కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తగిన దృష్టాంతాలు

తగిన దృష్టాంతాలు

పాఠ్యభాగం 34

తగిన దృష్టాంతాలు

1, 2. దృష్టాంతాలు ప్రసంగానికి ఎలా దోహదపడతాయో క్లుప్తంగా వివరించండి.

1 ప్రసంగీకుడు దృష్టాంతాలను ఉపయోగిస్తుంటే, వాస్తవానికి అతడు తన ప్రేక్షకుల మనస్సులో అర్థవంతమైన దృశ్యాలను నాటుతున్నాడన్నమాట. దృష్టాంతాలు ఆసక్తిని రేకెత్తించి, ముఖ్యమైన ఉద్దేశాలను ఉన్నతపరుస్తాయి. ఒకని ఆలోచనా సరళిని అవి ఉత్తేజపర్చి, క్రొత్త విషయాలను గ్రహించడానికి సులభతరం చేస్తాయి. చక్కగా ఎంపిక చేసుకొనిన దృష్టాంతాలు భావోద్రేక సంయోగంతో వివేకవంతమైన అభ్యర్థనను జోడిస్తాయి. దాని ఫలితమేమంటే, వర్తమానం మనస్సుకు శక్తివంతంగా అందించబడుతుంది, సాధారణంగా వాస్తవానికి సంబంధించిన సామాన్య మాటలకు అది తరచూ సాధ్యంకాదు. అయితే దృష్టాంతాలు తగిన విధంగా ఉంటేనే యిది సాధ్యమౌతుంది. అవి మీ సమాచారానికి తగినవై ఉండాలి.

2 ఒక్కొక్కప్పుడు దురభిమానాన్ని లేదా పక్షపాతధోరణిని అధిగమించడానికి ఉపమానాలను ఉపయోగించవచ్చు. ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం పరిచయం చేయబడక ముందు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది వాటిని తొలగిస్తుంది. ఉదాహరణకు, “ఏ తండ్రీ తన బిడ్డను శిక్షించడానికి వాని చేతిని కాలుతున్న పొయ్యి మీద పెట్టడు,” అని మీరనవచ్చును. “నరకం” అనే సిద్ధాంతాన్ని పరిచయం చేసేటప్పుడు అలాంటి దృష్టాంతాన్ని ఉపయోగిస్తే, ‘నరకాన్ని’ గూర్చిన అబద్ధమత నమ్మకం అసంగతమైనదని నిరూపించబడుతుంది, గనుక దానిని మన నమ్మకాల నుండి మరింత సులభంగా తొలగించుకొన వచ్చును.

3-6. దృష్టాంతాలను వేటినుండి తీసుకొనవచ్చును?

3 దృష్టాంతాలు అనేక ఆకృతుల్లో ఉండవచ్చు. అవి సాదృశ్యాలు, సరిపోల్చే విషయాలు, తారతమ్యాలు, ఉపమానాలంకారాలు, రూపకాలంకారాలు, వ్యక్తిగత అనుభవాలు, ఉదాహరణల రూపంలో అవి ఉండవచ్చును. ఏ మూలం నుండియైనా వాటిని ఎంపిక చేసుకోవచ్చును. సృష్టిలో చలించేవి లేదా చలనంలేని వాటికి సంబంధించినవై ఉండవచ్చును. ప్రేక్షకుల ఉద్యోగాలు, మానవుని లక్షణాలు లేదా స్వభావాలు, గృహోపకరణాలు లేదా యిండ్లు, ఓడలు నిర్మించేటువంటి మానవ కార్యాలు మున్నగు వాటిపై అవి ఆధారపడవచ్చును. అయితే, ఎటువంటి దృష్టాంతాన్ని ఉపయోగించినా, అది ప్రసంగీకునికి నచ్చిందని ఉపయోగించడం కాదుగాని అది సందర్భాన్నిబట్టి, సమాచారాన్నిబట్టి చక్కగా ఎంచుకున్నదై ఉండాలి.

4 ఒక హెచ్చరిక. ప్రసంగాన్ని అనేక దృష్టాంతాలతో నింపొద్దు. వాటిని ఉపయోగించండి, కాని అతిగా కాదు.

5 దృష్టాంతాలను సరిగా ఉపయోగించడమనేది ఒక కళ. దానికి నైపుణ్యం, అనుభవం కావాలి. కాని వాటి ప్రభావశీలతను పదేపదే పేర్కొనలేము. దృష్టాంతాలను ఉపయోగించడం నేర్చుకోవడానికి వేటిని దృష్టాంతాలుగా ఉపయోగించవచ్చునో ఆలోచించ నేర్చుకోవాలి. మీరు చదువుతున్నప్పుడు ఉపయోగించబడిన దృష్టాంతాలను గుర్తించండి. విషయాలను పరిగణించేటప్పుడు, క్రైస్తవ జీవిత విధానం, సంబంధించిన రీతుల్లో వాటిని గూర్చి ఆలోచించండి. ఉదాహరణకు, కుండీలోనున్న పూలమొక్క ఎండిపోయి వడిలిపోయి ఉండుటను మీరు చూచినప్పుడు, “స్నేహమనేది మొక్కవంటిది. అది వికసించాలంటే దానికి నీరు పోయాలి,” అని మీరు ఆలోచించవచ్చు. కొందరు చంద్రమండలాన్ని కేవలం అంతరిక్ష యాత్ర దృష్టితోనే చూస్తుంటారు. క్రైస్తవులు దాన్ని దేవుని చేతి పనిగా, ఆయన సృష్టిలో ఒక గ్రహంగా, చిరస్థాయిగా నిలిచే వస్తువుగా, మన ప్రతిదిన జీవితాలను ప్రభావితం చేసేదిగా, సముద్రపుటలలు పైకెగసి పడేలా చేసేదిగా దానిని దృష్టిస్తారు.

6 ఒక ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు, సరళమైన దృష్టాంతాలు వెంటనే మనస్సున తట్టకపోతే, దానికి సంబంధించిన సమాచారం కొరకు వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురణలను సంప్రదించండి. దానిలో దృష్టాంతాలు వాడబడినవేమో చూడండి. ప్రసంగంలోని కీలకమైన మాటలను గూర్చి అవి మీ మనస్సుకు అందించే దృశ్యాలను గూర్చి ఆలోచించండి. వాటి ఆధారంగా ప్రసంగాన్ని తయారు చేయండి. సరిపడని దృష్టాంతాలను ఉపయోగించడం అసలు దృష్టాంతాలేవి ఉపయోగించకపోవడంకన్నా హీనమని గుర్తుంచుకోండి. ప్రసంగ సలహా పత్రంపై పేర్కొనబడిన “సమాచారానికి తగిన దృష్టాంతాలు” అనే దాన్ని చర్చించేటప్పుడు, మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతులు అనేకమున్నవి.

7-9. సరళమైన దృష్టాంతాలు ఎందుకంత ప్రతిభావంతంగా ఉంటాయి.?

7 సరళమైనవి. సరళమైన దృష్టాంతం జ్ఞాపకముంచుకొనడానికి మరింత సులభంగా ఉంటుంది. దాని సంష్లిష్టతనుబట్టి ప్రక్కదోవ పట్టించే బదులు అది తర్కనకు ఎంతగానో దోహదపడుతుంది. యేసు వాడిన దృష్టాంతాలు తరచూ కొన్ని మాటలకంటే ఎక్కువ లేవు. (ఉదాహరణకు మత్తయి 13:31-33; 24:32, 33 చూడండి.) అవి సరళంగా ఉండడమంటే, పరిభాష అర్థమయ్యే విధంగా ఉండాలి. ఏదైనా ఒక దృష్టాంతానికి ఎక్కువ వివరణ అవసరమైతే అది అదనపు భారమౌతుంది. దాన్ని విడిచి పెట్టండి లేదా సూక్ష్మీకరించండి.

8 యేసు పెద్ద పెద్ద విషయాలను వివరించడానికి చిన్న చిన్న విషయాలను ఉపయోగించాడు. ఒక దృష్టాంతములో ఒకేసారి అనేకమైన విషయాలను ప్రస్తావించకుండా అది సులభంగా దృశ్యీకరించుకునే విధంగా ఉండాలి. అది సూటిగాను యథాతథంగాను ఉండాలి. అట్టి దృష్టాంతాలను తప్పుగా అన్వయించడం అంత సులభమేమి కాదు.

9 ఒక దృష్టాంతము ఏ సమాచారాన్ని వివరించడానికి నిర్దేశించబడిందో దానికది పూర్తిగా సమాంతరంగావుంటే శ్రేష్ఠంగా ఉంటుంది. దృష్టాంతంలో కొంత భాగం తగిన విధంగా లేకపోతే, దానిని ఉపయోగించకుండా ఉండడం మంచిది. కొందరు అసంగతమైన విషయాలను గూర్చి తలపోస్తూ ఉండిపోతారు, గనుక ఆశించిన ఫలితం దక్కదు.

10, 11. దృష్టాంతాల అన్వయింపును ఎందుకు స్పష్టీకరించాలో చూపించండి.

10 అన్వయింపు స్పష్టం చేయబడింది. ఒక దృష్టాంతం యొక్క అన్వయింపును స్పష్టం చేయకపోతే, కొందరికి విషయం అర్థం కావచ్చు కాని అనేకులు దాన్ని గ్రహించలేరు. ప్రసంగీకుడు దృష్టాంతాన్ని తన మనస్సులో తేటగా నిల్పుకొని దాన్ని ఎందుకు వాడుతున్నాడో తెలుసుకోవాలి. ఆ దృష్టాంతం యొక్క విలువ ఎక్కడవుందో అతడు సూక్ష్మంగా పేర్కోవాలి. (మత్తయి 12:10-12 చూడండి.)

11 ఒక దృష్టాంతాన్ని అనేక విధాలుగా అన్వయించవచ్చు. దృష్టాంతాన్ని ఉపయోగించక ముందు లేదా ఆ తరువాతగాని సరళంగా పేర్కొనే సూత్రాన్ని స్థిరపర్చడానికి దాన్ని ఉపయోగించవచ్చు. దృష్టాంతంలో చూపించబడిన తర్కన వలన కల్గే పర్యవసానములను నొక్కిచెప్పడం మూలంగా దాన్ని అన్వయించవచ్చు. లేదా ఆ తర్కనకు ఉపయోగించిన ఉపమానములోని అంశాలను పోలియున్న వాటికి కేవలం అవధానాన్ని మళ్లించడం ద్వారా దాన్ని అన్వయించ వచ్చును.

12-14. ఏది తగిన దృష్టాంతమో నిర్ణయించుటకు మనకేది సహాయం చేస్తుంది?

12 ముఖ్యమైన విషయాలు నొక్కితెల్పబడ్డాయి. ఏదో మీ మనస్సుకు తట్టిందికదాయని దృష్టాంతాన్ని వాడవద్దు. ముఖ్యమైన విషయాలేవో తెలుసుకొనేందుకు ప్రసంగాన్ని విశ్లేషించండి, పిమ్మట వాటిని స్పష్టీకరించడానికి దోహదపడే దృష్టాంతాలను ఎంచుకోండి. చిన్నచిన్న విషయాలకు ప్రభావవంతమైన దృష్టాంతాలను ఉపయోగిస్తే, ప్రేక్షకులు ప్రధానమైన విషయాలకు బదులు చిన్నచిన్న విషయాలనే జ్ఞాపకముంచుకొనే అవకాశముంది. (మత్తయి 18:21-35; 7:24-27 చూడండి.)

13 తర్కించే విషయాన్ని దృష్టాంతం కనుమరుగు చేయకూడదు. అది ప్రేక్షకులు జ్ఞాపకముంచుకోగల విషయం కావచ్చు, అయితే దృష్టాంతం మనస్సుకు తట్టినతోడనే, ఏవిషయం కొరకు దాన్ని వాడబోతున్నామో అది కూడా మనస్సుకు రావాలి. అలా రాకపోతే, ఉపమానమే మరింత ప్రాధాన్యత వహించిందన్నమాట.

14 ఒక ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడూ, దృష్టాంతాలను ఎంచుకొనేటప్పుడూ నొక్కిచెప్పాల్సిన విషయాలతో దృష్టాంతాలను పోల్చిచూసి వాటి విలువెంతో పరిగణించండి. అది ఈ విషయాలను బలపరుస్తుందా? వాటిని ఉన్నతపరుస్తుందా? విషయాలను సులభంగా అర్థం చేసుకొని, జ్ఞాపకముంచుకొనేలా చేస్తుందా? అలా చేయకపోతే అది తగిన దృష్టాంతం కాదన్నమాట.

**********

15, 16. దృష్టాంతాలు ప్రేక్షకులకు తగిన విధంగా ఎందుకు ఉండాలో వివరించండి.

15 దృష్టాంతాలు సమాచారానికి తగిన విధంగా ఉండడమేకాక అవి మీ ప్రేక్షకులకు ఉపయుక్తంగా ఉండాలి. సలహా పత్రంపై “ప్రేక్షకులకు తగిన దృష్టాంతాలు” అని యిది ప్రత్యేకంగా పేర్కొనబడింది. దావీదు బత్షెబాతో చేసిన పాపాన్ని గూర్చి అతన్ని సరిదిద్దడానికి నాతాను వచ్చినప్పుడు, పేదవాడు అతని చిన్న గొర్రెపిల్లను గూర్చిన దృష్టాంతాన్ని ఆయన ఎంచుకున్నాడు. (2 సమూ. 12:1-6) ఈ దృష్టాంతం యుక్తితో కూడినది మాత్రమేకాక, దావీదు ఒకప్పుడు గొర్రెలకాపరే గనుక అది ఆయనకు సరిపోయింది. అతడు విషయాన్ని వెంటనే గ్రహించగల్గాడు.

16 ప్రేక్షకుల్లో ఎక్కువమంది వృద్ధులైయుంటే, కేవలం యౌవనులకు అనువుగావుండే దృష్టాంతాలను మాత్రమే ఉపయోగించ కూడదు. అయితే కొంతమంది కాలేజీ విద్యార్థులకు అలాంటి దృష్టాంతాలు సరిగ్గా సరిపోవచ్చు. కొన్నిసార్లు ప్రేక్షకుల్లోవున్న యౌవనులను వృద్ధులను, స్త్రీపురుషులను దృష్టిలో పెట్టుకొని రెండు విభిన్న దృక్కోణాల్లో దృష్టాంతాలను సిద్ధపడవచ్చును.

17-19. దృష్టాంతాలు మీ ప్రేక్షకులకు అంగీకారంగా ఉండాలంటే వాటిని దేనినుండి తీసుకోవాలి?

17 పరిచయమున్న వాటినుండి తీసుకొనబడింది. దృష్టాంతాలను వాడేటప్పుడు అందుబాటులో ఉన్నవాటిని మీరు వాడితే, అవి మీ ప్రేక్షకులకు పరిచయమున్నవై ఉంటాయి. యేసు అలా చేశాడు. బావినొద్ద స్త్రీతో మాట్లాడినప్పుడు జీవాన్నిచ్చే తన లక్షణాలను నీళ్లతో పోల్చుకున్నాడు. జీవితమందలి అతి సామాన్య విషయాలకు అవధానాన్ని మళ్లించాడు గాని అసాధారణ విషయాలకు కాదు. ఆయన వాడిన దృష్టాంతాలు ప్రేక్షకుల మనస్సుకు ఆ దృశ్యాన్ని వెంటనే స్ఫురింపజేశాయి, లేదా తమ వ్యక్తిగత జీవితమందలి ఏదొక అనుభవాన్ని వెంటనే గుర్తుచేశాయి. ఆయన దృష్టాంతాలను బోధించడానికి ఉపయోగించాడు.

18 ఆలాగే నేడునూ చేయాలి. గృహిణులకు వ్యాపార రంగాన్ని గూర్చి ఎంతోకొంత తెలిసే ఉంటుంది, కాని వారి ప్రతిదిన జీవితంలో తారసపడే విషయాలైన తమ పిల్లలు, తమ యింటి పనులు, యింటి కొరకు ఉపయోగించే వస్తువులను ఉదహరించి మీరు మాట్లాడితే మంచి ఫలితాలను పొందగల్గుతారు.

19 కచ్చితంగా స్థానికమైనవి, ప్రాముఖ్యంగా ఆ ప్రాంతానికి మాత్రమే చెందిన వాటిపై ఆధారపడిన దృష్టాంతాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. సమాజంలో సుపరిచితమైన యిటీవలి సంఘటనలు, అంటే ప్రాంతీయ వార్తాపత్రికల్లోని అంశాలు మంచి అభిరుచిని కలిగివుంటే అవి చక్కగా సరిపోతాయి.

20-22. దృష్టాంతాలను వాడేటప్పుడు విడనాడవల్సిన కొన్ని ఆపదలను పేర్కొనండి.

20 యోగ్యమైనవిగా ఉన్నాయి. ఉపయోగించబడిన దృష్టాంతం బైబిలు చర్చకు సరిపోయేదై వుండాలి. అయితే, నైతిక విషయానికి వచ్చేసరికి దృష్టాంతాలు “వావి వరుస లేనివై” ఉండకూడదు. ద్వందార్థాలున్న వ్యాఖ్యానాలు ఒకవేళ అవి అపార్థం చేసుకొనబడతాయనుకుంటే వాటిని విడిచి పెట్టండి. సందేహముంటే, విడిచి పెట్టడమే అనుసరించదగిన మంచి పద్ధతి.

21 దృష్టాంతాలు ప్రేక్షకుల్లోవున్న ఎవరినైనా, ముఖ్యంగా క్రొత్తగా సహవాసం చేస్తున్నవారిని అనవసరంగా అభ్యంతరపర్చకూడదు. ఈ కారణంచేత, మీ చర్చకు ఏమాత్రం సంబంధంలేని సిద్ధాంతపరమైన లేదా వివాదాస్పదమైన విషయాలను లేవదీయడం మంచిది కాదు. దృష్టాంతానికి, రక్తమార్పిడి లేదా జెండావందనం వంటి విషయాలు ప్రసంగంలో ముఖ్యాంశాలు కానట్లయితే మీరట్టి ఉదాహరణలను వాడనవసరం లేదు. అందుమూలంగా ఎవరైనా చర్చనీయాంశాన్నుండి వైదొలగిపోవచ్చు, అభ్యంతర పడవచ్చును కూడా. మీ ప్రసంగంలోనున్న ఒక అంశాన్నిబట్టి అలాంటి విషయాన్ని చర్చించాల్సివస్తే అది వేరే విషయం. అప్పుడు మీరు వాటిని గూర్చి తర్కించి ప్రేక్షకులను ఒప్పించే అవకాశాన్ని కలిగివుంటారు. కాని మీరు చర్చిస్తున్న ప్రాముఖ్యమైన సత్యాలకు వ్యతిరేకంగా మీ ప్రేక్షకులు ఈర్ష్యపడేటట్లు మీరు దృష్టాంతాలను ఉపయోగించి మీకున్న సంకల్పాన్ని కాలరాయొద్దు.

22 కావున మీరు దృష్టాంతాలను ఎంచుకొనేటప్పుడు వివేకాన్ని ఉపయోగించండి. అవి సరిగా ఉన్నాయో లేదో రూఢి చేసుకోండి. అవి మీ సమాచారానికి, ప్రేక్షకులకు తగినవైతే, అవి సరియైనవే అవుతాయి.

[అధ్యయన ప్రశ్నలు]