కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రసంగంలో పదాలను పొందిక చేయడం

ప్రసంగంలో పదాలను పొందిక చేయడం

పాఠ్యభాగం 30

ప్రసంగంలో పదాలను పొందిక చేయడం

1-3. ప్రసంగంలో పదాల పొందిక ఏ పాత్రను వహిస్తుంది, దానిని ఎలా సాధించవచ్చు?

1 పొందికగల ప్రసంగాన్ని ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకుంటారు. మరి అట్టి పొందిక లేకపోతే వారు తమ అవధానాన్ని వెంటనే కోల్పోతారు. అందుచేత మీరు ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు ఈ విషయానికి ముఖ్య అవధానం యివ్వాల్సివుంది; కావున మీరు శ్రద్ధతో కూడిన అవధానం యివ్వడానికే అన్నట్లు “సంధి పదాలతో పొందిక చేయడం” అనే విషయం ప్రసంగ సలహా పత్రంపై పేర్కొనబడింది.

2 పొందిక చేయడమంటే ఒకదానికొకటి అనుబంధం చేయడం, విడివిడి భాగాలన్నింటిని కలుపగా తయారైన సహేతుకమైన చర్చ అని అర్థం. విడిభాగాలను సహేతుకమైన పద్ధతిలో కేవలం మామూలుగా ఏర్పాటు చేయడం మూలంగానే కొన్నిసార్లు దీనిని సాధించవచ్చును. కాని అనేకమైన ప్రసంగాలలో మామూలుగా ఏర్పాటు చేసేదానికన్నా సంబంధం కలపవలసిన భాగాలుంటాయి. అలాంటి సందర్భాల్లో ఒక అంశం నుండి మరో అంశానికి వెళ్లేటప్పుడు పొందిక చేయడం అవసరం. అంతకు ముందు పేర్కొన్నవాటికి కొత్త తలంపులకు మధ్యనున్న సంబంధాన్ని చూపడానికి మాటలు లేదా పదాలు వాడబడతాయి, తద్వారా, కాలంలో మార్పు లేదా దృక్పథంలో మార్పు మూలంగా కలిగిన అంతరాన్ని పూరించవచ్చు. సంధి పదాలతో పొందిక చేయడం అంటే ఇదే.

3 ఉదాహరణకు, మీ ప్రసంగంలో ఉపోద్ఘాతం, ప్రసంగ భాగం, ముగింపు అనేవి విడివిడి భాగాలు, ఒకదానికొకటి వ్యత్యాసంగా ఉంటాయి, అయితే సంబంధం కలిపే పదాల మూలంగా వాటిని చక్కగా ఏకం చేయవచ్చు. అంతేకాకుండా ప్రసంగంలోని ప్రధాన అంశాలు ముఖ్యంగా అవి ప్రసంగ ఉద్దేశానికి నేరుగా సంబంధం లేనివైతే వాటిని కలుపుకుంటూ రావాలి. లేదా కొన్నిసార్లు కేవలం ఒక పేరాకు లేదా వాక్యభాగానికి పొందిక చేయవలసిన అవసరత రావచ్చు.

4-7. సంబంధం కలిపే పదాలను ఉపయోగించుట అంటే అర్థమేమిటి?

4 సంబంధం కలిపే పదాలను వాడడం. కేవలం పొందికపర్చే సరియైన మాటలు లేదా పదాలను ఉపయోగించి తరచూ తలంపులను కలపవచ్చును. వాటిలో కొన్ని ఏమిటంటే: మరియు, అదనంగా, ఇంకా చెప్పాలంటే, అంతేకాకుండా, అలాగే, అదేవిధంగా, కావున, ఆలాగున, ఈ కారణాలచేత, గనుక, పైన పేర్కొన్నదాని దృష్ట్యా, కాబట్టి, అందుచేత, అటుతరువాత, అయినప్పటికి, మరోపక్షాన, అందుకు భిన్నంగా, వ్యతిరేకంగా, మునుపు, ఇకనుండి మున్నగునవి. అట్టి మాటలు వాక్యాలను పేరాలను ఎంతో ప్రతిభావంతంగా కలుపుతాయి.

5 అయితే, పొందికపర్చే అలాంటి సామాన్య మాటలేకాకుండా ఈ ప్రసంగ లక్షణానికి ఇంకెంతో అవసరం. ఒక మాట లేక పదం మాత్రమే సరిపోనప్పుడు, ఏర్పడిన అంతరాన్ని దాటించి ప్రేక్షకులను పూర్తిగా ఆవలికి తీసుకెళ్లడానికి సంబంధం కలిపే విషయాలు అవసరమౌతాయి. ఇది ఒక పూర్తి వాక్యమే కావచ్చు లేదా సవివరంగా వ్యక్తపరచిన సంబంధం కలిపే తలంపైనా కావచ్చును.

6 అటువంటి అంతరాలను కలపగల్గే ఒక మార్గమేమంటే, అంతకుముందు చర్చించిన అంశంలోని ఒక భాగాన్ని తదుపరి అంశానికి ఉపోద్ఘాతంగా అన్వయించే ప్రయత్నం చేయడమే. తరచుగా దీనిని మనం యింటింటి సేవలో చేస్తుంటాము.

7 అంతేగాక, అనుక్రమంలో వచ్చేవాటిని మాత్రమే కలపడం కాదుగాని, కొన్నిసార్లు ప్రసంగమంతటిలో విభాగించబడివున్న విషయాలను కలపాలి. ఉదాహరణకు, ప్రసంగ ముగింపును ఉపోద్ఘాతంతో ముడిపెట్టాలి. బహుశ ప్రసంగం ప్రారంభంలో పరిచయం చేసిన ఒక తలంపును లేదా దృష్టాంతాన్ని, పురికొల్పే విధంగా లేదా ఆ దృష్టాంతానికి లేదా ఆ తలంపుకు ప్రసంగంతోవున్న సంబంధాన్ని చూపేందుకు ముగింపులో వాటిని అన్వయించవచ్చును. ఈ విధంగా దృష్టాంతం లేదా తలంపుకున్న ఏదొక ఉద్దేశాన్ని మరలా పేర్కొనడం సంబంధం కలిపేదిగా పనిచేసి, పొందిక పర్చడానికి తోడ్పడుతుంది.

8. పొందిక చేసేందుకు సంబంధం కలిపే పదాలను వాడడంలో ప్రేక్షకులు ఎలా తోడ్పడగలరు?

8 మీ ప్రేక్షకులకు సరిపడునంత పదాల పొందిక. పదాల పొందిక ఎంతమేరకు ఉండాలన్నది మీ ప్రేక్షకులను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగని కొంతమంది ప్రేక్షకులకు అసలు సంబంధం కలిపే పదాలే అవసరం లేదనికాదు. బదులుగా, కొంతమంది ప్రేక్షకులకు ఒకదానికొకటి సంబంధమున్న తలంపులు పరిచయం లేనందున వారికి కొంచెం ఎక్కువ అవసరమౌతాయి. ఉదాహరణకు, ప్రస్తుత దుష్టవిధానం యొక్క నాశనానికి సంబంధించిన లేఖనాన్ని దేవుని రాజ్యాన్ని గూర్చి మాట్లాడుతున్న లేఖనంతో యెహోవాసాక్షులు వెంటనే ముడిపెడతారు. కాని దేవుని రాజ్యాన్ని మానసిక దృక్పథంగా లేక మీ హృదయంలో ఉండే స్థితియని భావించేవారికి వాటికున్న సంబంధం సులభంగా అర్థంకాదు, గనుక వాటికున్న సంబంధాన్ని స్పష్టం చేయడానికి కొన్ని తలంపులను పరిచయం చేయాల్సి వుంటుంది. మనం చేసే యింటింటి సేవలో అలాంటి సర్దుబాట్లను తదేకంగా చేసుకోవలసి వస్తుంది.

**********

9-13. సహేతుకంగా ప్రసంగించడమంటే ఏమిటి, ఒక తర్కాన్ని వృద్ధిచేయగల రెండు ప్రాథమిక పద్ధతులేవి?

9 ప్రసంగానికి దగ్గిర సంబంధమున్న విషయం “సహేతుకమైన పొందికగల వివరణ,” ఇది కూడా సలహా పత్రంపై పేర్కొనబడింది. ఒప్పింపజేసే ప్రసంగానికిది ప్రాథమిక అవసరత.

10 సహేతుకత అంటే ఏమిటి? మన విషయంలో సహేతుకత అంటే సరియైన యోచన లేదా మంచి తర్కన అని చెప్పవచ్చు. అది అవగాహనను కలిగిస్తుంది ఎందుకంటే దీని మూలంగానే ఒక అంశం దానికి సంబంధించిన విభాగాలలో వివరించబడుతుంది. అవి ఎందుకలా ఉన్నాయో, వాటికున్న సంబంధమేమిటో సహేతుకత చూపిస్తుంది. అన్ని భాగాలు ఒక క్రమ పద్ధతిలో ఏకం చేయబడే విధంగా తర్కం క్రమేపి వృద్ధి అవుతుంటే ప్రసంగం సహేతుకంగా ఉందని చెప్పవచ్చును. సహేతుకమైన ప్రసంగం అంశప్రాధాన్యతా క్రమంలోనైనా, వంశావళి క్రమంలోనైనా లేదా సమస్యకు పరిష్కారం చూపేరీతిగానైనా ఉండవచ్చును, ఇవి కొన్ని పద్ధతులు మాత్రమే.

11 తర్కనను కొనసాగించడానికి అనుసరించదగు రెండు ప్రాథమిక పద్ధతులున్నాయి. (1) సత్యాన్ని నిరూపించడానికి వాస్తవాలను పొందుపరుస్తూ దానిని నేరుగా ప్రేక్షకుల ముందుంచండి. (2) ఏదైనా ఒక తప్పును ఎత్తిచూపించండి, అప్పుడది పతనమౌతూ సత్యమే ఆ విషయాన్ని స్థిరపర్చేలా చేస్తుంది. అప్పుడిక మిగిలేదల్లా, చర్చించబడుతున్న సత్యాల సరియైన అన్వయింపును చూపడమే.

12 ఏ యిద్దరు ప్రసంగీకులు ఒకే విధంగా తర్కించరు. ఒకే అంశాన్ని వివిధ రీతులుగా వర్ణించిన దానికి చక్కని తార్కాణం నాలుగు సువార్తలలో ఉంది. యేసు శిష్యుల్లో నలుగురు ఆయన పరిచర్యను గూర్చి తమ వ్యక్తిగత వృత్తాంతాలను వ్రాశారు. ప్రతి ఒక్కటి వేర్వేరుగా ఉన్నాయి, అయినా అందరూ యుక్తమైన, సహేతుకమైన విషయాలను వ్రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్దిష్ట సంకల్పాన్ని సాధించడానికి రచనలు చేశారు, ప్రతిఒక్కరు సఫలీకృతులయ్యారు.

13 ఈ విషయంలో సలహాదారుడు మీ సంకల్పాన్ని గుర్తించి, ఆ సంకల్పం నెరవేరిందా లేదాయని మీ ప్రసంగ అనుక్రమాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాలి. మీ సంకల్పాన్ని స్పష్టం చేస్తూ, ముఖ్యంగా మీ ఉపోద్ఘాతం, మీ సమాచారం, మరి దాన్ని ముగింపులో అన్వయిస్తూ మీరు అతనికి, మీ ప్రేక్షకులకు సహాయపడవచ్చు.

14, 15. మన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో కలిగియుండడం ఎందుకు ప్రాముఖ్యమో చూపండి.

14 సమాచారం ఓ క్రమ పద్ధతిలో ఉండాలి. మొదటిగా, మీ సమాచారాన్ని లేదా సంక్షిప్తప్రతిని తయారు చేసుకొనేటప్పుడు, పీఠిక లేకుండా ఏ వ్యాఖ్యానం లేదా తలంపు అందులో ఉండకుండా చూసుకొనండి. మీరిలా ప్రశ్నించుకొంటూ ఉండండి: తరువాత పేర్కొనదగిన అత్యంత సహజమైన విషయమేమిటి? ఇంతమేరకు వచ్చిన తరువాత అడగవలసిన అత్యంత సహేతుకమైన ప్రశ్న ఏమైయుంటుంది? ఈ ప్రశ్నను గుర్తించిన పిదప కేవలం దానికి సమాధానమివ్వండి. “మీరు యింతవరకు చెప్పిన దాన్నిబట్టి నేను గ్రహించిందేమంటే ఈ విషయం ఫలానా ఫలానా,” అని మీ ప్రేక్షకులు ఎల్లవేళల చెప్పగల్గేటట్లు ఉండాలి. పునాది ఏమి వేయకపోతే, సర్వసాధారణంగా ఆ అంశం సహేతుకత లేనిదన్నట్లు పరిగణించబడుతుంది. అంటే ఏదో లోపించిందన్నమాట.

15 మీ సమాచారాన్ని తయారు చేసుకొనేటప్పుడు, సహజంగానే ఒకదాని మీద ఒకటి ఆధారపడియుండే విషయాలను మీరు పరిగణలోనికి తీసుకోవాలి. అలాంటి భాగాలకున్న సంబంధాన్ని మీరు పరిశీలించి తదనుగుణంగా వాటిని ఏర్పాటు చేసుకొనడానికి కృషిచేయాలి. అది ఒక యింటిని కట్టడం వంటిది. మొదట పునాది వేయకుండా గోడలు కట్టడానికి ఏ నిర్మాణకుడు ప్రయత్నించడు. లేక గోడలన్నీ ప్లాస్ట్రింగ్‌ చేసిన తరువాత నీటి సరఫరా కొరకు పైపులన్నింటిని వేయడు. ప్రసంగాన్ని నిర్మించే విషయంలో కూడా అలాగే ఉండాలి. ప్రతీ భాగం ఒక క్రమంలో ఉండి, దాని తరువాత వచ్చే భాగానికి సంబంధం కలుపుతూ, దానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఒక పటిష్ఠమైన, ఇమడ్చబడియున్న ప్రసంగాన్ని తయారు చేసేందుకు దోహదపడాలి. ప్రసంగంలో మీరు అందించనైయున్న వాస్తవాలను ఆ పద్ధతిలో ఎందుకు పెట్టారో మీకెల్లవేళల ఒక కారణముండాలి.

16-20. ఒకడు తన ప్రసంగంలో కేవలం సంబంధిత సమాచారాన్నే కలిగియున్నాడని ఎలా రూఢి చేసుకోగలడు?

16 కేవలం సంబంధిత సమాచారమే ఉపయోగించబడింది. మీరు ఉపయోగించే ప్రతి అంశాన్ని తప్పనిసరిగా ప్రసంగానికి ముడిపెట్టాలి. లేకపోతే, దీనికి సంబంధించినది కాదు అన్నట్లన్పిస్తుంది, అది యిమడదు; సంబంధంలేని సమాచారమౌతుంది, అంటే చర్చించబడుతున్న సమాచారానికి ఏమాత్రం దోహదపడక లేదా సంబంధం లేకుండా ఉంటుంది.

17 అయితే, పైకి సంబంధం లేనిదిగా కన్పించినా దాన్ని విజయవంతంగా ముడిపెడితే, మీ సలహాదారుడు తన దృక్పథాన్నిబట్టి ఇది సంబంధం లేని విషయం అని అనడు. అట్టి అంశాన్ని ఒక నిర్దిష్ట సంకల్పం కొరకు మీరు ఎంపిక చేసుకొనియుండవచ్చు, మరి అది ముఖ్యాంశానికి సరిపడితే అది ప్రసంగంలో భాగమైపోతుంది, దాన్ని సహేతుకమైన పద్ధతిలో పరిచయం చేయవచ్చు, మీ సలహాదారుడు దానిని అంగీకరిస్తాడు.

18 మీరు ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు సంబంధంలేని సమాచారాన్ని వెంటనే, సులభంగా ఎలా గుర్తుపట్టవచ్చు? ఇక్కడ విషయాంశ సంక్షిప్తప్రతి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సమాచారాన్ని వర్గీకరించడానికి అది దోహదపడుతుంది. కార్డులనుగాని మరి అలాంటివేవైనా, వాటిపై సంబంధిత సమాచారాన్ని వ్రాసి ఉంచుకొని వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. సమాచారాన్ని ఎలా అందిస్తే బాగుంటుందని మీరనుకుంటారో ఆ పద్ధతిలో ఇప్పుడు ఈ కార్డులను అమర్చుకోండి. అంశాన్ని ఎలా ప్రసంగించాలో నిర్ణయించడానికి సహాయపడడం మాత్రమే కాకుండా ముఖ్యాంశానికి సంబంధంలేని వాటిని చూపించడంలో కూడా అది సహాయ పడుతుంది. విషయాలు ఒక క్రమపద్ధతిలో లేకుంటే అవి తర్కానికి అవసరమైతే వాటిని ఓ క్రమపద్ధతిలో ఉండేటట్లు చేయాలి. మరి అవి అంత అవసరం కాకపోతే, ముఖ్యాంశానికి సంబంధంలేని వాటిగా పరిగణించి తొలగించాలి.

19 దీన్నిబట్టి మీ ప్రసంగ ముఖ్యాంశం ప్రేక్షకులను, ప్రసంగ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధమున్న విషయాలను నిశ్చయపర్చుకొని తయారు చేయబడిందని వెంటనే అర్థం చేసుకోవచ్చును. కొన్ని పరిస్థితులలో మీ ప్రేక్షకులకున్న అవగాహననుబట్టి మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక విషయం ప్రాముఖ్యం కావచ్చు, అయితే మరో ప్రేక్షకులకు లేదా మరో ముఖ్యాంశంతో ప్రసంగిస్తుంటే దాని అవసరం లేకపోవచ్చును లేదా అది పూర్తిగా సంబంధం లేనిదే కావచ్చును.

20 దీని దృష్ట్యా, మీ ప్రసంగంలో ఎంత సమాచారాన్ని కలిగి యుండాలి? సహేతుకమైన, పొందికగల వివరణను కలిగియుండడం అంటే మీ ప్రసంగమందున్న ప్రతి అంశాన్ని దానిలో చేర్చమని కాదు. అయినా, విద్యార్థి ప్రసంగాలు పాఠశాల ఏర్పాటులో ఉపదేశాత్మకమైనవి గనుక ఎంత సమాచారాన్ని చేర్చితే అభ్యాస సిద్ధంగా ఉంటుందో అంలాంటి సన్నివేశాన్ని ఎంపిక చేసుకొంటే మంచిది. అయితే, మీ ముఖ్యాంశాన్ని వృద్ధిచేయడానికి అవసరమగు కీలకమైన అంశాలను విడిచిపెట్టకూడదు.

21. ఏ కీలకమైన అంశాన్ని విడిచి పెట్టకుండుట ఎందుకు ప్రాముఖ్యము?

21 ఏ కీలకమైన అంశాలు విడిచి పెట్టబడలేదు. ఒక అంశం కీలకమైనదా కాదా అని మీరు ఎలా తెలుసుకోగలరు? మీరు దానిని ప్రస్తావించకుండా మీ ప్రసంగ సంకల్పాన్ని నెరవేర్చ లేకపోతే అది ప్రాముఖ్యమైనదే. ఇది ముఖ్యంగా సహేతుకమైన, పొందికగల వివరణ విషయంలో నిజం. ఉదాహరణకు, ఒక కాంట్రాక్టరు మీకు రెండంతస్థుల భవనాన్ని నిర్మించి మెట్లు వేయకుండా విడిచి పెడితే మీరెలా సరిపెట్టుకోగలరు. అలాగే, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను విడిచి పెట్టిన ప్రసంగం కూడా సహేతుకమైన, పొందికగల ప్రసంగంగా ఉండజాలదు. ఏదో లోపముంది, మరి కొంతమంది ప్రేక్షకుల అవధానం తప్పిపోతుంది. అయితే ప్రసంగం సహేతుకమైన, పొందికగల వివరణను కలిగివుంటే అలా జరగదు.

[అధ్యయన ప్రశ్నలు]