కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని చిత్తాన్ని చేయడానికి ఇతరులకు సహాయం చేయడం

దేవుని చిత్తాన్ని చేయడానికి ఇతరులకు సహాయం చేయడం

పాఠం 15

దేవుని చిత్తాన్ని చేయడానికి ఇతరులకు సహాయం చేయడం

మీరు నేర్చుకుంటున్న దాని గురించి ఇతరులకు ఎందుకు చెప్పాలి? (1)

సువార్తను మీరు ఎవరికి చెప్పవచ్చు? (2)

మీ ప్రవర్తన ఇతరులపై ఏ ప్రభావాన్ని చూపగలదు? (2)

సంఘంతో కలిసి మీరు ఎప్పుడు ప్రకటించవచ్చు? (3)

1. ఇప్పటికల్లా మీరు బైబిలు నుండి అనేక మంచి విషయాలు నేర్చుకున్నారు. మీరు క్రైస్తవ వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఈ జ్ఞానం నడిపించాలి. (ఎఫెసీయులు 4:22-24) మీరు నిత్యజీవం పొందడానికి అలాంటి జ్ఞానం అత్యావశ్యకం. (యోహాను 17:3) అయితే, ఇతరులు కూడా రక్షింపబడేలా వారూ సువార్తను వినడం అవసరం. నిజ క్రైస్తవులందరూ ఇతరులకు సాక్ష్యమివ్వాలి. అది దేవుని ఆజ్ఞ.—రోమీయులు 10:10; 1 కొరింథీయులు 9:16; 1 తిమోతి 4:16.

2. మీరు నేర్చుకుంటున్న మంచి విషయాలను మీకు సమీపంలో ఉన్నవారికి చెప్పడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు. వాటిని మీ కుటుంబానికి, స్నేహితులకు, తోటి విద్యార్థులకు, తోటి ఉద్యోగస్థులకు చెప్పండి. మీరలా చేసేటప్పుడు దయ, సహనం కల్గివుండండి. (2 తిమోతి 2:24, 25) ప్రజలు తరచూ, ఒక వ్యక్తి చెప్పేదాన్ని వినడం కంటే ఎక్కువగా అతని ప్రవర్తనను గమనిస్తారని జ్ఞాపకముంచుకోండి. కాబట్టి మీరు ఇతరులకు చెప్పే వర్తమానాన్ని వినేలా మీ మంచి ప్రవర్తన వారిని ఆకర్షించగలదు.—మత్తయి 5:16; 1 పేతురు 3:1, 2, 16.

3. కొంత కాలానికి, యెహోవాసాక్షుల స్థానిక సంఘంతో కలిసి ప్రకటించే పనిని ప్రారంభించడానికి మీరు అర్హులు కావచ్చు. మీ అభివృద్ధిలో ఇదొక ప్రాముఖ్యమైన మెట్టు. (మత్తయి 24:14) ఎవరైనా ఒకరు యెహోవా సేవకులుగా తయారై, నిత్యజీవాన్ని పొందగలిగేలా మీరు వారికి సహాయం చేయగలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో కదా!—1 థెస్సలొనీకయులు 2:19, 20.