కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు ఎలా సంస్థీకరింపబడి ఉన్నారు

యెహోవాసాక్షులు ఎలా సంస్థీకరింపబడి ఉన్నారు

పాఠం 14

యెహోవాసాక్షులు ఎలా సంస్థీకరింపబడి ఉన్నారు

యెహోవాసాక్షులు ఆధునిక కాలాల్లో ఎప్పుడు ప్రారంభమయ్యారు? (1)

యెహోవాసాక్షుల కూటాలు ఎలా నిర్వహించబడతాయి? (2)

ఖర్చులు ఎలా భరిస్తారు? (3)

ప్రతి సంఘంలో ఎవరు నాయకత్వం వహిస్తారు? (4)

ప్రతి సంవత్సరం ఏ పెద్ద కూటాలు జరుగుతాయి? (5)

వారి ప్రధాన కార్యాలయంలోనూ బ్రాంచి కార్యాలయాల్లోనూ ఏ పని జరుగుతోంది? (6)

1. యెహోవాసాక్షులు ఆధునిక కాలాల్లో 1870 వ దశాబ్దం నుండి ప్రారంభమయ్యారు. మొదట్లో, వారు బైబిలు విద్యార్థులని పిలువబడ్డారు. కాని 1931 లో వారు యెహోవాసాక్షులనే లేఖనాధార నామాన్ని స్వీకరించారు. (యెషయా 43:10) చిన్నగా ప్రారంభమైన వారి సంస్థ, లక్షలాదిమంది సాక్షులుగల సంస్థగా ఎదిగింది, వారు 230 కంటే ఎక్కువ దేశాల్లో ప్రకటించడంలో బిజీగా ఉన్నారు.

2. యెహోవాసాక్షుల అనేక సంఘాల్లో ప్రతి వారం మూడుసార్లు కూటాలు జరుగుతాయి. వీటిలో దేనికైనా హాజరయ్యేందుకు మీరు ఆహ్వానింపబడుతున్నారు. (హెబ్రీయులు 10:24, 25) వారు బోధించేదానికి ఆధారం బైబిలే. కూటాలు ప్రార్థనతో ఆరంభమై, ప్రార్థనతో ముగుస్తాయి. అనేక కూటాల్లో హృదయపూర్వక ‘ఆత్మీయ గీతాలు’ ఆలపించడం జరుగుతుంది. (ఎఫెసీయులు 5:18, 19) ప్రవేశం ఉచితం, చందాలు సేకరించబడవు.—మత్తయి 10:8.

3. అనేక సంఘాలు రాజ్య మందిరంలో కూటాలను జరుపుకుంటాయి. సాధారణంగా ఇవి సాక్షులైన స్వచ్ఛంద సేవకులు నిర్మించిన సామాన్యమైన కట్టడాలై ఉంటాయి. విగ్రహాలు, సిలువ మీది క్రీస్తు బొమ్మలు లేక ఇలాంటి వస్తువులేవి మీకు రాజ్య మందిరంలో కనిపించవు. స్వచ్ఛందంగా ఇచ్చే చందాలను ఖర్చులకు ఉపయోగిస్తారు. చందా ఇవ్వాలనుకునేవారి కొరకు అక్కడ ఒక చందా పెట్టె ఉంటుంది.—2 కొరింథీయులు 9:7.

4. ప్రతి సంఘంలో పెద్దలు, లేక అధ్యక్షులు ఉంటారు. సంఘంలో బోధించడం విషయంలో వారు నాయకత్వం వహిస్తారు. (1 తిమోతి 3:1-7; 5:17) వారికి పరిచర్య సేవకులు సహాయం చేస్తారు. (1 తిమోతి 3:8-10, 12, 13) వీరు సంఘస్థులకంటె ఉన్నతమైనవారేమి కాదు. (2 కొరింథీయులు 1:24) వారికి ప్రత్యేకమైన బిరుదులు ఇవ్వబడవు. (మత్తయి 23:8-10) వారు ఇతరులకు భిన్నంగా ప్రత్యేక తరహా దుస్తులు ధరించరు. వారు చేస్తున్న పనిని బట్టి వారికి జీతమేమి ఇవ్వబడదు. పెద్దలు సంఘ ఆత్మీయ అవసరతలను ఇష్టపూర్వకంగా తీరుస్తారు. వారు కష్టసమయాల్లో ఓదార్పును, నడిపింపును ఇవ్వగలరు.—యాకోబు 5:14-16; 1 పేతురు 5:2, 3.

5. యెహోవాసాక్షులు ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద సమావేశాలను కూడా జరుపుకుంటారు. ఈ సమావేశాల్లో, ప్రత్యేక బైబిలు ఉపదేశం కొరకు అనేక సంఘాలు సమకూడుతాయి. ప్రతి సమావేశ కార్యక్రమంలోనూ క్రొత్త శిష్యులకు బాప్తిస్మమిచ్చే పని క్రమంగా జరుగుతుంది.—మత్తయి 3:13-17; 28:19, 20.

6. యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. అక్కడ పరిపాలక సభ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాన్ని పర్యవేక్షించే అనుభవంగల పెద్దల కేంద్ర వర్గం ఉంది. ప్రపంచమంతటిలో వందకుపైగా బ్రాంచి కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ స్థలాల్లో, బైబిలు సాహిత్యాన్ని ముద్రించి, రవాణా చేయడానికి స్వచ్ఛంద సేవకులు సహాయం చేస్తారు. ప్రకటన పనిని సంస్థీకరించడానికి కూడా నడిపింపు ఇవ్వబడుతుంది. మీకు సమీపంలోవున్న బ్రాంచి కార్యాలయాన్ని దర్శించడానికి ఎందుకు పథకం వేసుకోకూడదు?