కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాంతీయ పరిచర్యకు అన్వయింపబడు సమాచారము

ప్రాంతీయ పరిచర్యకు అన్వయింపబడు సమాచారము

పాఠ్యభాగం 35

ప్రాంతీయ పరిచర్యకు అన్వయింపబడు సమాచారము

1-3. మీ సమాచారాన్ని ప్రాంతీయ పరిచర్యకు అన్వయించడాన్ని నేర్చుకొనుట ఎందుకు విలువైనది?

1 క్రైస్తవ పరిచారకులుగా యీనాడు మన పరిచర్యలో ఎక్కువ భాగం, బైబిలును గూర్చి అంతగా తెలియని వ్యక్తులకు దేవుని వాక్యాన్ని ప్రకటించి, బోధించుట యిమిడివుంది. వారిలో కొంతమందికి అసలు బైబిలే లేదు; యితరులైతే కేవలం దాన్ని తమ షెల్ఫ్‌లోనే పెడతారు. అంటే, మనం వారికి చెప్పేవాటిని బట్టి వారు పూర్తి ప్రయోజనం పొందాలంటే, వారి పరిస్థితులకు తగినట్లుగా మనం దానిని అన్వయించాల్సి ఉంటుంది. మనం వర్తమానాన్ని మార్చివేస్తామని కాదుగాని వారు అర్థం చేసుకొనగల్గే భాషలో దానిని వ్యక్తపర్చడానికి మనం ప్రత్యేకంగా కృషి చేస్తాం. అసలు మన సమాచారాన్ని యిలా అన్వయించమని వారిని ఆహ్వానిస్తున్నామంటే అసలు మనం దానిని ఎంతగా అర్థం చేసుకున్నామో పరీక్షించుకొనేందుకే.

2 అన్వయించడమంటే, క్రొత్త పరిస్థితులకు అనువుగా మలచడం, వాటికి అనుగుణంగా నడుచుకొనడమని అర్థం. అంటే తన సంతృప్తి లేక ఎదుటివాని సంతృప్తికొరకు దేని విషయంలోనైనా ఒప్పేసుకొనడమని అర్థం. ప్రాంతీయ పరిచర్యకు సమాచారాన్ని అన్వయించే విషయాన్ని పరిశీలించడం, మనం ప్రాంతీయ పరిచర్యలో చేసే సంభాషణలు లేదా మరే యితర మాటలైనా ఒక నిర్దిష్టమైన ప్రేక్షకులకు మరి ముఖ్యంగా ప్రాంతీయ పరిచర్యలో క్రొత్తగా ఆసక్తిని చూపే వ్యక్తులకు సరళంగాను, సులభంగాను అర్థమయ్యే విధంగా ఉండే ఆవశ్యకతను నొక్కితెల్పాలి. కావున, మీరు పాఠశాలలో ఈ లక్షణంపై కృషి చేస్తున్నప్పుడు, మీరు యింటింట సాక్ష్యమిస్తున్నప్పుడు కలుసుకొనే వ్యక్తులను ఎలా పరిగణిస్తారో అలాగే మీ ప్రేక్షకులను కూడా ఎల్లవేళలా పరిగణించాలి.

3 అలాగని మీరు ఈ లక్షణంపై కృషి చేసేటప్పుడు, యింటింట మాట్లాడే తీరులోనే మీ ప్రసంగం ఉండాలని దీని అర్థం కాదు. పాఠశాల నిమిత్తం మీకు యిటీవల యివ్వబడిన ఉపదేశాలలో పేర్కొన్న మాదిరిగానే ప్రసంగాలన్నీ అందించే విధానంలో ఒకే రీతిగా ఉంటాయి. దాని అర్థమేమంటే, మీరు ఎలాంటి ప్రసంగాన్నిస్తున్నా, మీరు తర్కించే విధానం మరి మీరు ఉపయోగించే భాష, మీరు ప్రాంతీయ సేవలో కలిసిన వ్యక్తులతో మాట్లాడునప్పుడు ఉపయోగించే రీతిలోనే ఉంటాయి. ఎక్కువ మట్టుకు మనం మాట్లాడేది ప్రాంతీయ పరిచర్యలోనే గనుక ప్రాంతీయ సేవలో మనం కలుసుకొనే అనేకమంది వ్యక్తులు అర్థం చేసుకొనే స్థాయిలో సరళంగా మాట్లాడే అవసరతను మీరు గుర్తించేలా యిది మీకు సహాయపడాలి. ఈ లక్షణం విషయంలో మీరు పాఠ్యభాగం 21లో కొంత మట్టుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు దీని అసాధారణమైన అవసరత, ప్రాముఖ్యతలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రత్యేకంగా చేపట్టాలి.

4, 5. మన మాటలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎందుకుండాలో వివరించండి.

4 మాటలు ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయబడ్డాయి. కొంతమంది సహోదరులు యింటింటి పరిచర్యలోను క్రొత్త పఠనాల్లోను ఉపయోగిస్తున్న మాటలను బట్టి ఈ లక్షణం యొక్క అవసరత ఉత్పన్నమైంది. లేఖనముల విషయంలో మనకున్న అవగాహన, సామాన్యంగా ప్రజలకు అర్థంకాని భాషను మనకు ప్రసాదించింది. మనం “శేషము,” “వేరేగొర్రెలు,” మొదలగు మాటలను ఉపయోగిస్తుంటాం. మన మాటల్లో వాటిని ఉపయోగిస్తే, మనం ప్రాంతీయ సేవలో కలిసే వారికి అవి ఎట్టి భావాన్ని అందించలేవు. అవి అర్థమయ్యే విధంగా తగిన పర్యాయపదాలు లేదా వివరాలను ఉపయోగించి వాటిని స్పష్టీకరించాలి. “అర్మగిద్దోను,” “రాజ్య స్థాపన” వంటి సూచనార్థక మాటల భావమేమిటో వివరించకపోతే అవి ఎట్టి భావాన్ని అందించలేవు.

5 ఈ విషయాన్ని పరిశీలించేటప్పుడు, మీ సలహాదారుడు తన్నుతాను యిలా ప్రశ్నించుకుంటాడు, బైబిలు సత్యంతో పరిచయంలేని వ్యక్తి ఆ అంశాన్ని లేదా ఆ మాటను అర్థం చేసుకున్నాడా? అలాంటి దైవిక సంబంధమైన పదాలను ఉపయోగించవద్దని మిమ్మల్ని అదేపనిగా నిరుత్సాహపర్చడు. మన మాటల్లో అవి ఒక భాగమే, మరి క్రొత్తగా ఆసక్తిని చూపే వ్యక్తులు వాటికి పరిచయస్థులు కావాలని మనం ఆశిస్తాము. అయితే మీరు అలాంటి పదాలనేమైనా ఉపయోగిస్తే, అవి వివరించబడ్డాయా లేదాయని ఆయన పరిశీలిస్తాడు.

6-8. మన ప్రసంగాలను సిద్ధపడేటప్పుడు సరియైన అంశాలను ఎంచుకొనడంలో మనమెందుకు జాగ్రత్త వహించాలి?

6 తగిన అంశాలు ఎంచుకోబడ్డాయి. మీరు ప్రాంతీయ సేవలో అందించడానికి ఎంచుకున్న ఉద్దేశాలు, సన్నివేశాన్ని బట్టి పదాలు వ్యత్యాసంగా వున్నట్లే యివి కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకంటే క్రొత్తగా ఆసక్తి చూపుతున్న వ్యక్తితో చర్చించడానికి మనం ఎంచుకోని విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సమాచారాన్ని ఎంచుకోవలసిన బాధ్యత పూర్తిగా మీదే. కాని పాఠశాల్లో మీకు ఒక ప్రసంగం యివ్వబడినప్పుడు మీరు అందించవలసిన సమాచారం మీ కొరకు ముందుగానే సిద్ధం చేయబడింది. ఆ ప్రసంగమందున్న సమాచారం నుండే మీరు ఎంచుకోవలసి ఉంటుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారు?

7 మొదటిగా, మీరు ఉపయోగించాల్సిన అంశాలకు మీరు పరిమితమైనందున, తగిన అంశాలను ఎక్కువగా ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించే సన్నివేశాన్ని మీరు మీ ప్రసంగం కొరకు ఎంపిక చేసుకొనవచ్చును. మీరు ఎంచుకున్న అంశాలేమిటో మరి అవి మీ ప్రసంగ పరిస్థితులకు ఎలా సరిపడతాయో చూచేందుకు మీ సలహాదారుడు ఆసక్తి కల్గివుంటాడు. ఎందుకంటే చర్చించబడుతున్న ఈ లక్షణంలో మీరు ప్రాంతీయ సేవలోని వివిధ రంగాలకు వివిధ రకాలైన సమాచారం అవసరమని చూపిస్తున్నారు. ఉదాహరణకు, మీరు యింటింటి సేవలో మాట్లాడేటప్పుడు ఉపయోగించే సమాచారాన్నే క్రొత్తగా ఆసక్తి చూపుతున్న వ్యక్తిని కూటానికి ఆహ్వానించేటప్పుడు ఉపయోగించరు. కావున మీ ప్రసంగంలో గృహస్థునితో చర్చించవలసి వచ్చినా లేక వేదిక మీద నుండి ప్రసంగించాల్సి వచ్చినా, మీకు నిర్దేశించబడిన సమాచారం నుండి మీరు చెప్పే మాటలను బట్టి మీరు ఎంచుకొనే అంశాలను బట్టి మీరు ప్రసంగిస్తున్న ప్రేక్షకులు ఎట్టివారో గుర్తించండి.

8 అంశాలు సరియైనవా కాదాయని నిర్ణయించడానికి, మీ ప్రసంగ ధ్యేయమేమిటో మీ సలహాదారుడు పరిశీలిస్తాడు. ఇంటింటి సందర్శనంలో సాధారణంగా గృహస్థునికి బోధించి యింకా ఎక్కువ పఠనం చేయుమని పురికొల్పుటే మీ ధ్యేయం. పునర్దర్శనంలోనైతే అతనిలోని ఆసక్తిని పెంపొందించి, వీలైతే బైబిలు పఠనాన్ని ప్రారంభించుట మీ ధ్యేయమైయుంటుంది. పఠనమైన తరువాత మాట్లాడుతున్న మాటలైతే, గృహస్థుని కూటమునకు హాజరు కమ్మని అడగడానికో లేదా ప్రాంతీయ సేవలో పాల్గొనమనో, అలాంటివేవో చేయుమని ప్రోత్సహించడానికే.

9, 10. మనం ఎంపిక చేసిన అంశాలు సరియైనవోకావో ఎలా నిర్ణయించ గలము?

9 అయితే, అదే సేవా రంగంలో కూడా మీ ప్రేక్షకులను బట్టి మీరు ఎంచుకునే సమాచారం వ్యత్యాసాన్ని కల్గియుండవచ్చు. కావున దీనిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. మీ ఉద్దేశానికి సరిపడని అంశాలు మీకు నిర్దేశింపబడిన సమాచారంలోవుంటే వాటిని ప్రసంగంలో యిమడ్చకూడదు.

10 ఈ కారణాల దృష్ట్యా ప్రసంగాన్ని సిద్ధపడకముందు సన్నివేశాన్ని ఎంచుకోవాలి. మీరిలా ప్రశ్నించుకోండి: నేనేమి సాధించదల్చాను? ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమయ్యే ముఖ్యాంశాలేవి, ప్రసంగ పరిస్థితులకు తగిన విధంగా ఈ అంశాలను ఎలా మార్చవచ్చును? ఈ విషయాలను మీరు నిర్ణయించిన తరువాత సరియైన అంశాలను ఏ యిబ్బంది లేకుండా ఎంచుకోవచ్చు, మరి సమాచారాన్ని ప్రాంతీయ పరిచర్యకు అన్వయించే విధంగా అందించవచ్చును.

11-13. మనం అందించిన సమాచారం యొక్క ఆచరణాత్మకమైన విలువను తెలియజేయుట ఎందుకు ప్రాముఖ్యము?

11 సమాచారము యొక్క ఆచరణాత్మక విలువ ఉన్నతపర్చబడింది. సమాచారం యొక్క ఆచరణాత్మక విలువను ఉన్నతపర్చడమంటే, అది గృహస్థునికి సంబంధించినదని, అతనికి అవసరమైనదని లేదా దాన్ని అతడు ఉపయోగించు కొనవచ్చునని స్పష్టంగా, నిస్సంశయంగా చూపించుటని అర్థం. ప్రసంగం ప్రారంభించినప్పటి నుండే “ఇది నన్ను యిముడ్చు చున్నది” అని గృహస్థుడు గుర్తెరగాలి. ప్రేక్షకుల అవధానాన్ని చూరగొనడానికి యిది అవసరం. అయితే ఆ అవధానాన్ని నిలిపి ఉంచడానికి, ప్రసంగమంతటా ఆ సమాచారము యొక్క అదే అన్వయింపును కొనసాగించడం అవసరము.

12 దీనికి కేవలం ప్రేక్షకులతో సంబంధం కలిగివుండి, సహేతుకంగా ఆలోచించేలా మీ ప్రేక్షకులకు సహాయపడుట కంటే యింకెక్కువ యిమిడివుంది. ఇప్పుడు మీరే ముందంజ వేసి, ఆ సమాచార అన్వయింపుకు గృహస్థుని యిమడ్చాలి. ప్రాంతీయ పరిచర్యలో మన ఉద్దేశమేమంటే, ప్రజలకు దేవుని వాక్యమందలి సత్యాన్ని తెల్పి, రక్షణ మార్గాన్ని నేర్చుకొనుటకు వారికి సహాయపడుటే. కనుక, మీరు చెప్పబోయే దానిని విని దాని ప్రకారంగా నడుచుకొనుట మూలంగా కల్గే ఆచరణాత్మక ప్రయోజనాలను మీరు గృహస్థునికి యుక్తితోను, శ్రద్ధతోను చూపించాలి.

13 ఈ లక్షణం చివర్లో పేర్కొనబడినప్పటికిని, అది తక్కువ ప్రాముఖ్యత గలదని కాదు. అది చాలా ప్రాముఖ్యమైనది, దాన్ని ఎన్నడూ అలక్ష్యం చేయకూడదు. దాని విషయంలో కృషి చేయండి, ఎందుకంటే, ప్రాంతీయ పరిచర్యలో అది ప్రాముఖ్యం. మీరు చెప్పేది గృహస్థునికి తన వ్యక్తిగత జీవితంలో ఎంతోకొంత ఉపయోగపడుతుందని అతడు స్పష్టంగా గ్రహించకపోతే, అతని అవధానాన్ని మీరు ఎక్కువసేపు నిలపలేరు.

[అధ్యయన ప్రశ్నలు]