అనుబంధం
బహిష్కరించబడిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి?
పాపం చేసి పశ్చాత్తాపం చూపించని కారణంగా మన బంధువుగానీ ప్రాణ స్నేహితుడుగానీ సంఘం నుండి బహిష్కరించబడితే మనం ఎంతో బాధపడతాం. అయితే ఈ విషయంలో బైబిలు నిర్దేశానికి మనం స్పందించే తీరునుబట్టి దేవునిపట్ల మనకెంత ప్రేమవుందో, ఆయన ఏర్పాటుకు ఎంత నమ్మకంగా కట్టుబడి ఉంటామో వెల్లడౌతుంది. a ఈ విషయమై తలెత్తే కొన్ని ప్రశ్నల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
బహిష్కరించబడిన వ్యక్తితో మనమెలా ప్రవర్తించాలి? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని, లోభిగాని, విగ్రహారాధకుడుగాని, తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని, దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదు.” (1 కొరింథీయులు 5:11) ‘క్రీస్తుబోధయందు నిలిచియుండని’ వ్యక్తిని “మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును” అని కూడా బైబిలు చెబుతోంది. (2 యోహాను 9-11) బహిష్కరించబడిన వారితో మనం సహవసించం లేదా బైబిలు విషయాలేవీ మాట్లాడం. కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15, 1981 25వ పేజీలో ఇలావుంది: “బహిష్కరించబడిన వ్యక్తికి ఒక్కసారి ‘హలో’ చెప్పామంటే అతనితో మాట్లాడడానికి, తర్వాత స్నేహం చేయడానికి మొదటి అడుగు వేసినట్లే అవుతుంది. మరి మనం ఆ మొదటి అడుగు వేయాలనుకుంటామా?”
బహిష్కరించబడిన వ్యక్తికి పూర్తిగా దూరంగా ఉండాలా? అవును ఉండాలి, దానికి చాలా కారణాలున్నాయి. మొదటిగా, వాళ్లకెంత దూరంగా ఉంటున్నాం అనేదాన్ని బట్టే దేవునికి, ఆయన వాక్యానికి నమ్మకంగా కట్టుబడి ఉంటున్నామనేది తెలుస్తుంది. యెహోవా చెప్పింది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదుగానీ కష్టంగా యెషయా 48:17; 1 యోహాను 5:3) రెండవదిగా, పశ్చాత్తాపం చూపించని అపరాధికి దూరంగా ఉంటే మనపై లేదా సంఘంపై ఆధ్యాత్మికంగా గానీ నైతికంగా గానీ ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. అంతేకాదు సంఘానికి మచ్చరాదు. (1 కొరింథీయులు 5:6, 7) మూడవదిగా, మనం బైబిలు సూత్రాలకు కట్టుబడి ఉండడం వల్ల బహిష్కరించబడిన వ్యక్తి కూడా ప్రయోజనం పొందుతాడు. పెద్దలు సహాయం చేయడానికి ఎంత ప్రయత్నించినా అతను స్పందించకపోయుండవచ్చు. మనం న్యాయనిర్ణయ కమిటీ తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉండడం వల్ల అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మనతో, ఇతర సన్నిహితులతో కలవలేకపోవడంతో తానెంత పెద్ద తప్పు చేశాడో గ్రహించి, ‘బుద్ధితెచ్చుకుని,’ యెహోవా దగ్గరకు తిరిగిరావడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.—లూకా 15:17.
ఉన్నప్పుడు కూడా మనం ఆయనకు లోబడతాం. దేవునిపట్ల ప్రేమ ఉంటే ఆయన న్యాయవంతుడనీ, ప్రేమగలవాడనీ, ఆయన నియమాలు ఎంతో మేలు చేస్తాయని గుర్తించి ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడతాం. (మన బంధువు బహిష్కరించబడితే ఏమిచేయాలి? వాళ్లపట్ల మనకు ఆత్మీయత ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో యెహోవా నియమాలకు లోబడడం కఠిన పరీక్షే అవుతుంది. వారితో మనమెలా ప్రవర్తించాలి? ప్రతీ సందర్భంలో వారితో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చర్చించడం కుదరదు, కానీ మనం ముఖ్యంగా రెండు సందర్భాల గురించి చూద్దాం.
బహిష్కరించబడిన వ్యక్తి, కుటుంబంతో కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఏమి చేయాలో చూద్దాం. అతని బహిష్కరణవల్ల కుటుంబ బంధాలు తెగిపోవు కాబట్టి, రోజువారీ జీవితంలో వారితో మామూలుగానే ఉండవచ్చు. అయితే అతడు తప్పు చేసి కావాలనే విశ్వాసులైన తన కుటుంబంతో ఆధ్యాత్మిక బంధాన్ని తెంచుకున్నాడు. కాబట్టి యెహోవాకు నమ్మకంగా కట్టుబడి ఉండే కుటుంబ సభ్యులు ఆరాధనాపరమైన విషయాల్లో అతణ్ణి తమతో పాటు భాగం వహించనివ్వరు. ఉదాహరణకు, కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు బహిష్కరించబడిన వ్యక్తి వారితోపాటు కూర్చున్నా అందులో భాగం వహించకూడదు. అయితే, బహిష్కరించబడింది ఒక b—సామెతలు 6:20-22; 29:17.
మైనర్ పిల్లవాడైతే, ఆ పిల్లవానికి బోధించే, క్రమశిక్షణ ఇచ్చే బాధ్యత తల్లిదండ్రులకు ఇంకా ఉంటుంది. కాబట్టి ప్రేమగల తల్లిదండ్రులు ఆ పిల్లవానితో బైబిలు అధ్యయనం నిర్వహిస్తారు.కుటుంబంతో కాక, వేరే ఇంట్లో నివసించే బంధువు బహిష్కరించబడితే ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు చూద్దాం. కుటుంబ విషయాల గురించి ఒక్కోసారి అతడితో మాట్లాడాల్సి రావచ్చు. కానీ సాధ్యమైనంతవరకు అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కానీ యెహోవాకు నమ్మకంగా ఉండే క్రైస్తవ కుటుంబ సభ్యులు వేరే ఇంట్లో నివసించే బహిష్కృత వ్యక్తిని పదేపదే కలవడానికి సాకులు వెదకరు. బదులుగా, యెహోవాకు, ఆయన సంస్థకు నమ్మకంగా ఉండాలనుకునేవారు బహిష్కరణకు సంబంధించిన లేఖనాధార ఏర్పాటుకు కట్టుబడివుంటారు. నిజానికి అతడు బాగుపడాలనే ఉద్దేశంతోనే వారలా చేస్తారు. దాంతో అతడు క్రమశిక్షణను అంగీకరించి మారే అవకాశం ఉంది. c—హెబ్రీయులు 12:11.
a ఇక్కడ చర్చించబడిన బైబిలు సూత్రాలు సంఘంతో సహవసించడం మానేసిన వారికి కూడా వర్తిస్తాయి.
b తల్లిదండ్రులతో ఉండే బహిష్కరించబడిన మైనర్ పిల్లలకు సంబంధించిన మరింత సమాచారం కోసం కావలికోట అక్టోబరు 1, 2001, 16-17 పేజీలు, కావలికోట (ఆంగ్లం) నవంబరు 15, 1988, 20వ పేజీ చూడండి.
c కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్ 1988, 26-31 పేజీలు, మన రాజ్య పరిచర్య ఆగస్టు 2002, 3, 4 పేజీలు చూడండి.