కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

జెండా వందనం, ఓటు వేయడం, పౌర సేవ

జెండా వందనం, ఓటు వేయడం, పౌర సేవ

జెండా వందనం. జాతీయ గీతం పాడి జెండా వందనం చేయడమంటే రక్షణ కోసం దేవునివైపు కాకుండా మానవ పాలకులవైపు, దేశంవైపు చూసినట్లు అవుతుందని యెహోవాసాక్షులు భావిస్తారు. (యెషయా 43:11; 1 కొరింథీయులు 10:14; 1 యోహాను 5:21) ప్రాచీన బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో జరిగిన ఒక సంఘటనను చూడండి. ఈ గొప్ప చక్రవర్తి తన వైభవాన్ని, మతాసక్తిని చూపించుకోవడానికి పెద్ద ప్రతిమను నిలబెట్టి, జాతీయగీతంలాంటి సంగీతం వినిపిస్తుండగా ప్రజలంతా దాని ఎదుట సాగిలపడాలని ఆజ్ఞ జారీచేశాడు. కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు హెబ్రీయులు మాత్రం మరణ శిక్ష విధించబడుతుందని తెలిసినా ఆ ప్రతిమకు సాగిలపడలేదు.—దానియేలు 3వ అధ్యాయం.

మనకాలంలో “జెండాను పూజించే వస్తువుగా చూస్తున్నారు. జెండాను చూసినప్పుడు ప్రజలు దానికి గౌరవం చూపిస్తూ తలమీది టోపీ తీస్తారు; జెండాను శ్లాఘిస్తూ కవులు గేయాలు రాస్తారు, పిల్లలు దేశభక్తి గీతాలు పాడతారు” అని చరిత్రకారుడైన కార్ల్‌టన్‌ హేయ్స్‌ రాశాడు. మతంలోలాగే, దేశంలో ప్రజలు భక్తితో జాతీయ సెలవుదినాలను ఆచరిస్తారు, దేశం కోసం పాటుపడిన వ్యక్తుల్ని దేవుళ్లుగా చూస్తారు, జాతీయ చిహ్నాలను ఆరాధిస్తారని కూడా ఆయన అన్నాడు. బ్రెజిల్‌లో జరిగిన ఒక ప్రజా ఉత్సవ సభలో ఉన్నతసనికదవ అధ్యక్షుడు ఇలా అన్నాడు: “మాతృదేశాన్ని ఆరాధిస్తున్నట్లే . . . జెండాను కూడా భక్తితో కొలుస్తున్నారు.” అవును, “సిలువలాగే జెండా కూడా పవిత్రమైనదే” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా పేర్కొంది.

పైన పేర్కొన్న ఎన్‌సైక్లోపీడియా ఇటివల ఇలా రాసింది: జాతీయ గీతాలంటే “దేశభక్తితో పాడే పాటలు. అలాంటి చాలాపాటల్లో, ప్రజల్ని లేదా పాలకుల్ని కాపాడి నడిపింమని దేవునికి చేసే విజ్ఞాపన ఉంటుంది.” కాబట్టి, యెహోవా సేవకులు సహేతుకంగానే ఇలాంటి వాటిని మత సంబంధమైనవాటిగా చూస్తారు. జెండా వందనం చేయడానికి లేదా అమెరికా పాఠశాలల్లో విధేయతా ప్రమాణం చేయడానికి యెహోవాసాక్షుల పిల్లలు నిరాకరించడప వ్యాఖ్యానిస్తూ, ది అమెరికన్‌ క్యారెక్టర్‌ అనే పుస్తకం ఇలా అంది: “అనేక కేసులను విచారించిన తర్వాత, ప్రతీరోజు చేసే ఈ పనులు మత సంబంధమైనవేనని ఉన్నత న్యాయస్థానం ధృవీకరించింది.”

యెహోవా ప్రజలు, లేఖన విరుద్ధమైన జాతీయ పండుగల్లో పాల్గొనకపోయినా, వాటిలో భాగం వహించాలనుకునే ఇతరుల అభిప్రాయాల్ని గౌరవిస్తారు. అలాగే వారు జాతీయ పతాకాల్ని గౌరవిస్తూ, అధికార ప్రభుత్వాలు “దేవుని పరిచారకులు[గా]” పనిచేసే పై అధికారులని’ గుర్తిస్తారు. (రోమీయులు 13:1-4) అందుకే యెహోవాసాక్షులు, “రాజుల కొరకును అధికారులందరి కొరకును” ప్రార్థించమనే మాటల్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ “మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను” బ్రతకాలన్న ఉద్దేశంతోనే వాళ్లకోసం ప్రార్థిస్తాం.— 1 తిమోతి 2:1-3.

ఓటు వేయడం. నిజ క్రైస్తవులు ఓటు వేసే విషయంలో ఇతరుల హక్కును గౌరవిస్తారు. వారు ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రచారం చేయరు కానీ, ఎన్నికైన అధికారులతో సహకరిస్తారు. అయితే, రాజకీయ వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు. (మత్తయి 22:21; 1 పేతురు 3:15) ఖచ్చితంగా ఓటు వేయాలనే నియమంవున్న దేశాల్లోని క్రైస్తవులు ఏమి చేయాలి? ఓటింగ్‌ బూత్‌లోకి వెళ్లనివారిపట్ల ప్రజలు ఆగ్రహించే పరిస్థితి ఉంటే ఏమి చేయాలి? షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ప్రతిమ నిలబెట్టిన దూరా అనే మైదానం వరకూ వెళ్లారని మీకు గుర్తుందా? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుని మనస్సాక్షి ఒప్పుకుంటే ఆ కేంద్రం వరకు వెళ్లాలనుకోవచ్చు. అయితే ఆయన ఈ క్రింది ఆరు సూత్రాల గురించి ఆలోచించాలి:

  1. యేసు శిష్యులు “లోకసంబంధులు కారు.”— యోహాను 15 :19.

  2. క్రైస్తవులు క్రీస్తుకు, ఆయన రాజ్యానికి ప్రతినిధులుగా ఉన్నారు.— యోహాను 18:36; 2 కొరింథీయులు 5:20.

  3. క్రైస్తవ సంఘ విశ్వాసమొక్కటే, సంఘంలో అందరూ క్రీస్తు చూపించినలాంటి ప్రేమతో ఐకమత్యంగా ఉన్నారు.—1 కొరింథీయులు 1:10 ; కొలొస్సయులు 3:14.

  4. ఒక నాయకుణ్ణి ఎన్నుకునేవారు కూడా ఆయనచేసే పనులకు బాధ్యులౌతారు.—1 సమూయేలు 8:5, 10-18; 1 తిమోతి 5:22 వచనాల్లోని సూత్రాలను గమనించండి.

  5. ఇశ్రాయేలీయులు తమకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు, దాన్ని తనను తిరస్కరించడంతో సమానంగా యెహోవా పరిగణించాడు.—1 సమూయేలు 8:7.

  6. ఏ పార్టీకి మద్దతిచ్చే ప్రజలతో మాట్లాడినా క్రైస్తవులు నిర్మలమైన మనస్సాక్షితో దేవుని రాజ్య ప్రభుత్వం గురించి వివరించాలి.— మత్తయి 24:14; 28:19, 20; హెబ్రీయులు 13:18.

పౌర సేవ. కొన్ని దేశాల్లో ఎవరైనా సైన్యంలో చేరడానికి నిరాకరిస్తే, ప్రభుత్వ నియమాలమేరకు వారు కొంతకాలంపాటు ఏదోక విధమైన పౌర సేవ చేయాల్సివుంటుంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు, మనం దాని గురించి ప్రార్థించాలి. వీలైతే పరిణతిగల తోటి క్రైస్తవునితో మాట్లాడి ఆ తర్వాత పూర్తి అవగాహనతో మనస్సాక్షి చెప్పేదాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలి.— సామెతలు 2:1-5 ; 11:14.

“అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు . . . శాంతులునై యుండవలెనని” బైబిలు మనకు చెబుతోంది. (తీతు 3:1, 2) ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ‘ఈ పౌర సేవను అంగీకరిస్తే క్రైస్తవ నమ్మకాల విషయంలో రాజీ పడినట్లు అవుతుందా? లేక అబద్ధమత ఆచారాల్లో పాల్గొన్నట్లు అవుతుందా?’ (మీకా 4:3,5; 2 కొరింథీయులు 6:16,17) ‘ఈ పనివల్ల నా క్రైస్తవ బాధ్యతల్ని నెరవేర్చడం కష్టమౌతుందా, అసలు వాటిని నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడుతుందా?’ (మత్తయి 28 :19,20; ఎఫెసీయులు 6:4; హెబ్రీయులు 10:24, 25) ‘మరోవైపున, ఆ పని వేవలు అనుకూలంగా ఉండడంవల్ల నా క్రైస్తవ కార్యకలాపాల్ని మరెక్కువగా చేయడానికి, బహుశా పూర్తికాల పరిచర్య చేపట్టేందుకు అనువుగా ఉంటుందా?’—హెబ్రీయులు 6:11,12.

జైలుకు వెళ్లే బదులు ఆ పౌర సేవ చేయవచ్చని ఒక క్రైస్తవుడు మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకుంటే, తోటి క్రైస్తవులు ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి. (రోమీయులు 14:10) ఆయన ఒకవేవ అలాంటి సేవ చేయకూడదని అనుకున్నా, ఇతరులు ఆ నిర్ణయాన్ని గౌరవించాలి.—1 కొరింథీయులు 10:29; 2 కొరింథీయులు 1:24.