కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫలవంతమైన ఉపోద్ఘాతములు

ఫలవంతమైన ఉపోద్ఘాతములు

పాఠ్యభాగం 22

ఫలవంతమైన ఉపోద్ఘాతములు

1-3. మీ ప్రసంగ ఉపోద్ఘాతంలో, పాఠ్యాంశంపై ఆసక్తిని మీరెలా రేకెత్తించవచ్చు?

1 ఆసక్తిని రేకెత్తించుట. ప్రసంగ ఉపోద్ఘాతం, పాఠ్యాంశంపై ఆసక్తిని రేకెత్తించాలి. అది మీ ప్రేక్షకుల అవధానాన్ని చూరగొనాలి గనుక తదుపరి ప్రసంగించనైయున్న దానికి వారు తగినంత అవధానమిచ్చేలా వాటిని సిద్ధపడండి. దీనిని సాధించడానికి, మీ పాఠ్యాంశాన్ని గూర్చిన విలువను ప్రేక్షకులకు చూపడం అవసరము.

2 ప్రసంగంపై ఆసక్తిని రేకెత్తించడానికి ఒక శ్రేష్ఠమైన మార్గమేమంటే అందులో ప్రేక్షకులను యిమడ్చడమే. ఈ సమాచారం వారికి విలువైనదని, వారి జీవితాలకు సంబంధించినదని వారు గ్రహించేలా చేయండి. అలా చేయడానికి మీరు ప్రేక్షకుల స్థాయినుండి ప్రారంభించాలి. అంటే మీరు చెప్పేది శ్రోతలకు పరిచయమున్న విషయమై వుండాలి. అది ఒక ఉపమానం, లేదా ఒక సమస్య, లేదా ప్రశ్నల పరంపరైనా కావచ్చు. అయితే, అది మీ ప్రేక్షకులు అర్థం చేసుకొని, దానిని తమకు అన్వయించుకొనుటకు వీలగునట్లు అది వారికి పరిచయమున్న విషయమై ఉండటం మంచిది.

3 కొన్ని సందర్భాలలో, మీ ఉపోద్ఘాతమందు దురభిమానమును అధిగమించవలసిన అవసరం ఉండవచ్చును. ముఖ్యంగా చర్చించబడుతున్న పాఠ్యాంశము మరీ వివాదాస్పదమైనదైతే విశేషంగా ఇది వాస్తవమై యుండవచ్చు. అలాంటి పరిస్థితులలో మీ అంశాన్ని స్థిరపర్చే తర్కనలను ప్రభావవంతంగా చర్చించేంతవరకు మీ ప్రేక్షకులు వేచియుండేలా చేయాలంటే మీరందించే ఉపోద్ఘాతం ప్రముఖ పాత్రవహిస్తుంది. ఇంటింటి పరిచర్యలోనైతే మొదట అభ్యంతరకరమైన విషయాలను యుక్తిగా పేర్కొని తదుపరి మీరు చర్చించదలచిన సమాచారాన్ని కొనసాగించుటకు తరచూ వీలౌతుంది.

4-6. ఆసక్తిని రేకెత్తించడానికి మన ఉపోద్ఘాతములకు మరేయితర విషయాలు దోహదపడగలవు?

4 మీరు ఏమి చెబుతారనేది ఎల్లప్పుడు అధిక ప్రాధాన్యత వహిస్తుంది. అయితే, ఉపోద్ఘాతం ద్వారా మీరు ఆసక్తిని రేకెత్తించుటకు, ప్రసంగంలో మరే యితర భాగంలోకన్నా దీనిలో మీరు ఎలా చెబుతున్నారనేది ఎంతో ప్రాముఖ్యం. అందుకొరకు మీ ఉపోద్ఘాతంలో మీరు ఏమి చెప్పనైయున్నారనే దానికన్నా మీరు దానినందించే విధానాన్ని గూర్చి జాగ్రత్తగా సిద్ధపడడం అవసరము.

5 సాధారణంగా, ఉపోద్ఘాతంలో చిన్నవి, సరళమైన వాక్యాలు మీ ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చగలవు. ఉపోద్ఘాతానికి లభించే పరిమిత సమయంలో మీ ధ్యేయాన్ని నెరవేర్చుటకు మాటల ఎంపిక ఎంతో శ్రేష్ఠం గనుక మొదటి రెండు, మూడు వాక్యాలను ఎంతో జాగ్రత్తగా సిద్ధపడడం ప్రయోజనకరమని మీరు గమనించియుంటారు. మీరు వాటిని చదవగల్గునట్లు మీ నోట్సులో వాటిని వ్రాసుకోండి, లేదా మీ ప్రారంభపు మాటలు కోరదగిన, అవసరమగు ప్రభావాన్ని కల్గించేలా వాటిని జ్ఞాపకముంచుకోండి. అంతేకాకుండా, ప్రారంభంలో ఇది మీకు మంచి ధైర్యాన్ని కల్గించి, ప్రసంగాన్ని ధారాళంగా కొనసాగించడానికి తగినంత నెమ్మదిని పొందడానికి అవకాశమిస్తుంది.

6 ఈ ప్రసంగ లక్షణం విషయంలో ఈ అంశాలపై సలహాదారుడు గమనించకపోయినను, మీ ఉపోద్ఘాతానికి సంబంధించి మరికొన్ని మాటలను చెప్పుకుందాం. మీకు ధైర్యం చాలకపోతే ప్రసంగ వేగాన్ని తగ్గించి, చిన్నస్వరంతో మాట్లాడండి. స్థిరంగా మాట్లాడండి, కాని మూర్ఖంగా వాదించవద్దు. అలాంటిది మీ ప్రేక్షకుల మనస్సును ప్రారంభంలోనే విరిచి వేయవచ్చు.

7. మీరు ఉపోద్ఘాతాన్ని ఎప్పుడు సిద్ధపడాలి?

7 ప్రసంగానికి మొదట్లో అందించాల్సింది ఉపోద్ఘాతమే. అయినప్పటికీ, అసలు ప్రసంగాన్నంతటిని చక్కగా తయారుచేసుకున్న తరువాతనే దీన్ని అత్యంత ప్రభావవంతంగా తయారు చేసుకుంటారు. మీరు సిద్ధపడిన సమాచారాన్ని సరియైనరీతిలో అందించడానికి ఏమి చెబితే బాగుంటుందో మీరు తెలుసుకోవడానికి తోడ్పడుతుంది.

**********

8-10. మన ఉపోద్ఘాతాలను మూలాంశానికి తగిన విధంగా మనమెలా చేయగలం?

8 మూలాంశమునకు తగినది. మీ ఉపోద్ఘాతం మూలాంశమునకు తగినదైతేనే అది అసలు అంశములోనికి చక్కగా నడిపించగలదు. మాట్లాడుటలో మీ సంకల్పానికి దోహదపడు వాటినే మీ ఉపోద్ఘాతంలో ఉపయోగించడానికి చాలా జాగ్రత్త వహించాలి. అయితే అది రాజ్య వర్తమాన హుందాతనాన్ని కాపాడి, ప్రేక్షకులలో క్రొత్తవారెవరైనావుంటే వారిని అభ్యంతరపర్చకుండా ఉండాలి.

9 మీ ఉపోద్ఘాతం కేవలం చర్చనీయాంశానికి నడపడమే కాకుండ, మీరు చెప్పనైయున్న సమాచారం యొక్క నిర్దిష్ట అంశాన్ని స్పష్టంగా అందించేదై వుండాలి. అంటే, మీ అంశాన్ని ఒక నిర్దిష్ట మూలాంశానికి పరిమితం చేసి వీలైనంతమట్టుకు ఆ మూలాంశాన్ని ఉపోద్ఘాతంలో ఏదొకరీతిలో ప్రస్తావించాలి. మూలాంశాన్ని స్పష్టంగా పేర్కొనకపోతే, కొన్ని సందర్భాలలో, ఉపోద్ఘాతమందు కీలకమైన మాటలను లేదా మూలాంశ మాటలను ప్రస్తావించవచ్చు. ఈ విధంగా మీ ప్రసంగాంశం చూపే విషయాలకన్నా వేరేవాటిని మీరు ప్రస్తావిస్తారని ప్రేక్షకులు ఎదురు చూడరు.

10 అన్ని ప్రసంగాలు అనుగుణ్యత కలిగి వుండాలి, అంటే ఒక విషయంతో మొదలై, మరొక విషయంతో ముగియకూడదు. అంతేకాకుండా, మూలాంశానికి తగిన ఉపోద్ఘాతం, ఆసక్తిని రేకెత్తించు ఉపోద్ఘాతం రెండూ సమతూకంగా ఉండాలి. మరోమాటలో చెప్పాలంటే, ప్రారంభంలో మంచి కథ చెప్పి, మూలాంశాన్ని మూలకు త్రోసేయకూడదు. ప్రసంగ ఉద్దేశం మీరు ఎన్నుకున్న సమాచారంలో తేటగా కన్పించాలి. అది సరిపడేదిగా ఉండి ప్రసంగ ముఖ్య భాగానికి పొందికగా ఉండాలి.

**********

11-14. ఉపోద్ఘాతం సరియైన నిడివిలో ఉందోలేదో ఎలా నిర్ణయించగలం?

11 తగిన నిడివి. ఉపోద్ఘాతానికి ఎంత నిడివి ఉండాలి? అన్ని పరిస్థితులకు సరిపడే విధంగా దానికి నిర్దిష్ట సమాధానమేమీ లేదు. ఆ అంశానికి అనుమతించబడిన సమయం, ప్రసంగ ఉద్దేశం, అక్కడున్న ప్రేక్షకులు మొదలైన విషయాలపై ఆధారపడి ఉపోద్ఘాత నిడివి వుంటుంది.

12 వాస్తవానికి, ప్రసంగాన్ని వినేటప్పుడు క్రమం తప్పకుండా ఉండేందుకు ఉపోద్ఘాతానికి, ప్రసంగానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించుట కష్టమే. మీ ప్రసంగ సలహా పత్రంపై ఈ లక్షణాన్ని గమనించుటలో మీ సలహాదారుడు ఇదే సమస్యను ఎదుర్కొంటాడు. ప్రతి విద్యార్థి తన ప్రసంగంలో ఏవో కొన్ని పరిచయ మాటలను ఉపయోగిస్తాడు, అయితే సలహాదారుడు వీటిని గమనిస్తాడు: ఉపోద్ఘాతం మరీ డొంక తిరుగుడుగా, లేదా మరీ వివరంగా, లేక మరీ ఎక్కువ నిడివిని కల్గివుంటే, అందించాల్సిన ముఖ్యాంశానికి మీరు రాకముందే ప్రేక్షకులు ముళ్లమీద కూర్చున్నట్లున్నారా?

13 ఉపోద్ఘాతం ఆసక్తిని రేకెత్తించే లక్షణాలను హరించకుండా అది మీ తలంపును ఒక నిర్దిష్ట పద్ధతిలో, క్రమమైన రీతిలో త్వరితగతిని చర్చనీయాంశానికి తీసుకువెళ్లేదై యుండాలి. అది ఏమాత్రం అంతరాలు లేకుండా సంపూర్ణంగా ఉండాలి. అందుకు మీరు బాగా యోచించాలి, ఎందుకంటే మీ ప్రారంభపు మాటలు అంశానికి అతీతంగా వుంటే దానికి సుదీర్ఘమైన, సవివరమైన వ్యాఖ్యానం అవసరం, కావున మీ ఉపోద్ఘాతాన్ని సరిచూచుకొని మరొక క్రొత్త ప్రారంభపు మాటను కనుగొనడం మంచిది.

14 ఉపోద్ఘాతానికి, ముఖ్య ప్రసంగానికి మధ్య స్పష్టమైన తేడాను కనుగొనడం కష్టమైతే, అప్పుడు మీ ఉపోద్ఘాతం సరియైన నిడివిలో వున్నదన్నమాట. ప్రేక్షకులకు తెలియకుండానే మీరు వారిని మీ చర్చనీయాంశములోనికి బహు చక్కగా నడిపించినట్లు అది చూపిస్తుంది. అలాకాకుండా, మీరెప్పుడు అసలు అంశానికి వస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్లయితే, మీ ఉపోద్ఘాత నిడివి ఎక్కువగా వుందని మీరు గ్రహించాలి. ఒక్కొక్క ఇంటివద్ద మీ ఉపోద్ఘాత నిడివిని మార్చవలసి వస్తుంది కనుక తరచుగా ఇంటింటి పరిచర్యలో ఇదొక బలహీనతయైయుంది.

15, 16. మీ ప్రసంగం, గోష్ఠిలో ఓ భాగమైయుంటే దాని ఉపోద్ఘాతం ఎంత నిడివిని కలిగివుండాలి?

15 కార్యక్రమంలో మీరు ఒక ప్రసంగాన్ని యిస్తున్నట్లయితే, లేదా ఒక విద్యార్థి ప్రసంగాన్ని యిస్తున్నట్లయితే, మీ ఉపోద్ఘాతం మరితర సందర్భాలలోకన్నా ఎక్కువ నిడివి ఉండవచ్చు. కాని మీ ప్రసంగం, గోష్ఠిలో ఒక భాగమైతే లేదా అది సేవా కూటములోని భాగమైతే అప్పటికే పరిచయం చేయబడిన కార్యక్రమంలోని భాగం గనుక మీ ఉపోద్ఘాతం క్లుప్తంగావుండి, సూటిగావుండాలి. సుదీర్ఘమైన, అనవసరమైన ఉపోద్ఘాతాల వలన ఎంతో సమయం వృధా అవుతుంది. మీరు ప్రసంగించదలచిన ఉద్దేశాలను అందించగల్గేది ప్రసంగ ముఖ్యభాగమే.

16 టూకీగా చెప్పాలంటే, మీ ఉపోద్ఘాతం కేవలం ప్రేక్షకులతో సంబంధం పెట్టుకోవడానికి, ఆసక్తిని రేకెత్తించడానికి, మీరు చర్చించబోయే పాఠ్యాంశంలోనికి నడిపించడానికే. అభ్యాససిద్ధమైన విధంగా దీనిని నిర్వహించి, మీ అసలు ప్రసంగాన్ని ప్రారంభించండి.

[అధ్యయన ప్రశ్నలు]