కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

21

దేవుని రాజ్యం శత్రువులను నాశనం చేయడం

దేవుని రాజ్యం శత్రువులను నాశనం చేయడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

హార్‌మెగిద్దోన్‌ యుద్ధం ముందు జరిగే సంఘటనలు

1, 2. (ఎ) మన రాజు 1914 నుండి శత్రువుల మధ్య పరిపాలిస్తున్నాడని ఏవి రుజువు చేస్తున్నాయి? (బి) ఈ అధ్యాయంలో మనం ఏమి పరిశీలిస్తాం?

 దేవుని రాజ్యం శత్రువుల మధ్య పరిపాలిస్తూ ఏమేమి సాధించిందో ఇప్పటివరకు పరిశీలించాం. (కీర్త. 110:2) రాజైన యేసు, ఇష్టపూర్వకంగా ప్రకటనా పని చేసే ఒక సైన్యాన్ని ఏర్పర్చుకున్నాడు. అంతేకాదు వాళ్లను ఆధ్యాత్మికంగా, నైతికంగా శుద్ధీకరించాడు. శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని ప్రజల ఐక్యత చెక్కుచెదరలేదు. ఈ విషయాలు, అలాగే దేవుని రాజ్యం సాధించిన ఇతర విషయాలు, మన రాజు 1914 నుండి శత్రువుల మధ్య పరిపాలిస్తున్నాడని తిరుగులేని విధంగా రుజువు చేస్తున్నాయి.

2 త్వరలోనే రాజ్యం మరిన్ని ఆశ్చర్యకరమైన పనులు చేయబోతుంది. రాజ్యం వచ్చినప్పుడు, అది శత్రువులను ‘పగులగొట్టి నిర్మూలం చేస్తుంది.’ (మత్త. 6:10; దాని. 2:44) అయితే, దానికి ముందు కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఏమిటా సంఘటనలు? వాటికి సంబంధించిన కొన్ని బైబిలు ప్రవచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

“హఠాత్తుగా” వచ్చే నాశనానికి ముందు జరిగే సంఘటనలు

3. భవిష్యత్తులో జరగనున్న మొదటి సంఘటన ఏమిటి?

3 అందరూ ప్రశాంతంగా ఉన్నారనే ప్రకటన. భవిష్యత్తులో జరగనున్న మొదటి సంఘటన గురించి అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకయులకు రాసిన ఉత్తరంలో తెలియజేశాడు. (1 థెస్సలొనీకయులు 5:2, 3 చదవండి.) ఆ ఉత్తరంలో, పౌలు “యెహోవా రోజు” గురించి ప్రస్తావించాడు. అది “మహాబబులోను” మీద జరిగే దాడితో మొదలౌతుంది. (ప్రక. 17:5) అయితే యెహోవా రోజు మొదలవ్వడానికి కాస్త ముందు, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని దేశాలు చెప్తాయి. అది బహుశా ఒకసారి లేదా అంతకన్నా ఎక్కువసార్లు వెలువడే ప్రకటన అయ్యుండవచ్చు. అందులో మత నాయకుల పాత్ర కూడా ఉంటుందా? బహుశా ఉండవచ్చు. వాళ్లు ఈ లోకంలో భాగం కాబట్టి, దేశాలతోపాటు వాళ్లు కూడా “సమాధానము సమాధానము” అని చెప్తారు. (యిర్మీ. 6:14; 23:16, 17; ప్రక. 17:1, 2) వాళ్లు అలా ప్రకటించడం, యెహోవా రోజు మొదలవ్వబోతుందనడానికి బండ గుర్తు. ఒక్కసారి యెహోవా రోజు మొదలైందంటే, శత్రువులు “అస్సలు తప్పించుకోలేరు.”

4. పౌలు చెప్పిన ప్రవచనాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

4 ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం? పౌలు ఇలా చెప్తున్నాడు: “పగటి వెలుగులో దొంగలు పట్టుబడినట్టు, ఆ రోజున మీరు పట్టుబడడానికి మీరు చీకట్లో లేరు.” (1 థెస్స. 5:3, 4) లోకంలోని ప్రజలకు భిన్నంగా, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు దేనికి దారితీస్తాయో మనం గ్రహించగలుగుతున్నాం. ఇంతకీ, అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు అనే ప్రకటన గురించిన ప్రవచనం ఎలా నెరవేరుతుంది? లోక పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో మనం వేచి చూడాల్సిందే. అయితే ఈలోపు, మనం ‘మెలకువగా ఉంటూ మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం.’—1 థెస్స. 5:6; జెఫ. 3:8.

మహాశ్రమ మొదలవ్వడం

5. ‘మహాశ్రమలోని’ మొదటి ఘట్టం ఎలా మొదలౌతుంది?

5 మతంపై జరిగే దాడి. పౌలు మాటల్ని మళ్లీ ఒకసారి గుర్తుతెచ్చుకోండి. “‘అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!’ అని ప్రజలు ఎప్పుడైతే అంటూ ఉంటారో అప్పుడే, . . . హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది.” ఆకాశంలో మెరుపు మెరిసిన వెంటనే పెళపెళమని ఉరుము శబ్దం వినిపించినట్లే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన వెలువడిన వెంటనే ‘హఠాత్తుగా నాశనం వస్తుంది.’ ఇంతకీ నాశనం అయ్యేది ఏమిటి? మొదటిగా, ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన “మహాబబులోను” నాశనమౌతుంది. దానికి “వేశ్య” అనే పేరు కూడా ఉంది. (ప్రక. 17:5, 6, 15) క్రైస్తవ మత సామ్రాజ్యంతో సహా అన్ని అబద్ధ మత సంస్థలు నాశనమవ్వడంతో, ‘మహాశ్రమలోని’ మొదటి ఘట్టం ప్రారంభమౌతుంది. (మత్త. 24:21; 2 థెస్స. 2:8) అది చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకు? ఎందుకంటే, అప్పటివరకు ఆ వేశ్య తనను తాను “రాణి” అని ఊహించుకుంటూ, “దుఃఖపడాల్సిన పరిస్థితి” తనకు ఎప్పటికీ రాదని అనుకుంటుంది. కానీ ఆమె అంచనాలన్నీ తారుమారు అవుతాయి. ఆమె “ఒక్క రోజులోనే,” అంటే చాలా త్వరగా నిర్మూలించబడుతుంది.—ప్రక. 18:7, 8.

6. ‘మహాబబులోనును’ ఎవరు నాశనం చేస్తారు?

6 ఇంతకీ ఆ వేశ్యను ఎవరు నాశనం చేస్తారు? “పది కొమ్ములు” గల “క్రూరమృగం” నాశనం చేస్తుంది. ప్రకటన పుస్తకం చెప్తున్నట్లుగా, ఆ క్రూరమృగం ఐక్య రాజ్య సమితిని సూచిస్తుంది. ఆ పది కొమ్ములు, ‘ఎర్రని క్రూరమృగానికి’ మద్దతిస్తున్న ప్రస్తుత రాజకీయ శక్తులన్నిటినీ సూచిస్తున్నాయి. (ప్రక. 17:3, 5, 11, 12) ఆ దాడి ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఐక్య రాజ్య సమితిలోని దేశాలు ఆ వేశ్యను, ఆమె సంపదను కొల్లగొట్టి “అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి.”—ప్రకటన 17:16 చదవండి. a

7. మత్తయి 24:21, 22 లో ఉన్న యేసు మాటలు సా.శ. మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరాయి? భవిష్యత్తులో ఎలా నెరవేరతాయి?

7 రోజుల్ని తగ్గించడం. మహాశ్రమలోని ఈ ఘట్టంలో ఏమి జరుగుతుందో మన రాజు వెల్లడి చేశాడు. “ఎంచుకోబడిన వాళ్ల కోసం ఆ రోజులు తగ్గించబడతాయి” అని ఆయన చెప్పాడు. (మత్తయి 24:21, 22 చదవండి.) ఆ మాటలు సా.శ. 66లో కొంతవరకు నెరవేరాయి. రోమా సైన్యం యెరూషలేముపై దాడి చేస్తున్నప్పుడు, యెహోవా ఆ దాడిని ‘తగ్గించాడు.’ (మార్కు 13:20) దాంతో యెరూషలేములో, యూదయలో ఉన్న క్రైస్తవులు తప్పించుకోగలిగారు. మరి రానున్న మహాశ్రమ సంగతేమిటి? భవిష్యత్తులో ఐక్య రాజ్య సమితి మతంపై దాడి చేసినప్పుడు, యెహోవా మన రాజైన యేసుక్రీస్తు ద్వారా ఆ దాడిని ‘తగ్గించి,’ అబద్ధ మతంతోపాటు సత్య మతం నాశనం అవ్వకుండా కాపాడతాడు. అలా, సత్య మతం ఒక్కటే నిలుస్తుంది. (కీర్త. 96:5) ఆ తర్వాత ఏ సంఘటనలు జరుగుతాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

హార్‌మెగిద్దోన్‌కు దారితీసే సంఘటనలు

8, 9. యేసు ఏ సూచనల గురించి చెప్తుండవచ్చు? వాటిని చూసి ప్రజలు ఎలా స్పందిస్తారు?

8 చివరి రోజుల గురించి యేసు చెప్పిన ప్రవచనాన్ని గమనిస్తే, హార్‌మెగిద్దోన్‌కు ముందు ఏ సంఘటనలు జరుగుతాయో తెలుస్తుంది. వాటికి సంబంధించిన రెండు సంఘటనలు మత్తయి, మార్కు, లూకా పుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం.—మత్తయి 24:29-31 చదవండి; మార్కు 13:23-27; లూకా 21:25-28.

9 ఆకాశంలో కనిపించే సూచనలు. యేసు ఇలా చెప్పాడు: “సూర్యుడు చీకటిమయమౌతాడు, చంద్రుడు తన వెలుగు ఇవ్వడు, నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి.” అంటే, ప్రజలు వెలుగు కోసం ఇక మత నాయకుల వైపు చూడరని దానర్థం. అయితే, యేసు అక్షరార్థంగా ఆకాశంలో కనిపించే సూచనల గురించి కూడా చెప్తుండవచ్చు. (యెష. 13:9-11; యోవే. 2:1, 30, 31) మరి వాటిని చూసి ప్రజలు ఎలా స్పందిస్తారు? వాళ్లు “ఎలా తప్పించుకోవాలో” తెలీక “తీవ్రమైన వేదన” అనుభవిస్తారు. (లూకా 21:25; జెఫ. 1:17) అవును, దేవుని రాజ్య శత్రువులు ‘రాజులైనా, దాసులైనా’ “భయం వల్ల, లోకం మీదికి రాబోతున్నవాటి గురించి ఎదురుచూడడం వల్ల సొమ్మసిల్లుతారు.” అంతేకాదు, వాళ్లు సురక్షితమైన స్థలం కోసం పరిగెడతారు. కానీ అది వాళ్లకు దొరకదు. దాంతో వాళ్లు రాజు ఉగ్రతకు గురౌతారు.—లూకా 21:26; 23:30; ప్రక. 6:15-17.

10. రాజ్యానికి మద్దతిచ్చిన వాళ్లకు, రాజ్యాన్ని వ్యతిరేకించిన వాళ్లకు యేసు ఏ తీర్పు తీరుస్తాడు? దానికి వాళ్లు ఎలా స్పందిస్తారు?

10 తీర్పు తీర్చడం. దేవుని రాజ్య శత్రువులందరూ, తమ వేదనను అధికం చేసే మరో సంఘటనను చూడాల్సి వస్తుంది. దాని గురించి యేసు ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు గొప్ప శక్తితో, మహిమతో మేఘాల్లో రావడం వాళ్లు చూస్తారు.” (మార్కు 13:26) అలా యేసు గొప్ప శక్తితో మేఘాల్లో రావడం, ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడని చూపిస్తుంది. తీర్పు తీర్చడం గురించిన మరిన్ని వివరాలను, యేసు గొర్రెలు మేకల ఉదాహరణలో తెలియజేశాడు. (మత్తయి 25:31-33, 46 చదవండి.) దేవుని రాజ్యానికి నమ్మకంగా మద్దతిచ్చినవాళ్లు ‘గొర్రెలుగా’ తీర్పు తీర్చబడతారు. “విడుదల దగ్గరపడుతోంది” అని గ్రహించి, వాళ్లు ‘తలలు ఎత్తుకుంటారు.’ (లూకా 21:28) అయితే, రాజ్య వ్యతిరేకులు మేకలుగా తీర్పు తీర్చబడతారు. వాళ్లు ‘శాశ్వతంగా నాశనమౌతామని’ తెలిసి “దుఃఖంతో గుండెలు బాదుకుంటారు.”—మత్త. 24:30; ప్రక. 1:7.

11. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి పరిశీలిస్తున్నప్పుడు, మనం ఏ విషయం గుర్తుంచుకోవాలి?

11 యేసు ‘అన్నిదేశాలకు’ తీర్పు తీర్చిన తర్వాత, హార్‌మెగిద్దోన్‌ మొదలవ్వడానికి ముందు, కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. (మత్త. 25:32) వాటిలో రెండిటిని ఇప్పుడు చూద్దాం. ఒకటి, గోగు చేసే దాడి; మరొకటి, అభిషిక్తులను సమకూర్చడం. ఆ సంఘటనల గురించి పరిశీలిస్తున్నప్పుడు, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే, ఆ సంఘటనలు ఖచ్చితంగా ఏ సమయంలో జరుగుతాయో దేవుని వాక్యం చెప్పడంలేదు. నిజానికి, అవి ఒకే సమయంలో జరగవచ్చు, లేదా ఒకదాని తర్వాత ఒకటి జరగవచ్చు.

12. దేవుని ప్రజల మీద సాతాను చివరిసారిగా ఎలా దాడిచేస్తాడు?

12 చివరి దాడి. మాగోగు వాడైన గోగు భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులపై, అలాగే వాళ్లకు మద్దతిస్తున్న వేరే గొర్రెలపై దాడి చేసేలా సాతాను ఉసిగొల్పుతాడు. (యెహెజ్కేలు 38:2, 11 చదవండి.) సాతాను చేసే చివరి పోరాటం అదే. పరలోకంలో రాజ్యం స్థాపించబడి తాను భూమ్మీదికి పడద్రోయబడినప్పటి నుండి సాతాను అభిషిక్తులతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. (ప్రక. 12:7-9, 17) మరిముఖ్యంగా, శుద్ధీకరించబడిన క్రైస్తవ సంఘంలోకి అభిషిక్తులు సమకూర్చబడుతున్నప్పటి నుండి, అతను వాళ్ల ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డుపడుతూనే ఉన్నాడు. (మత్త. 13:30) అయితే, అబద్ధ మత సంస్థలన్నీ నాశనమైన తర్వాత, దేవుని ప్రజలు ‘ప్రాకారాలు అడ్డగడియలు గవునులు లేని’ దేశంలా నిస్సహాయంగా ఉన్నట్లు కనిపిస్తారు. వాళ్ల మీద దాడి చేయడానికి ఇదే సరైన సమయమని సాతాను భావిస్తాడు. దాంతో మానవ ప్రభుత్వాలను ఉసిగొల్పి, దేవుని ప్రజల్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు.

13. యెహోవా తన ప్రజల పక్షాన ఎలా చర్య తీసుకుంటాడు?

13 అప్పుడు ఏమి జరుగుతుందో యెహెజ్కేలు వివరిస్తున్నాడు. గోగు గురించి ఆయన ఇలా ప్రవచించాడు: “ఉత్తరదిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనముల నేకములును గుఱ్ఱములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు.” (యెహె. 38:15, 16) ఆ దాడిని ఎవ్వరూ ఆపలేరని అనుకుంటున్న సమయంలో, యెహోవా చర్య తీసుకుంటాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “నా కోపము బహుగా రగులుకొనును,” “అతనిమీదికి ఖడ్గము రప్పించెదను.” (యెహె. 38:18, 21; జెకర్యా 2:8 చదవండి.) యెహోవా భూమ్మీదున్న తన సేవకుల పక్షాన చర్య తీసుకుంటాడు. ఆ చర్యే హార్‌మెగిద్దోన్‌ యుద్ధం!

14, 15. సాతాను చివరి దాడిని మొదలుపెట్టిన తర్వాత, ఏదోక సమయంలో ఏ సంఘటన జరుగుతుంది?

14 హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడతాడో పరిశీలించే ముందు, మనం ఒక్కక్షణం ఆగి, మరో ముఖ్యమైన సంఘటన గురించి పరిశీలిద్దాం. ఆ సంఘటన ఏంటంటే, 11వ పేరాలో చూసినట్లుగా భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులను సమకూర్చడం. సాతాను చేసే చివరి దాడి మొదలైన తర్వాత, హార్‌మెగిద్దోన్‌ యుద్ధం మొదలవ్వడానికి ముందు, ఏదోక సమయంలో ఆ సంఘటన చోటు చేసుకుంటుంది.

15 అభిషిక్తులను సమకూర్చడం. హార్‌మెగిద్దోన్‌కు ముందు జరిగే సంఘటనల్లో, “ఎంచుకున్నవాళ్లను” అంటే అభిషిక్తులను సమకూర్చడం కూడా ఉంటుందని మత్తయి, మార్కు రాశారు. (7వ పేరా చూడండి.) తనను తాను రాజుగా పోల్చుకుంటూ యేసు ఇలా ప్రవచించాడు: “తర్వాత, ఆయన దూతల్ని పంపి ఇటు భూమ్మీద, అటు ఆకాశంలో నలుదిక్కుల నుండి దేవుడు ఎంపిక చేసుకున్నవాళ్లను సమకూరుస్తాడు.” (మార్కు 13:27; మత్త. 24:31) ఏ సమకూర్చడం గురించి యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు? భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు చివరి ముద్రను పొందడం గురించి ఆయన మాట్లాడట్లేదు. ఎందుకంటే, మహాశ్రమ మొదలవ్వక ముందే వాళ్లు చివరి ముద్రను పొందుతారు. (ప్రక. 7:1-3) బదులుగా, రానున్న మహాశ్రమ కాలంలో జరిగే సంఘటన గురించి యేసు మాట్లాడుతున్నాడు. కాబట్టి, సాతాను చివరి దాడిని మొదలుపెట్టిన తర్వాత, ఏదోక సమయంలో భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు పరలోకానికి సమకూర్చబడతారని స్పష్టమౌతుంది.

16. పునరుత్థానమైన అభిషిక్తులు హార్‌మెగిద్దోన్‌లో ఎలా భాగం వహిస్తారు?

16 అభిషిక్తులు సమకూర్చబడడానికి, దాని తర్వాత జరిగే హార్‌మెగిద్దోన్‌ యుద్ధానికి సంబంధం ఏమిటి? హార్‌మెగిద్దోన్‌ యుద్ధం మొదలయ్యే సమయానికల్లా, అభిషిక్తులందరూ పరలోకానికి సమకూర్చబడతారు. క్రీస్తుతోపాటు ఆ 1,44,000 మంది అభిషిక్తులు, శత్రువులందర్నీ “ఇనుప దండంతో” శిక్షించే అధికారం పొందుతారు. (ప్రక. 2:26, 27) అప్పుడు, దేవుని ప్రజల్ని మింగడానికి సిద్ధంగా ఉన్న “బహు విస్తారమైన” శత్రు సైన్యంతో తలపడడానికి క్రీస్తు ఒక యోధునిలా, రాజులా బయల్దేరతాడు. పునరుత్థానమైన అభిషిక్తులు, అలాగే శక్తివంతమైన దూతలు ఆయన్ని వెంబడిస్తారు. (యెహె. 38:15) యేసు ఆ పోరాటాన్ని మొదలుపెట్టడంతో, హార్‌మెగిద్దోన్‌ యుద్ధం ఆరంభమౌతుంది!—ప్రక. 16:16.

మహాశ్రమలోని చివరి ఘట్టం

హార్‌మెగిద్దోన్‌ యుద్ధం మొదలవ్వడం!

17. హార్‌మెగిద్దోన్‌లో ‘మేకలకు’ ఏమి జరుగుతుంది?

17 తీర్పును అమలు చేయడం. హార్‌మెగిద్దోన్‌ యుద్ధమే మహాశ్రమలోని చివరి ఘట్టం. ఆ సమయంలో యేసు మరో పని కూడా చేస్తాడు. అదేంటంటే, అంతకుముందు ఆయన ఎవర్నైతే ‘మేకలుగా’ తీర్పు తీర్చాడో వాళ్లందరిపై తీర్పును అమలుచేస్తాడు. (మత్త. 25:32, 33) ఆయన ‘పదునైన, పొడవాటి ఖడ్గంతో దేశాల్ని నాశనం చేస్తాడు.’ అవును, “రాజుల” నుండి “దాసుల” వరకు మేకల్లాంటి ప్రజలందరూ “శాశ్వతంగా నాశనమౌతారు.”—ప్రక. 19:15, 18; మత్త. 25:46.

18. (ఎ) ‘గొర్రెలుగా’ తీర్పు తీర్చబడిన వాళ్ల పరిస్థితి ఏమిటి? (బి) యేసు తన విజయ పరంపరను ఎలా ముగిస్తాడు?

18 మరి ‘గొర్రెలుగా’ తీర్పు తీర్చబడిన వాళ్ల పరిస్థితి ఏమిటి? నిస్సహాయంగా కనిపిస్తున్న “గొర్రెలు,” సాతాను చెప్పుచేతల్లో ఉన్న ‘మేకల’ విస్తారమైన సైన్యం కింద నలిగిపోకుండా, “మహాశ్రమను దాటి” సురక్షితంగా బయటికి వస్తారు. అలా ఒక గొప్పసమూహం తప్పించుకుంటుంది. (ప్రక. 7:9, 14) యేసు, దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించే మనుషులందర్నీ జయించి వాళ్లను నాశనం చేసిన తర్వాత, సాతానును, అతని చెడ్డ దూతల్ని అగాధంలో, అంటే మరణం లాంటి నిష్క్రియా స్థితిలో వెయ్యి సంవత్సరాలు బంధిస్తాడు.—ప్రకటన 6:2; 20:1-3 చదవండి.

మనం ఎలా సిద్ధపడవచ్చు?

19, 20. యెషయా 26:21, 30:21లో ఉన్న సలహాను మనం ఎలా పాటించవచ్చు?

19 భవిష్యత్తులో జరిగే భయంకరమైన సంఘటనలకు మనం ఎలా సిద్ధపడవచ్చు? కొన్ని సంవత్సరాల క్రితం కావలికోట పత్రిక ఇలా తెలియజేసింది: “రక్షణ విధేయతపై ఆధారపడివుంటుంది.” అలాగని ఎందుకు చెప్పవచ్చు? ప్రాచీన బబులోనులో చెరగా ఉన్న యూదులకు యెహోవా ఒక హెచ్చరిక ఇచ్చాడు. బబులోను నాశనమౌతుందని తెలియజేస్తూ, దానికోసం సిద్ధంగా ఉండడానికి ఏమి చేయాలో యెహోవా ఇలా చెప్పాడు: “నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.” (యెష. 26:21) ఆ లేఖనంలో “వెళ్లి,” “ప్రవేశించుము,” “తలుపులు వేసికొనుము,” “దాగియుండుము” అనే పదాలను గమనిస్తే, అవన్నీ ఆజ్ఞ ఇస్తున్నట్లుగానే ఉన్నాయి. ఆ ఆజ్ఞల్ని పాటించి తమ ఇళ్లలోనే దాగివున్న యూదులు, వీధుల్లో తిరుగుతున్న సైనికుల చేతికి చిక్కకుండా తప్పించుకున్నారు. కాబట్టి వాళ్ల రక్షణ, యెహోవా నిర్దేశాల పట్ల చూపించే విధేయతపై ఆధారపడివుందని చెప్పవచ్చు. b

20 మనం దాని నుండి ఏమి నేర్చుకోవచ్చు? ఆ ప్రాచీనకాల దేవుని సేవకుల్లా, మన రక్షణ కూడా యెహోవా నిర్దేశాల పట్ల మనం చూపించే విధేయత మీదే ఆధారపడివుంటుంది. (యెష. 30:21) నేడు యెహోవా ఆ నిర్దేశాలను సంఘం ద్వారా ఇస్తున్నాడు. మనం వాటికి హృదయపూర్వకంగా లోబడడం అలవాటు చేసుకోవాలి. (1 యోహా. 5:3) ఎందుకంటే ఆ నిర్దేశాలకు ఇప్పుడు లోబడితేనే, భవిష్యత్తులో కూడా ఇష్టపూర్వకంగా లోబడతాం; అలాగే మన తండ్రైన యెహోవా, మన రాజైన యేసు ఇచ్చే కాపుదలను చవిచూస్తాం. (జెఫ. 2:3) అంతేకాదు, దేవుని రాజ్యం శత్రువులందర్నీ పూర్తిగా నాశనం చేయడాన్ని కళ్లారా చూస్తాం. అది ఎంత ఉత్కంఠభరితమైన సంఘటనో కదా!

a “మహాబబులోను” నాశనమవ్వడం అంటే, ముఖ్యంగా అబద్ధ మత సంస్థలు నాశనమవ్వడమే కానీ, ఆ మతాలకు చెందిన వ్యక్తులందరూ పూర్తిగా నాశనమవ్వడం కాదు. జెకర్యా 13:4-6 సూచిస్తున్నట్లుగా, మహాబబులోనుకు చెందిన చాలామంది, దానికీ మాకూ ఏ సంబంధం లేదని చెప్పుకుని ఆ నాశనాన్ని తప్పించుకుంటారు.