ఓ తీపి తలంపేనా? కానేకాదు. రానైయున్న ఈ పరదైసు తథ్యం అనే స్థిరమైన విశ్వాసంపై యిది ఆధారపడి యుంది. (హెబ్రీయులు 11:1) వారెందుకంత కృతనిశ్చయతను కల్గియున్నారు? ఎందుకంటే ఈ విశ్వానికే సర్వోన్నత సృష్టికర్తయైనవాడు దానిని వాగ్దానముచేశాడు.
4 దేవుని వాగ్దానాలను గూర్చి బైబిలిట్లంటున్నది: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు. అవి అన్నియు మీకు కలిగెను. వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” “దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు . . . ఆయన చెప్పిచేయకుండునా? ఆయన మాటయిచ్చి స్థాపింపకుండునా?” “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ‘నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.’”—యెహోషువ 23:14; సంఖ్యాకాండము 23:19; యెషయా 14:24.
5. ఏ ప్రశ్నలకు సమాధానం కావాలి?
5 బాధలులేని భూపరదైసును స్థాపించుటే దేవుని సంకల్పమైతే, అసలు చెడు సంఘటనలు జరిగేందుకు ఆయనెందుకు అనుమతిస్తున్నాడు? ఆ చెడును సరిదిద్దడానికి ఆయన నేటికి ఆరు వేలసంవత్సరాలు ఎందుకు వేచియున్నాడు? దేవుడు మన యెడల శ్రద్ధకల్గిలేడని, లేదా ఆయన అసలు లేనేలేడని యిన్ని శతాబ్దాల నుండి కొనసాగుతున్న బాధ సూచించుట లేదా?
[అధ్యయన ప్రశ్నలు]