కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?

భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?

పాఠం 5

భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?

యెహోవా భూమిని ఎందుకు సృష్టించాడు? (1, 2)

భూమి ఇప్పుడు పరదైసుగా ఎందుకు లేదు? (3)

దుష్ట ప్రజలకు ఏమి సంభవిస్తుంది? (4)

భవిష్యత్తులో, అనారోగ్యుల కొరకు, పెద్దవారి కొరకు, మృతుల కొరకు యేసు ఏమి చేస్తాడు? (5, 6)

భవిష్యత్‌ ఆశీర్వాదాలను పొందడానికి, మీరు ఏమి చేయవలసిన అవసరం ఉంది? (7)

1. మానవులు ఈ భూమిపై నిరంతర జీవితాన్ని అనుభవించేలా యెహోవా భూమిని సృష్టించాడు. భూమి ఎల్లప్పుడూ నీతియుక్తమైన, ఆనందభరితమైన ప్రజలతో నిండివుండాలని ఆయన ఇష్టపడ్డాడు. (కీర్తన 115:16; యెషయా 45:18) భూమి ఎన్నటికీ నాశనం చేయబడదు; అది నిరంతరం నిలుస్తుంది.—కీర్తన 104:5; ప్రసంగి 1:4.

2. దేవుడు మనిషిని చేయక మునుపు, ఆయన భూమిపై ఒక చిన్న భాగాన్ని ఎన్నుకొని, దాన్ని సుందరమైన పరదైసుగా తయారు చేశాడు. ఆయన దాన్ని ఏదెను తోట అని పిలిచాడు. ఆయన మొదటి స్త్రీపురుషులైన ఆదాముహవ్వలను ఉంచాడు. వారు పిల్లలను కని భూమిని నిండించాలని దేవుడు సంకల్పించాడు. క్రమేణ వాళ్లు మొత్తం భూమిని పరదైసుగా చేసివుండేవారు.—ఆదికాండము 1:28; 2:8, 15.

3. ఉద్దేశపూర్వకంగా దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా ఆదాముహవ్వలు పాపం చేశారు. కాబట్టి యెహోవా వారిని ఏదెను తోట బయటికి పంపాడు. పరదైసు చేజారిపోయింది. (ఆదికాండము 3:1-6, 23) కాని యెహోవా ఈ భూమి ఎడల తనకుగల సంకల్పాన్ని మరచిపోలేదు. ఆయన దాన్ని, మానవులు నిరంతరం జీవించగల పరదైసుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దీన్నెలా చేస్తాడు?—కీర్తన 37:29.

4. ఈ భూమి పరదైసుగా మార్చబడడానికి ముందు, దుష్టప్రజలు నిర్మూలించబడాలి. (కీర్తన 37:38) ఇది, దుష్టత్వాన్ని అంతమొందించే దేవుని యుద్ధమగు అర్మగిద్దోనులో జరుగుతుంది. ఆ తర్వాత, సాతాను 1,000 సంవత్సరాల వరకు బంధింపబడతాడు. అంటే భూమిని పాడుచేయడానికి దుష్టులెవ్వరూ మిగిలి ఉండరని దీని భావం. కేవలం దేవుని ప్రజలే తప్పించుకొంటారు.—ప్రకటన 16:14, 16; 20:1-3.

5. తర్వాత యేసు క్రీస్తు ఈ భూమిని 1,000 సంవత్సరాలు రాజుగా పరిపాలిస్తాడు. (ప్రకటన 20:6) ఆయన క్రమేణ మన మనస్సుల్లో నుండి శరీరాల్లో నుండి పాపాన్ని తీసివేస్తాడు. అప్పుడు మనం, పాపం చేయకముందు ఆదాముహవ్వలు ఉన్నట్లుగా, పరిపూర్ణ మానవులమౌతాము. అప్పుడిక రోగం, వృద్ధాప్యం, మరణం ఉండవు. రోగులు స్వస్థపర్చబడతారు, వృద్ధులు మళ్లీ యౌవనులౌతారు.—యోబు 33:25; యెషయా 33:24; ప్రకటన 21:3, 4.

6. యేసు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, విశ్వాసులైన మానవులు యావత్‌ భూమిని పరదైసుగా మార్చేందుకు పనిచేస్తారు. (లూకా 23:43) అంతేకాక, లక్షలాదిమంది మృతులు భూమిపై మానవులుగా పునరుత్థానం చేయబడతారు. (అపొస్తలుల కార్యములు 24:15) దేవుడు కోరేదాన్ని వారు చేస్తే, వారు భూమిపై నిరంతరం జీవిస్తూనే ఉంటారు. లేకపోతే, వారు మరెన్నడూ ఉండకుండా నాశనం చేయబడతారు.—యోహాను 5:28, 29; ప్రకటన 20:11-15.

7. అలా, భూమి ఎడల దేవుని ఆది సంకల్పం సఫలమౌతుంది. ఈ భవిష్యత్‌ ఆశీర్వాదాలను పొందాలని మీరు ఇష్టపడుతున్నారా? అలాగైతే, మీరు యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయన ఆజ్ఞలకు విధేయలౌతూ ఉండడం అవసరం. అలా చేయడానికి, యెహోవా సాక్షుల స్థానిక రాజ్య మందిరంలో జరిగే కూటాలకు హాజరు కావడం మీకు సహాయం చేస్తుంది.—యెషయా 11:9; హెబ్రీయులు 10:24, 25.

[10వ పేజీలోని చిత్రం]

పరదైసు చేజారిపోయింది

[10వ పేజీలోని చిత్రం]

అర్మగిద్దోను తర్వాత, భూమి పరదైసుగా మార్చబడుతుంది