దేవునికి అప్రీతికరమైన నమ్మకాలు, ఆచారాలు
పాఠం 11
దేవునికి అప్రీతికరమైన నమ్మకాలు, ఆచారాలు
ఎటువంటి నమ్మకాలు, ఆచారాలు తప్పు? (1)
దేవుడు త్రిత్వమని క్రైస్తవులు నమ్మాలా? (2)
నిజక్రైస్తవులు క్రిస్టమస్‌ను, ఈస్టర్‌ను, లేక జన్మదినాలను ఎందుకు ఆచరించరు? (3, 4)
మృతులు జీవించివున్నవారికి హానిచేయగలరా? (5) యేసు సిలువపై మరణించాడా? (6) దేవున్ని ప్రీతిపర్చడం ఎంత ప్రాముఖ్యం? (7)
1. అన్ని నమ్మకాలు, ఆచారాలు చెడ్డవికావు. కాని, అవి అబద్ధమతం నుండి వచ్చినవైతే లేక బైబిలు బోధలకు వ్యతిరేకమైనవైతే, దేవుడు వాటిని అంగీకరించడు.—మత్తయి 15:6.
2. త్రిత్వము: యెహోవా ఒక త్రిత్వమా—ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులా? కాదు! తండ్రియైన యెహోవా ‘అద్వితీయ సత్యదేవుడు.’ (యోహాను 17:3; మార్కు 12:29) యేసు ఆయన మొదటి కుమారుడును దేవునికి లోబడువాడునైయున్నాడు. (1 కొరింథీయులు 11:3) తండ్రి కుమారుని కంటే గొప్పవాడు. (యోహాను 14:28) పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు; అది దేవుని చురుకైన శక్తి.—ఆదికాండము 1:2; అపొస్తలుల కార్యములు 2:18.
3. క్రిస్టమస్ మరియు ఈస్టర్: యేసు డిశంబరు 25న జన్మించలేదు. గొర్రెల కాపరులు తమ మందలను రాత్రిపూట బయట ఉంచే కాలమగు సంవత్సరంలోని ఆ సమయంలో అంటే అక్టోబరు 1, ఆ ప్రాంతంలో ఆయన జన్మించాడు. (లూకా 2:8-12) తన జన్మదినాన్ని ఆచరించుమని యేసు ఎన్నడూ క్రైస్తవులకు ఆజ్ఞాపించలేదు. బదులుగా, తన మరణాన్ని జ్ఞాపకార్థంగా ఆచరించుమని లేక గుర్తుంచుకోమని ఆయన తన శిష్యులకు చెప్పాడు. (లూకా 22:19, 20) క్రిస్టమస్ మరియు దాని ఆచారాలు ప్రాచీన అబద్ధమతాల నుండి వచ్చినవే. గ్రుడ్లను, కుందేళ్లను వాడడం వంటి ఈస్టర్ ఆచారాల విషయం కూడా అంతే. తొలి క్రైస్తవులు క్రిస్టమస్‌ను లేదా ఈస్టర్‌ను ఆచరించలేదు, నేడు నిజ క్రైస్తవులు కూడా ఆచరించరు.
4. జన్మదినాలు: బైబిలులో ప్రస్తావించబడిన రెండే రెండు జన్మదిన వేడుకలను యెహోవాను ఆరాధించని ఆదికాండము 40:20-22; మార్కు 6:21, 22, 24-27) తొలి క్రైస్తవులు జన్మదినాలను జరుపుకోలేదు. జన్మదినాలను జరుపుకొనే ఆచారం ప్రాచీన అబద్ధమతాల నుండి వచ్చింది. నిజ క్రైస్తవులు సంవత్సరంలోని ఇతర సమయాల్లో బహుమతులు ఇచ్చుకుంటారు, కలిసి మంచిగా సమయం గడుపుతారు.
వ్యక్తులు జరుపుకున్నారు. (5. మృతులను గూర్చిన భయం: మృతులు ఏమీ చేయలేరు లేక ఏమీ అనుభవించలేరు. మనం వారికి సహాయం చేయలేము, వాళ్లు మనకు హాని చేయలేరు. (కీర్తన 146:4; ప్రసంగి 9:5, 10) మనిషి మరణిస్తాడు; మరణం తర్వాత అతనిలోని ఏ భాగము జీవించి ఉండదు. (యెహెజ్కేలు 18:4) కాని కొన్నిసార్లు, దయ్యాలని పిలువబడే దుష్టులైన దేవదూతలు మృతుల ఆత్మలవలె నటిస్తారు. మృతులను గూర్చిన భయానికి లేక ఆరాధనకు సంబంధించిన ఆచారాలు తప్పు.—యెషయా 8:19.
6. సిలువ: యేసు సిలువపై మరణించలేదు. ఆయన ఒక స్తంభం లేదా ఒక మ్రాను మీద మరణించాడు. అనేక బైబిళ్లలో “సిలువ” అని అనువదింపబడిన గ్రీకు పదం యొక్క భావం కేవలం ఒక చిన్న దూలము అని మాత్రమే. సిలువ గుర్తు ప్రాచీన అబద్ధమతాల నుండి వచ్చింది. తొలి క్రైస్తవులు సిలువను ఉపయోగించలేదు, ఆరాధించలేదు. కాబట్టి, ఆరాధనలో సిలువను ఉపయోగించడం సరైనదై ఉండగలదని మీరు అనుకుంటున్నారా?—ద్వితీయోపదేశకాండము 7:26; 1 కొరింథీయులు 10:14.
7. ఇలాంటి కొన్ని నమ్మకాలను, ఆచారాలను విడిచిపెట్టడం ఎంతో కష్టమే కావచ్చు. మీ నమ్మకాలను మార్చుకోవద్దని మిమ్మల్ని ఒప్పించడానికి బంధువులు మరియు స్నేహితులు ప్రయత్నించవచ్చు. కాని మనుష్యులను ప్రీతిపర్చడం కంటే దేవున్ని ప్రీతిపర్చడం ఎక్కువ ప్రాముఖ్యం.—సామెతలు 29:25; మత్తయి 10:36, 37.
[22వ పేజీలోని చిత్రం]
దేవుడు ఒక త్రిత్వము కాదు
[23వ పేజీలోని చిత్రం]
క్రిస్టమస్, ఈస్టర్ ప్రాచీన అబద్ధ మతాల నుండి వచ్చినవి
[23వ పేజీలోని చిత్రం]
మృతులను ఆరాధించడానికి లేక వారికి భయపడడానికి కారణమే లేదు