కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిపాలక సభ నుండి ఉత్తరం

పరిపాలక సభ నుండి ఉత్తరం

యెహోవా దేవుణ్ణి, ఆయన వాక్యమైన బైబిల్ని ప్రేమించేవాళ్లకు:

“మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది” అని యేసు అన్నాడు. (యోహాను 8:32) బైబిల్లోని సత్యాన్ని మొదటిసారి తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపించిందో ఒకసారి ఆలోచించండి! అబద్ధాలతో నిండిన ఈ లోకంలో సత్యాన్ని తెలుసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం.—2 తిమోతి 3:1.

మనం సత్యం తెలుసుకోవాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రజల్ని ప్రేమిస్తాం కాబట్టి వాళ్లకు సత్యాన్ని చెప్పాలనుకుంటాం. కానీ దేవుణ్ణి సేవించాలంటే అలా చెప్పడం మాత్రమే సరిపోదు. యెహోవా సూత్రాల మీద ప్రగాఢమైన గౌరవంతో క్రైస్తవులుగా జీవించడానికి అన్నివిధాలా కృషిచేయాలి. దేవుని మీద మనకున్న ప్రేమను నిరూపించుకునే ఒక ముఖ్యమైన విధానాన్ని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు.”—యోహాను 15:10.

యేసు తన తండ్రిని నిజంగా ప్రేమించాడు, తండ్రి చెప్పిన ప్రతీది చేశాడు. మనం కూడా యేసులా జీవిస్తే యెహోవా మనల్ని ప్రేమిస్తాడు, మనం నిజంగా సంతోషంగా ఉంటాం. యేసు చెప్పినట్టు, ‘మనకు ఈ విషయాలు తెలుసు కాబట్టి, వీటిని చేస్తే మనం సంతోషంగా ఉంటాం.’—యోహాను 13:17.

బైబిలు సత్యం ప్రకారం ఎలా జీవించాలో, దేవునికి ఎలా స్నేహితులు అవ్వాలో తెలుసుకోవడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. మీరు దేవుని మీద ప్రేమను పెంచుకుంటూ, “దేవుని ప్రేమలో నిలిచివుంటూ,” ఆయన ఇచ్చే శాశ్వత జీవితం పొందాలని మేం ప్రార్థిస్తున్నాం.—యూదా 21, అధస్సూచి.

యెహోవాసాక్షుల పరిపాలక సభ