కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎడమ: 1926లో, బ్రూక్లిన్‌ బెతెల్‌ సభ్యులు చివరిసారిగా క్రిస్మస్‌ జరుపుకున్నారు; కుడి: యెహోవాసాక్షులు వేరుగా ఉంటారని ప్రజలు ఇట్టే గుర్తుపడతారు

3వ భాగం

రాజ్య ప్రమాణాలు—దేవుని నీతిని వెదకడం

రాజ్య ప్రమాణాలు—దేవుని నీతిని వెదకడం

మీరు బయటికి వెళ్తూ మీ పక్కింటాయన్ని చూసి పలకరిస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వారు. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని తదేకంగా గమనిస్తున్నాడు. తర్వాత, ఆయన కూడా మిమ్మల్ని పలకరించి దగ్గరికి పిలిచాడు. “నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?” అని అన్నాడు. “దేని గురించి?” అని మీరు అన్నారు. అప్పుడు ఆయన, “మీరు యెహోవాసాక్షులు కదా? మీరు అందరికన్నా ప్రత్యేకంగా ఉంటారు. మీకూ వేరే మతాలకు చాలా తేడా ఉంటుంది. మీరు పండుగలు చేసుకోరు, రాజకీయాల్లో, యుద్ధాల్లో పాల్గొనరు, సిగరెట్‌ తాగరు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి నైతిక విలువలు ఉంటాయి. అసలు, మీరు చాలా విషయాల్లో వేరుగా ఉండడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

ఆ ప్రశ్నకు జవాబు మనందరికీ తెలుసు: మనం దేవుని రాజ్య పరిపాలన కింద జీవిస్తున్నాం. మన రాజైన యేసుక్రీస్తు ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. అంతేకాదు, మనం తన అడుగుజాడల్లో నడిచి, ఈ చెడ్డ లోకానికి వేరుగా ఉండేలా ఆయన సహాయం చేస్తున్నాడు. మెస్సీయ రాజు, దేవుని ప్రజల్ని ఆధ్యాత్మిక, నైతిక విషయాల్లో, అలాగే సంస్థకు సంబంధించిన విషయాల్లో ఎలా శుద్ధీకరిస్తూ వచ్చాడో ఈ భాగంలో పరిశీలిస్తాం. అలా శుద్ధీకరించడం యెహోవాకు మహిమ తెస్తుంది.

ఈ భాగంలో

10వ అధ్యాయం

రాజు తన ప్రజల్ని ఆధ్యాత్మికంగా శుద్ధీకరించాడు

క్రిస్మస్‌, సిలువ ఏ మూలం నుండి వచ్చాయి?

11వ అధ్యాయం

రాజు తన ప్రజల్ని నైతికంగా శుద్ధీకరించాడు—దేవుని పవిత్ర ప్రమాణాలను పాటించడం

యెహెజ్కేలు దర్శనంలో చూసిన ఆలయంలోని కావలి గదులు, ప్రవేశ ద్వారాలు 1914 నుండి ప్రత్యేక అర్థాన్ని సంతరించుకున్నాయి.

12వ అధ్యాయం

“శాంతికి మూలమైన దేవుడు” తన ప్రజల్ని సంస్థీకరించాడు

బైబిలు శాంతిని, అన్నీ పద్ధతి ప్రకారం చేయడంతో ముడిపెడుతోంది. ఎందుకు? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం నేటి క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యం?