కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వేచ్ఛాచిత్తమనే అద్భుత వరం

స్వేచ్ఛాచిత్తమనే అద్భుత వరం

భాగం 5

స్వేచ్ఛాచిత్తమనే అద్భుత వరం

 1, 2. మన నిర్మాణములో ఏ అద్భుతవరం ఒక భాగమైయున్నది?

 దేవుడు బాధనెందుకు అనుమతించాడో, దాని విషయమై ఆయన ఏమి చేయనైయున్నాడో అర్థం చేసికొనుటకు, ఆయన మనలనెలా చేశాడో అన్న దానిని మనం గ్రహించాలి. ఆయన మనలను కేవలం శరీరం, మెదడుతోనే కాక అంతకన్నా మిన్నగా సృజించాడు. ఆయన మనలను విశిష్టమైన మానసిక భావోద్రేక లక్షణాలతో కూడ సృజించాడు.

2 మన మానసిక, భావోద్రేక నిర్మాణములో స్వేచ్ఛా చిత్తం ఒక కీలకమైన భాగం. అవును, దేవుడు మనలో ఎంపిక చేసుకునే స్వతంత్ర సామర్థ్యాన్ని ఉంచాడు. నిశ్చయంగా అది ఆయన యిచ్చిన అద్భుతవరం.

మనమెలా చేయబడ్డాము

 3-5. స్వేచ్ఛా చిత్తాన్ని మనమెందుకు మెచ్చుకొందుము?

3 దేవుడు బాధను అనుమతించిన దానిలో స్వేచ్ఛాచిత్తము ఎలా ముడిపడియున్నదో గమనిద్దాం. మొదట, ఈ విషయాన్ని యోచించండి. నీవు చేసేది, చెప్పేది, నీవు భుజించేది, ధరించేది, నీవెలాంటి పని చేస్తావో, నీవెచ్చట ఎలా జీవిస్తావనే వాటిని ఎంపిక చేసుకొనడానికి స్వేచ్ఛ ఉంటే నీవు మెచ్చుకుంటావా? లేక నీ జీవితంలో ప్రతి నిత్యమూ ఎవరో ఒకరు ప్రతిమాట, క్రియను గూర్చి నీకు చెబుతుండాలని నీవు కోరుకుంటావా?

4 ఏ సామాన్య వ్యక్తి తన జీవితము పూర్తిగా తన అధీనమునుండి అలా తీసివేయబడాలని కోరుకొనడు. ఎందుకు? ఎందుకంటె దేవుడు మనలనలా సృజించాడు. దేవుడు మానవుని తన ‘స్వరూపమందు, తనపోలిక చొప్పున’ సృజించాడని బైబిలు మనకు తెల్పుచున్నది, దేవుడు కల్గియున్న తన లక్షణాలలో ఒకటి ఎంపిక చేసుకొనే స్వేచ్ఛాచిత్తం. (ఆదికాండము 1:26: ద్వితీయోపదేశకాండము 7:6) ఆయన మానవులను సృజించినపుడు స్వేచ్ఛాచిత్తమనే వరాన్ని, అదే అద్భుత లక్షణాన్ని ఆయన వారికిచ్చాడు. అందుకే అణగద్రొక్కే పాలకులకు బానిసలవ్వాలంటే మనకు విసుగ్గావుంటుంది.

5 కావున స్వాతంత్ర్యము కొరకైన కోరిక అకస్మాత్తుగా కల్గిందికాదు, దేవుడు స్వాతంత్ర్యాన్నిచ్చే దేవుడే. బైబిలు యిలా చెబుతున్నది: “ప్రభువు యొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యమునుండును.” (2 కొరింథీయులు 3:17) అందుచేత మన నిర్మాణ ఆకృతిలో ఒక భాగంగా దేవుడు మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు. మన మనస్సులు, భావోద్రేకాలు, పనిచేసే తీరు ఆయన ఎరుగును గనుక, స్వేచ్ఛాచిత్తంతో మనం అత్యంత సంతోషముగా ఉండగలమని ఆయనకు తెలుసు.

 6. స్వేచ్ఛా చిత్తముతో పొందికగా పనిచేయుటకు దేవుడు మన మెదడును ఎలా సృష్టించాడు?

6 స్వేచ్ఛాచిత్త వరంతో జీవించగల్గునట్లు, ఆలోచించి, విషయాలను తూచిచూసి, నిర్ణయాలు చేసి, మంచి చెడులను తెలుసుకోగల సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. (హెబ్రీయులు 5:14) ఆ విధంగా స్వేచ్ఛాచిత్తం వివేకమైన ఎంపికపై ఆధారపడవలసి యుండెను. స్వంత చిత్తం లేకుండా మెదడు లేని మర మనుష్యుల వలె మనం చేయబడలేదు, లేక జంతువులవలె సహజ జ్ఞానమును బట్టి నడుచుకొనడానికి మనం సృజింపబడలేదు. బదులుగా, అద్భుతమైన మన మెదడు మన స్వేచ్ఛాచిత్తానికి అనుగుణ్యంగా పనిచేసే విధంగా రూపొందించబడింది.

శ్రేష్ఠమైన ప్రారంభం

 7, 8. మన ఆదితలిదండ్రులకు దేవుడెట్టి శ్రేష్ఠమైన ప్రారంభమునిచ్చాడు?

7 దేవుడెంతటి శ్రద్ధగలవాడో చూపేందుకు మన ఆది తలిదండ్రులైన ఆదాము, హవ్వలకు స్వేచ్ఛాచిత్తమనే వరముతో పాటు ఎవరికైనా సహేతుకంగా అవసరమగు ప్రతిది వారికిచ్చాడు. ఒక పెద్ద ఉద్యానవనంలాంటి పరదైసులో వారుంచబడ్డారు. వారికి సమృద్ధియైన సంపద ఉన్నది. వారు వృద్ధులై లేక రోగగ్రస్థులై లేదా చనిపోనగత్యత లేని పరిపూర్ణ మనస్సు, శరీరాలు వారికివ్వబడ్డాయి—వారు నిరంతరం జీవించ గల్గియుండేవారు. సంతోషదాయకమైన నిత్య భవిష్యత్తును కల్గియుండే పరిపూర్ణ పిల్లలను కూడ వారు పొంది యుండేవారు. విస్తరిస్తున్న జనాబా ఈ భూమినంతటిని తుదకు పరదైసుగా మార్చే సంతృప్తికరమైన పనిని కలిగియుండేవారు.—ఆదికాండము 1:26-30; 2:15.

8 పొందుపర్చబడిన దానిని గూర్చి బైబిలు యిలా వివరిస్తున్నది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగానుండెను.” (ఆదికాండము 1:31) దేవుని గూర్చి బైబిలు యిలా కూడ అంటోంది: “ఆయన కార్యము సంపూర్ణము.” (ద్వితీయోపదేశకాండము 32:4) అవును, సృష్టికర్త మానవ కుటుంబానికి ఒక పరిపూర్ణ ప్రారంభాన్నిచ్చాడు. లేకపోతే అది బాగుండక పోవును. ఆయన ఎంతటి శ్రద్ధ కల్గిన దేవుడు!

పరిమితులందే స్వాతంత్ర్యము

 9, 10. స్వేచ్ఛా చిత్తమునెందుకు సరిగా ఉపయోగించాలి?

9 అయితే, పరిమితులు లేకుండా స్వేచ్ఛా చిత్తముండాలని దేవుడు సంకల్పించాడా? ప్రతి ఒక్కరు ఏ వైపుకైనా, ఎంత వేగంతోనైనా వెళ్తూండే రహదారి నిబంధనలు లేని ఒక రద్దీ నగరాన్ని ఊహించండి. అలాంటి పరిస్థితుల్లో మీరు వాహనాన్ని నడుపగోరతారా? లేదు, అది రహదారి అరాచకత్వం, అందుమూలంగా అనేక ప్రమాదాలు నిశ్చయంగా సంభవిస్తాయి.

10 దేవుడిచ్చిన స్వేచ్ఛాచిత్త వరం విషయములో కూడ అంతే. అపరిమితమైన స్వాతంత్ర్యము సమాజంలో అరాచకత్వాన్ని రేపుతుంది. మానవుని కార్యాలలో నడిపింపునిచ్చుటకు కొన్ని నిబంధనలు ఉండాల్సిందే. దేవుని వాక్యమిట్లంటున్నది: “స్వతంత్రులుగా ప్రవర్తించండి, దుష్టత్వమును ఒక సాకుగా తీసుకొని మీ స్వాతంత్ర్యమును ఎన్నడు దుర్వినియోగం చేయకండి.” (1 పేతురు 2:16; JB) అందరి క్షేమము కొరకు స్వేచ్ఛా చిత్తము ఉపయోగపడాలని దేవుడు కోరాడు. మనము పూర్తి స్వాతంత్ర్యమును కాక, పరిమిత స్వాతంత్ర్యమునకు, శాసన పాలనకు లోబడి యుండేవారమై యుండునట్లు దేవుడు సంకల్పించాడు.

ఎవరి శాసనాలు?

11. మనమెవరి శాసనాలకు విధేయులమగుటకు రూపింపబడ్డాము?

11 ఎవరి శాసనాలకు విధేయులమగుటకు మనం రూపింపబడ్డాము? మొదటి పేతురు 2:16 (JB) నందున్న లేఖనమందలి మరోభాగము ఇట్లంటున్నది: “మీరు దేవునికే తప్ప మరెవరికిని దాసులుకారు.” అది అణగార్చే దాస్యమని దాని భావం కాదు గాని మనం దేవుని శాసనాలకు లోబడియుంటే అత్యంత ఆనంద భరితులమగుటకు రూపింపబడ్డామని దాని భావం. (మత్తయి 22:35-40) ఆయన శాసనాలు, మానవునిచే ఏర్పాటు చేయబడిన ఎటువంటి శాసనాలకంటె శ్రేష్ఠమైన నడిపింపు యివ్వగలవు. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడువ వలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.

12. దేవుని శాసనముల విషయంలో మనకెటువంటి స్వేచ్ఛ ఉన్నది?

12 అదే సమయంలో, దేవుని శాసనాలు వాటి పరిధుల్లోనే వాటిని ఎంపిక చేసుకొనే మహత్తైన స్వాతంత్ర్యాన్ని అనుమతిస్తున్నవి. ఇందువలన అది విభిన్న ఫలితాలనిచ్చి మానవ కుటుంబాన్ని ఉల్లాసవంతం చేస్తుంది. ప్రపంచమంతటానున్న విభిన్న రకాల ఆహారం, వస్త్రాలు, సంగీతం, కళ, గృహాలను గూర్చి తలంచండి. అట్టి విషయాలలో మనకొరకు మరో వ్యక్తి నిర్ణయం చేసే బదులు మన ఎంపికను మనమే చేసుకోవడానికి నిశ్చయంగా కోరుకుంటాము.

13. మనస్వంత ప్రయోజనముల నిమిత్తము ఏ భౌతిక నియమాలకు కట్టుబడి ఉండాలి?

13 ఆవిధంగా మానవ ప్రవర్తన విషయంలో దేవుని శాసనాలకు లోబడినప్పుడు సంతోషంగా ఉండేందుకు మనం సృజించబడ్డాము. అది దేవుని భౌతిక శాసనాలకు లోబడియుండునట్టిదే. దృష్టాంతమునకు, భూమ్యాకర్షణ శక్తిని గూర్చిన నియమమును మనం విస్మరించి, ఒక ఎత్తైన ప్రదేశంనుండి దూకితే మనకు దెబ్బలు తగులుతాయి లేదా మనం చనిపోతాము. మన శరీరమందలి నియమాలను అలక్ష్యంచేసి, ఆహారం తినకుండా, నీళ్లు త్రాగకుండా, గాలి పీల్చు కోకుండా ఉంటే మనం చనిపోతాం.

14. దేవుని నుండి వేరైయుండుటకు మానవులు సృజించబడలేదని మనకెలా తెలుసు?

14 దేవుని భౌతిక నియమాలకు లోబడియుండే ఆవశ్యకతతో మనము సృజింపబడినట్టే దేవుని నైతిక, సాంఘిక శాసనాలకు లోబడియుండే ఆవశ్యకతతో మనం సృజించబడ్డాము. (మత్తయి 4:4) మానవులు తమ నిర్మాణకుని నుండి వేరై స్వేచ్ఛాజీవులుగా ఉండునట్లు సృజింపబడలేదు. ఇర్మీయా ప్రవక్త యిట్లంటున్నాడు: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు. యెహోవా నన్ను శిక్షింపుము.” (యిర్మీయా 10:23, 24) కనుక, మానవులు ప్రతి విషయములోను తమ స్వంత పాలన క్రింద కాక, దేవుని పరిపాలన క్రింద జీవించుటకే సృజింపబడ్డారు.

15. ఆదాము హవ్వలకు దేవుని శాసనాలు భారమైయుండెనా?

15 దేవుని శాసనాలకు లోబడుట మన ఆదితలిదండ్రులకు భారంగా ఉండి యుండదు. బదులు, అది తమకు మానవ కుటుంబమంతటి సంక్షేమము కొరకు పనిచేసియుండేది. ఆదిదంపతులు దేవుని శాసనాల పరిధిలోనే నిలిచి యుంటే, అంతా సవ్యంగా జరిగియుండేది. నిజానికి మనమిప్పుడు ఉల్లాసవంతమైన అద్భుత పరదైసులో ప్రేమగల, ఐక్యమానవ కుటుంబముగా జీవించి యుండేవారము. దుష్టత్వం, బాధ, మరణం ఉండేవు కావు.

[అధ్యయన ప్రశ్నలు]

[11 వ పేజీలోని చిత్రం]

సృష్టికర్త మానవులకు పరిపూర్ణ ప్రారంభమునిచ్చాడు

[12 వ పేజీలోని చిత్రం]

రహదారి నిబంధనలేమి లేకుండా ఉంటే ట్రాఫిక్‌ రద్దీగా ఉన్నపుడు నీవు వాహనాన్ని నడుపగోరుదువా?