కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్య వాగ్దానాలు నెరవేరే కాలం కోసం మీరు ఎదురుచూస్తున్నారా?

7వ భాగం

రాజ్య వాగ్దానాలు—అన్నిటిని కొత్తవిగా చేయడం

రాజ్య వాగ్దానాలు—అన్నిటిని కొత్తవిగా చేయడం

మీరు ఒక చెట్టు కొమ్మ నుండి నిగనిగలాడుతున్న ఆపిల్‌ పండును కోశారు. దాన్ని పండ్ల బుట్టలో వేసుకునే ముందు దాని సువాసనను ఆస్వాదించారు. మీరు చాలాసేపటి నుండి ఆపిల్‌ పండ్లు కోస్తున్నారు. అయినా, మీకు అలసట రావట్లేదు. ఇంకొన్ని గంటలపాటు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారు. దగ్గర్లోనే, ఇంకో చెట్టు దగ్గర మీ అమ్మ కూడా ఆపిల్‌ పండ్లు కోస్తూ ఉంది. ఆమె కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూ ఆ పని చేస్తుంది. మీ చిన్నతనంలో ఆమె ఎంత యౌవనంగా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంది. కానీ గతించిన లోకంలో, ఆమె వృద్ధాప్యంలోకి రావడం, ఆరోగ్యం క్షీణించడం మీరు చూశారు. ఆమె తన చివరిశ్వాస విడుస్తున్నప్పుడు, మీరు పక్కనే ఆమె చెయ్యి పట్టుకుని ఉన్నారు. తర్వాత సమాధి దగ్గరికి వెళ్లి కుమిలికుమిలి ఏడ్చారు. కానీ ఇప్పుడు ఆమె సజీవంగా మంచి ఆరోగ్యంతో ఉంది! ఆమెలాగే ఇంకా చాలామంది పునరుత్థానమై మంచి ఆరోగ్యంతో ఉన్నారు!

అలాంటి రోజులు వస్తాయని మనకు తెలుసు. ఎందుకంటే, దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరతాయి. హార్‌మెగిద్దోన్‌కు ముందు నెరవేరే కొన్ని రాజ్య వాగ్దానాల గురించి, అలాగే హార్‌మెగిద్దోన్‌ తర్వాత జరిగే కొన్ని ఉత్కంఠభరితమైన సంఘటనల గురించి ఈ భాగంలో పరిశీలిస్తాం. దేవుని రాజ్యం ఈ భూమంతటినీ పరిపాలిస్తూ, అన్నిటిని కొత్తవిగా చేస్తున్నప్పుడు మనం ఎంత పులకరించిపోతామో కదా!

ఈ భాగంలో

21వ అధ్యాయం

దేవుని రాజ్యం శత్రువులను నాశనం చేయడం

హార్‌మెగిద్దోన్‌ యుద్ధం కోసం మీరు ఇప్పుడే సిద్ధపడవచ్చు.

22వ అధ్యాయం

రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది

యెహోవా వాగ్దానాలు తప్పక నెరవేరతాయని మీరు ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?