కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవం మరియు రక్తం ఎడల గౌరవం చూపించడం

జీవం మరియు రక్తం ఎడల గౌరవం చూపించడం

పాఠం 12

జీవం మరియు రక్తం ఎడల గౌరవం చూపించడం

మనం జీవాన్ని ఎలా దృష్టించాలి? (1) గర్భస్రావాన్ని ఎలా దృష్టించాలి? (1)

క్రైస్తవులు తాము భద్రత విషయంలో శ్రద్ధ కలిగివున్నామని ఎలా చూపిస్తారు? (2)

జంతువులను చంపడం తప్పా? (3)

జీవం ఎడల గౌరవం లేదని చూపే కొన్ని ఆచారాలు ఏవి? (4)

రక్తం విషయంలో దేవుని నియమమేమిటి? (5)

ఇందులో రక్త మార్పిడులు కూడా చేరివున్నాయా? (6)

1. యెహోవా జీవానికి మూలం. జీవం గలవన్నీ ఆ జీవానికై దేవునికి రుణపడి ఉన్నాయి. (కీర్తన 36:9) జీవం దేవుని దృష్టిలో పరిశుద్ధమైనది. తల్లి గర్భంలో ఉన్న జన్మించని శిశువు జీవం కూడా యెహోవాకు అమూల్యమైనదే. ఎదుగుతున్న అలాంటి శిశువును ఉద్దేశపూర్వకంగా చంపడం దేవుని దృష్టిలో తప్పు.—నిర్గమకాండము 21:22, 23; కీర్తన 127:3.

2. నిజ క్రైస్తవులు భద్రత విషయంలో శ్రద్ధ కలిగివుంటారు. వారు తమ కార్లు మరియు గృహాలు సురక్షితమైనవిగా ఉండేలా చూసుకుంటారు. (ద్వితీయోపదేశకాండము 22:8) దేవుని సేవకులు కేవలం సరదా కొరకు లేక ఆనందం కొరకు అనవసరమైన సాహసాలు చేయరు. ఇతరులను ఉద్దేశపూర్వకంగా గాయపర్చే హింసాత్మక క్రీడల్లో వారు పాల్గొనరు. దౌర్జన్యాన్ని ప్రోత్సహించే వినోదాన్ని వారు విసర్జిస్తారు.—కీర్తన 11:5; యోహాను 13:35.

3. జంతు జీవం కూడా సృష్టికర్తకు పరిశుద్ధమైనదే. ఆహారం మరియు వస్త్రాల కొరకు లేక అనారోగ్యం నుండి, ప్రమాదం నుండి తనను తాను కాపాడుకోవడానికి ఒక క్రైస్తవుడు జంతువులను చంపవచ్చు. (ఆదికాండము 3:21; 9:3; నిర్గమకాండము 21:28) కాని జంతువులను సరిగా చూడకపోవడం లేక కేవలం ఆట కొరకు లేక ఆనందం కొరకు వాటిని చంపడం తప్పు.—సామెతలు 12:10.

4. క్రైస్తవులు పొగత్రాగడం, వక్కపొడి నమలడం, ఆనందం కొరకు మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటివి చేయరు. ఈ అలవాట్లు సరైనవి కావు ఎందుకంటే, (1) అవి మనల్ని వాటికి బానిసలను చేస్తాయి, (2) అవి మన శరీరాలకు హాని కలిగిస్తాయి, మరియు (3) అవి అశుద్ధమైనవి. (రోమీయులు 6:19; 12:1; 2 కొరింథీయులు 7:1) ఈ అలవాట్లను మానుకోవడం ఎంతో కష్టం కావచ్చు. కాని యెహోవాను ప్రీతిపర్చేందుకు మనం అలా చేయాలి.

5. దేవుని దృష్టిలో రక్తం కూడా పరిశుద్ధమైనది. ప్రాణం లేక జీవం రక్తంలో ఉందని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి రక్తాన్ని తినడం తప్పు. సరైనవిధంగా రక్తం ఒలికించని జంతువు మాంసాన్ని తినడం కూడా తప్పే. ఒక జంతువు గొంతు పిసికి చంపబడితే లేక బోనులో చనిపోతే, దాన్ని తినకూడదు. ఒకవేళ దాన్ని బల్లెముతో పొడిచి లేక తుపాకీతో కాల్చి చంపితే, దాన్ని తినాలనుకుంటే వెంటనే దానిలో నుండి రక్తాన్ని ఒలికించాలి.—ఆదికాండము 9:3, 4; లేవీయకాండము 17:13, 14; అపొస్తలుల కార్యములు 15:28, 29.

6. రక్తమార్పిడిని అంగీకరించడం తప్పా? గుర్తుంచుకోండి, మనం రక్తాన్ని విసర్జించాలని యెహోవా కోరుతున్నాడు. అంటే దీని భావం, ఇతరుల రక్తాన్ని లేక నిలువ ఉంచబడిన మన స్వంత రక్తాన్ని మనం మన శరీరాల్లోకి ఏవిధంగానూ తీసుకోకూడదు. (అపొస్తలుల కార్యములు 21:25) గనుక నిజ క్రైస్తవులు రక్తమార్పిడిని అంగీకరించరు. రక్తరహిత ఉత్పత్తులను ఎక్కించుకోవడం వంటి ఇతర రకాలైన వైద్య సంబంధ చికిత్సలను వాళ్లు అంగీకరిస్తారు. జీవించాలని వారు కోరుకుంటారు, కాని దేవుని నియమాలను ఉల్లంఘించడం ద్వారా తమ జీవాన్ని కాపాడుకోవడానికి వారు ప్రయత్నించరు.—మత్తయి 16:25.

[25వ పేజీలోని చిత్రం]

దేవున్ని ప్రీతిపర్చడానికి, మనం రక్తమార్పిడులను, అపవిత్రమైన అలవాట్లను, అనవసరమైన సాహసాలను విసర్జించాలి