కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సేవ చేయాలన్న మీ నిర్ణయం

దేవుని సేవ చేయాలన్న మీ నిర్ణయం

పాఠం 16

దేవుని సేవ చేయాలన్న మీ నిర్ణయం

మీరు దేవుని స్నేహితులు కావాలంటే మీరేమి చేయాలి? (1, 2)

మీరు దేవునికి మిమ్మల్ని మీరు ఎలా సమర్పించుకుంటారు? (1)

మీరు ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి? (2)

దేవుని ఎడల నమ్మకత్వం కల్గివుండడానికి మీరు బలాన్ని ఎలా పొందగలరు? (3)

1. దేవుని స్నేహితులు కావాలంటే, మీరు బైబిలు సత్యాన్ని గూర్చిన మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి (1 తిమోతి 2:3, 4), మీరు నేర్చుకున్నవాటి యందు విశ్వాసం ఉంచాలి (హెబ్రీయులు 11:6), మీ పాపాల గురించి పశ్చాత్తాపపడాలి (అపొస్తలుల కార్యములు 17:30, 31), మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. (అపొస్తలుల కార్యములు 3:19, 20) ఆ తర్వాత దేవుని ఎడల మీకున్న ప్రేమ మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొనేందుకు పురికొల్పాలి. అంటే దీని భావం మీరు వ్యక్తిగతంగా, స్వయంగా చేసుకునే ప్రార్థనలో ఆయన చిత్తాన్ని చేయడానికి మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకుంటున్నారని ఆయనకు తెల్పడం.—మత్తయి 16:24; 22:37.

2. మీరు దేవునికి సమర్పించుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకోవాలి. (మత్తయి 28:19, 20) బాప్తిస్మమనేది, మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుంది. కాబట్టి బాప్తిస్మమన్నది, దేవుని సేవ చేయడానికి నిర్ణయించుకోగల్గిన వయస్సుగల వారికి మాత్రమే. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకునేటప్పుడు, అతని మొత్తం శరీరం ఒక క్షణం పూర్తిగా నీళ్లలో ముంచబడాలి. *మార్కు 1:9, 10; అపొస్తలుల కార్యములు 8:36.

3. మీరు సమర్పించుకున్న తర్వాత, మీరు మీ వాగ్దానానికి అనుగుణ్యంగా జీవించాలని యెహోవా నిరీక్షిస్తాడు. (కీర్తన 50:14; ప్రసంగి 5:4, 5) యెహోవా సేవచేయకుండా మిమ్మల్ని ఆపాలని అపవాది ప్రయత్నిస్తాడు. (1 పేతురు 5:8) కాని ప్రార్థనలో దేవునికి సన్నిహితమవ్వండి. (ఫిలిప్పీయులు 4:6, 7) ప్రతిరోజు ఆయన వాక్యాన్ని పఠించండి. (కీర్తన 1:1-3) సంఘంతో సన్నిహితంగా సహవసించండి. (హెబ్రీయులు 13:17) ఇవన్నీ చేయడం ద్వారా, దేవుని ఎడల నమ్మకత్వం కల్గివుండడానికి కావలసిన బలాన్ని మీరు పొందుతారు. అలా, దేవుడు మీ నుండి కోరుతున్న వాటిని మీరు నిరంతరం చేయగలరు!

[అధస్సూచీలు]

^ పేరా 8 బాప్తిస్మం కొరకు సిద్ధపడడానికై, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని లేక వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన అలాంటిదే మరో పుస్తకాన్ని పఠించాలని సిఫారసు చేయబడుతోంది.