అనుబంధం
హస్తప్రయోగం చేసే అలవాటును మానుకోవచ్చు
హస్తప్రయోగం దేవుడు ఇష్టపడని ఒక దురలవాటు, ఇది స్వార్థపూరిత ఆలోచనల్ని రేకెత్తించి, మనసును పాడుచేస్తుంది. a హస్తప్రయోగానికి అలవాటుపడ్డ వ్యక్తి, ఇతరులు కేవలం లైంగిక తృష్ణ తీర్చుకోవడానికే పనికొస్తారని అనుకోవడం మొదలుపెడతాడు. శృంగారం అంటే ప్రేమతో చేసేది కాదుగానీ, కేవలం అప్పటికప్పుడు కోరిక తీర్చుకుని లైంగిక సుఖం పొందడానికి చేసేదని అనుకుంటాడు. ఆ సుఖం తాత్కాలికమే. నిజానికి హస్తప్రయోగం శరీర కోరికల్ని మరింత రెచ్చగొట్టి, ‘జారత్వం, అపవిత్రత, కామాతురత’ వంటివాటికి పాల్పడేలా చేస్తుంది.—కొలొస్సయులు 3:5.
“ప్రియులారా, . . . దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరింథీయులు 7:1) ఈ మాటల ప్రకారం ఆ అలవాటును మానుకోవడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తున్నా కొన్నిసార్లు విఫలం అవుతున్నారా? అయితే, నిరాశ చెందకండి. ఎందుకంటే యెహోవా ఎల్లప్పుడూ ‘క్షమించడానికి,’ సహాయం చేయడానికి ‘సిద్ధంగా’ ఉన్నాడు. (కీర్తన 86:5; లూకా 11:9-13) నిజానికి, ఆ తప్పు విషయంలో మీ మనస్సాక్షి మిమ్మల్ని వేధిస్తుంటే మీది మంచి స్వభావమని తెలుస్తోంది. అంతేకాదు, కొన్నిసార్లు తప్పిపోయినా దాన్ని మానుకోవడానికి మీరు చేస్తున్న కృషినిబట్టి కూడా మీరు మంచివారని తెలుస్తోంది. అలాగే “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు” అని కూడా గుర్తుంచుకోండి. (1 యోహాను 3:19, 20) దేవుడు మన పాపాలను మాత్రమే చూడడు; మన వ్యక్తిత్వాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. అందుకే, కనికరించమని మనంచేసే మనఃపూర్వక పార్థనల్ని ఆయన సానుభూతితో వింటాడు. కాబట్టి, కష్టంలో ఉన్నప్పుడు పిల్లవాడు ఎలాగైతే తన తండ్రి దగ్గరకు వెళ్తాడో, అలాగే మీరు కూడా వినయ స్వభావంతో దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉండండి. అప్పుడు మీరు ఆ అపరాధ భావాల్ని మరచిపోయి నిర్మలమైన మనస్సాక్షిని పొందడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. (కీర్తన 51:1-12, 17; యెషయా 1:18) అయితే, మీరు సహాయం కోసం ప్రార్థించడమే కాదు దాన్ని మానుకోవడానికి తగిన ప్రయత్నాలు చేయాలి. ఒకటి ఏమిటంటే, మీరు అన్నిరకాల అశ్లీలతకు దూరంగా ఉండడంతోపాటు చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి కృషిచేయాలి. b
హస్తప్రయోగం చేసే అలవాటును మీరు మానుకోలేకపోతుంటే, దాని గురించి మీ క్రైస్తవ తల్లిదండ్రులతో లేదా సంఘంలో ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన మంచి స్నేహితునితో మాట్లాడండి.a లైంగిక తృష్ణ తీరేవరకు మర్మాంగాలను చేత్తో స్పర్శించడం లేదా రుద్దుకోవడమే హస్తప్రయోగం.
b కంప్యూటర్‌ను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో చాలా కుటుంబాలు దానిని అందరికీ కనబడే స్థలంలో పెట్టుకుంటారు. అంతేగాక, కొందరు అలాంటి చెడు సమాచారం కంప్యూటర్‌లోకి రాకుండా ఫిల్టర్‌చేసే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు కొనుక్కున్నారు. అలాగని ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని కూడా పూర్తిగా నమ్మలేం.
c హస్తప్రయోగాన్ని మానుకోవడానికి సహాయం చేసే సలహాల కోసం తేజరిల్లు! (ఆంగ్లం) నవంబరు 2006 సంచికలో “యువత ఇలా అడుగుతోంది . . . ఈ అలవాటును నేనెలా మానుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ను, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), 1వ సంపుటిలో 178-182 పేజీలు చూడండి.