6వ భాగం
రాజ్యం ఇస్తున్న మద్దతు—ఆరాధనా స్థలాలను నిర్మించడం, సహాయక చర్యలు చేపట్టడం
మీరు మీ రాజ్యమందిరంలోకి వెళ్లారు. దాంట్లో అడుగుపెట్టిన ప్రతీసారి మీకు గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే, కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని నిర్మిస్తున్నప్పుడు మీరు ఆ నిర్మాణ పనిలో సంతోషంగా భాగం వహించారు. అయితే తుఫాను, వరదలు మీ ప్రాంతాన్ని ముంచెత్తడంతో ఇప్పుడు మీ రాజ్యమందిరాన్ని తాత్కాలిక విపత్తు సహాయక కేంద్రంగా మార్చారు. బ్రాంచి కమిటీ అక్కడున్న సహోదరసహోదరీలకు కావాల్సిన ఆహారం, బట్టలు, నీళ్లు, ఇతర వస్తువులు వెంటనే పంపించే ఏర్పాట్లు చేసింది. అలా పంపించిన వస్తువులన్నిటినీ రాజ్యమందిరంలో చక్కగా అమర్చారు. సహోదరసహోదరీలు వరుసలో నిలబడి, వాళ్లకు కావాల్సిన వాటిని తీసుకుంటున్నారు. కొంతమందైతే ఆనందబాష్పాలతో వాటిని తీసుకుంటున్నారు.
తన ప్రజల గుర్తింపు చిహ్నం ప్రేమే అని యేసు చెప్పాడు. (యోహా. 13:34, 35) ఆరాధనా స్థలాలను నిర్మించడం ద్వారా, సహాయక చర్యలు చేపట్టడం ద్వారా యెహోవాసాక్షులు తమ క్రైస్తవ ప్రేమను ఎలా చూపించారో ఈ భాగంలో పరిశీలిస్తాం. దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందనడానికి ఈ ప్రేమే ఒక గొప్ప రుజువు.
ఈ భాగంలో
18వ అధ్యాయం
రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?
రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది? దాన్ని ఎలా ఉపయోగిస్తారు?
19వ అధ్యాయం
యెహోవాకు ఘనత తెచ్చే నిర్మాణ పని
ఆరాధనా స్థలాలు దేవునికి ఘనత తెస్తాయి. అయితే ఆయన విలువైనవిగా ఎంచేవి వేరే ఉన్నాయి.
20వ అధ్యాయం
సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
సహాయక చర్యలు చేపట్టడం యెహోవాకు చేసే పవిత్రసేవలో భాగమని ఎందుకు చెప్పవచ్చు?