భావాన్ని నొక్కిచెప్పడము, స్వరభేదము
పాఠ్యభాగం 32
భావాన్ని నొక్కిచెప్పడము, స్వరభేదము
1, 2. నొక్కిచెప్పడం ప్రసంగానికి ఏమి చేకూర్చును?
1 భావాన్ని నొక్కిచెప్పడం, స్వరభేదం రెండూ కలసి ఒక ప్రసంగాన్ని అర్థవంతంగాను మనోహరంగాను చేస్తాయి. అవి లేకుంటే, ఉద్దేశాలు వక్రీకరించబడతాయి, మరి ఆసక్తి సన్నగిల్లుతుంది. ప్రావీణ్యతను సంపాదించుటకు ఈ రెండింటిలో, భావాన్ని నొక్కిచెప్పడం అనేది సాధారణంగా సులభం, దానికి మొదట అవధానమిద్దాము.
2 భావాన్ని నొక్కిచెప్పడం ఏమి నెరవేర్చనైయున్నదో మనస్సునందు ఉంచుకోండి. మాటలు లేదా ఆలోచనల కచ్చితమైన భావాన్ని అందించి, వాటి ప్రాముఖ్యతను మీ ప్రేక్షకులకు తెలియజేసే విధంగా వాటిని నొక్కిపలకడానికే. నొక్కిచెప్పడమనేది కొన్నిసార్లు బిగ్గరగా లేదా తక్కువ స్వరంతో ఉండవచ్చు, కాని దానికి మరింత మెరుగులు దిద్దవలసిన సమయాలు కూడా ఉన్నాయి.
3-7. నొక్కిచెప్పడంలో ఒకడు మంచి నైపుణ్యాన్ని ఎలా సంపాదించుకొనగలడో తెల్పండి.
3 వాక్యములో ఉద్దేశాన్ని వ్యక్తపర్చే పదాలు నొక్కిచెప్పబడ్డాయి. ఎక్కడ నొక్కిచెప్పాలి అనేది ప్రాథమికంగా ఏమాటలను నొక్కిచెప్పాలి అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉద్దేశాన్ని వ్యక్తపర్చే పదాలను గుర్తించి, వాటిని సరియైనరీతిగా వత్తిపలికి లేదా నొక్కిపలికి చుట్టుప్రక్కలవున్న మాటలకన్నా ప్రత్యేకంగా చూపడం దానిలో యిమిడివుంది. ఉద్దేశాన్ని వ్యక్తపర్చే పదాలకన్నా వేరేవాటిని నొక్కిపలికితే, అర్థం కనుమరుగైపోతాది లేదా వక్రీకరించబడుతుంది.
4 అనేకమంది సాధారణంగా తమ ప్రతిదిన మాటల్లోని భావాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఉపసర్గములను వత్తిపలకడం వంటి ఒక నిర్దిష్టమైన అలవాటు మీకు ఉంటే తప్ప యిది ఏమంత సమస్యగా పరిణమించదు. ఎక్కడ ఒత్తిపలకాలో అనే విషయమై ఏదైనా సమస్య వస్తే, సాధారణంగా అలాంటిది ఏదొక అలవాటు మూలంగానే వస్తుంది. మీకా సమస్యవుంటే, దాని విషయంలో గట్టి కృషి చేయండి. అలాంటి అలవాట్లు మానుకొనడం ఒకటి రెండు ప్రసంగాలలో సాధ్యంకాదు, అనవసరమైన చోట మీరు నొక్కిపల్కినప్పుడు అది మీ భావాన్ని ప్రక్కత్రోవ పట్టించకుండావుంటే మీ సలహాదారుడు మిమ్మల్ని ఆటంకపర్చడు. అయితే, అత్యంత ప్రతిభావంతంగాను, శక్తివంతంగాను ప్రసంగించేందుకు, సరియైన చోట నొక్కిపల్కడంలో మీరు నైపుణ్యం సంపాదించేంత వరకు కృషి చేస్తూనే ఉండండి.
5 ధారాళంగా ప్రసంగించడానికి సిద్ధపడుతున్నప్పుడుకన్నా బహిరంగంగా చదువుటకు సిద్ధపడుతున్నప్పుడు నొక్కిపలకడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. సంఘంలో కావలికోట పఠనానికి పేరాలను చదవడం విషయంలో అది ఎంత వాస్తవమో ప్రసంగంలో లేఖనాలను చదవడం విషయంలో కూడా అంతే. చదివేటప్పుడు నొక్కిచదవడానికి ఎక్కువ అవధానం ఎందుకు యివ్వాల్సి వస్తుందంటే, సాధారణంగా మనం వేరేవాళ్లు వ్రాసిన సమాచారాన్ని చదువుతూ ఉంటాము. కావున మనం దాని ఉద్దేశాన్ని విశ్లేషించుకొంటూ అందలి మాటలను మనం సహజంగా వ్యక్తపర్చేంత వరకు ఉచ్చరిస్తూ దానిని జాగ్రత్తగా పఠనం చేయాలి.
6 వత్తిపలకడం లేదా నొక్కిచెప్పడాన్ని ఎలా చేయవచ్చు? తరచూ మిళితం చేసివాడే అనేక పద్ధతులున్నాయి: బిగ్గరగా మాట్లాడడం, తీవ్రతరం చేయడం లేదా భావావేశంతో మాట్లాడడం, స్వరాన్ని తగ్గించడం, శ్రుతి పెంచడం, నెమ్మదిగాను, బాహాటంగాను మాట్లాడడం, వేగాన్ని పెంచడం, ఒక వాక్యం తరువాత లేదా ముందు (లేదా రెండు చోట్ల) వ్యవధిని యివ్వడం, అభినయాలు, ముఖ కవళికల ద్వారా చేయవచ్చును.
7 కీలకమైన మాటలను ఉన్నతపర్చడానికి మీరు సరియైన చోట వత్తిపలికారా, తగినంతగా చేశారా లేదాయని ముఖ్యంగా మొదట చూచుకోండి. కాబట్టి, మీరు సమాచారాన్ని సిద్ధపడుతున్నప్పుడు, మీరొక వేళ దానిని చదవ వలసివుంటే, కీలకమైన మాటల క్రింద గురుతు పెట్టండి. మీరొకవేళ ధారాళంగా మాట్లాడుతుంటే, ఆ విషయాలను స్పష్టంగా మనస్సులోనికి తెచ్చుకోండి. కీలకమైన మాటలను మీ నోట్స్‌లో వ్రాసుకొని ఆ మాటలను నొక్కిపల్కండి.
8, 9. ముఖ్య విషయాలను నొక్కిచెప్పడం ఎందుకు ప్రాముఖ్యం?
8 ప్రసంగంలోని ముఖ్యఉద్దేశాలు నొక్కిపలుకబడ్డాయి. నొక్కిపలకడంలో అతి తరచుగా లోపించేది యిదే. అలాంటప్పుడు ప్రసంగంలో ఎలాంటి ఉన్నత విషయాలు ఉండవు. మిగిలిన వాటితో వ్యత్యాసంగావుండే అంశాలేవి ఉండవు. దేనినైనా ఉన్నతపర్చి చెప్పకపోతే, ప్రసంగమంతా అయిన తరువాత దానిని జ్ఞాపకముంచుకోవడం అసాధ్యం. ముఖ్యాంశాలను ఉన్నతపర్చి చెప్పడానికి వాటిని సరిగా సిద్ధపడినప్పటి, ప్రసంగించేటప్పుడు వాటిని సరియైన విధంగా నొక్కిచెప్పకపోతే వాటిని సులభంగా మర్చిపోయేలా చేస్తుంది.
9 ఈ సమస్యను అధిగమించడానికి మొదట మీరు మీ సమాచారాన్ని అతి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ప్రసంగంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? తదుపరి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? ప్రసంగ సారాంశాన్ని ఒకటి లేక రెండు వాక్యాల్లో చెప్పమని మిమ్మల్ని అడిగితే మీరు ఏమి చెబుతారు? ఉన్నతాంశాలను గుర్తించడానికి అది అత్యంత శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి. వీటిని తెలుసుకున్న తరువాత మీ సంక్షిప్తప్రతిలో లేదా సవివరప్రతిలో గురుతు పెట్టుకోండి. ఈ ఉన్నతాంశాలనే ఆధారం చేసుకొని మీరిప్పుడు ప్రసంగాన్ని వృద్ధిచేయగలరు. ఇవి మీ ప్రసంగానికి ముఖ్యమైన సంగతులు, మరి వాటిని చక్కగా వ్రాసుకుని గట్టిగా నొక్కిచెప్పితే, ముఖ్య విషయాలు జ్ఞాపకంలో ఉండిపోతాయి. మీరు ప్రసంగించడంలో ఉన్న ఉద్దేశం అదే.
**********
10-12. స్వరభేదమంటే ఏమిటో వివరించండి.
10 సాధారణరీతిలో భావాన్ని నొక్కితెల్పితే, మీరు చెప్పేది ఏమిటో ప్రేక్షకులు అర్థం చేసుకొనడానికి అది తోడ్పడుతుంది, అయితే స్వరభేదం మూలంగా నొక్కిచెప్పడంలో వచ్చే వైవిధ్యం దానిని వినసొంపుగా చేస్తుంది. మీ ప్రాంతీయ పరిచర్యనందు, సంఘంలో మీకు లభించిన ప్రసంగ ఆధిక్యతలలో స్వరభేదాన్ని విరివిగా వాడగల్గుతున్నారా?
11 స్వరభేదమనేది ప్రసంగీకునిగా మీకున్న ఉద్దేశాలను, భావాలను వ్యక్తపర్చడానికి, ఆసక్తిని చూరగొనడానికి స్వర స్థాయి, వేగం, మరియు శక్తి వీటికి మధ్యవుండే వ్యత్యాసాన్ని చూపేందుకే నిర్దేశించబడింది. మీ స్వరభేదం మంచి ఫలితాలనివ్వాలంటే, ఎటువంటి ప్రసంగమైనా దానికుండే విశేషతను అది పూర్తిగా చూపించాలి. ఉన్నతస్థాయి స్వరభేదంలో తగ్గుతున్న స్థితి, ఉత్సాహం, ఉల్లాసం, అత్యంత ఆసక్తి మీకుండవచ్చు. మధ్యస్థాయిలో సామాన్యమైన ఆసక్తి, మరి క్రిందిస్థాయిలో తీవ్రత, గంభీరత ఉంటాయి.
12 విపరీత ధోరణిలో మాట్లాడి నాటకరంగానికి సంబంధించినవారని చూపించుకోవాలని మీరెప్పుడూ కోరరు. మన మాటలు వైవిధ్యంగా ఉండాలి, అంతేగాని పూర్వాచార పరాయణ మతనాయకుల మాటలవలే పావనపూరితంగాను, లేదా పందిళ్ల క్రింద కూటాలు పెట్టే సువార్తికుల మాటలవలే ఉద్రేకపూరితంగాను ఉండకూడదు. రాజ్యవర్తమానం యెడల మనకున్న గౌరవ మర్యాదలు అలాంటి క్రైస్తవ విరుద్ధ ఆడంబరాలు ప్రదర్శించకుండా మనలను నివారిస్తాయి.
13, 14. శక్తిలో వైవిధ్యం అంటే ఏమిటి?
13 స్వర శక్తిలో వైవిధ్యం. స్వరభేదాన్ని అలవర్చుకొనడానికి మీ స్వర శక్తిలో మార్పుచేయడమే బహుశ సులభమైన మార్గం. మీ ప్రసంగంలోని తారాస్థాయిలను ఉన్నతపర్చి, ముఖ్యాంశాలను నొక్కిపల్కేందుకు యిది ఒక మార్గం. అయితే, కేవలం స్వరాన్ని పెంచినంతమాత్రాన మీరు ఎల్లవేళల విషయాలను ఉన్నతపర్చలేరు. కొన్ని సందర్భాలలో అది వాటిని అత్యంత ప్రాముఖ్యమైనవిగా చేయవచ్చు, గాని వాటిని పలకడానికి మీరుపయోగించిన అదనపు శక్తి మీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోవచ్చు. బహుశ మీ అంశాలకు బిగ్గర స్వరం కంటే ఆప్యాయత, స్నేహశీలత ఎక్కువ అవసరం కావచ్చు. అలాంటప్పుడు మీ స్వరాన్ని తగ్గించండి గాని గంభీరతను మాత్రం పెంచండి. ఒకవేళ మీరు చింతను లేక భయాన్ని వ్యక్త పరుస్తున్నా యిదే పద్ధతిని అనుసరించాలి.
14 స్వరభేదానికి స్వర శక్తిలో వైవిధ్యం ప్రాముఖ్యమైనప్పటికి, కొందరికి వినబడనంత నెమ్మదిగా మాట్లాడకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలి. అలాగే రోతపుట్టించేంతగా కూడా స్వరాన్ని పెంచకూడదు.
15-17. వేగంలో వైవిధ్యం ఒక ప్రసంగాన్ని ఎలా యినుమడింప జేస్తుంది?
15 వేగంలో వైవిధ్యం. క్రొత్తగా ప్రసంగించే కొంతమంది వేదిక మీద మాట్లాడేటప్పుడు వేగంలో వ్యత్యాసం చూపిస్తారు. మన అనుదిన మాటల్లో మనం దానిని ఎడతెగక చేస్తుంటాం ఎందుకంటే మనం వాటిని గూర్చి తలంచగానే లేదా వాటి అవసరత మనకు రాగానే మన మాటలు మనలో నుండి అయత్నపూర్వకంగా వచ్చేస్తాయి. అయితే వేదిక మీదకు వచ్చిన క్రొత్త ప్రసంగీకుడు అలా జరగడానికి తాను అనుమతించడు. మాటలన్నీ ఒకే వేగంతో వచ్చేలాగున అతడు తన మాటలను, వాక్యభాగాన్ని అతి జాగ్రత్తగా సిద్ధపడతాడు. సంక్షిప్తప్రతి నుండి మాట్లాడుట ఈ బలహీనతను సరిచేసుకొనడానికి సహాయపడగలదు.
16 మీ ప్రసంగపు ప్రధాన వెల్లువ తగుమాత్రపు వేగంతో ఉండాలి. చిన్న అంశాలు, వివరణ, అనేక ఉపమానాలు మున్నగునవి వేగాన్ని పెంచడానికి మీకు సహాయపడగలవు. విలువైన తర్కనలను, తారస్థాయి సంఘటనలను, ముఖ్యాంశాలను సర్వసాధారణంగా నెమ్మదిగా ప్రసంగించవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో, దేన్నైనా మరీ నొక్కిచెప్పాల్సివుంటే వేగాన్ని తగ్గించి గట్టిగా నొక్కిచెప్పవచ్చు. వీలైతే మీరు విరామం కొరకు పూర్తిగా ఆగిపోవచ్చు, అది వేగాన్ని పూర్తిగా మార్చివేస్తుంది.
17 కొన్ని హెచ్చరిక మాటలు. మీ వాగ్ధోరణి దెబ్బతినేలా ఎన్నడూ అతి వేగంగా మాట్లాడవద్దు. ప్రత్యేక అభ్యాస కార్యక్రమంలో అద్భుతమైన సాధనమేమంటే, మీరు తడబడకుండా, చదవగల్గినంత వేగంగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నించడమే. తడబడకుండా లేదా ఉచ్చారణ మందగించకుండా మీ వేగాన్ని క్రమేపి పెంచుకుంటూ, అదే పేరాను పదేపదే చదవండి. పిమ్మట పదాలను మింగివేసే బదులు అ-చ్చు-ల-ను వి-డ-దీ-స్తూ సాధ్యమైనంత నెమ్మదిగా చదవడానికి ప్రయత్నించండి. ఆ తరువాత మీరు కోరిన విధంగాను పరిస్థితులకు అనుకూలంగాను మీ స్వరం మారేంత వరకు ఒకదాని తరువాత ఒకటిగాను అప్పుడప్పుడు వేగంగాను, నెమ్మదిగాను చదువుతూ ఉండండి. ఇప్పుడు మీరు మాట్లాడితే వేగంలో మీరు చేసే మార్పులు వాటంతటవే, మీరు చెబుతున్నదాని భావానికి అనుగుణ్యంగా వచ్చేస్తాయి.
18-20. స్థాయిలో వైవిధ్యాన్ని ఒకడు ఎలా పెంపొందించుకొనగలడో వివరించండి.
18 స్థాయిలో వైవిధ్యం. స్వరభేదం ఏ స్థితిలోనున్నా దాని స్థాయిని మార్చడమనేది బహుశ అత్యంత క్లిష్టమైన పద్ధతి. అయితే, మనం స్థాయిని కొంచెం పెంచి, సాధారణంగా కొద్దిపాటి శక్తిని జోడించి మాటలను తరచూ నొక్కిపలుకుతూ ఉంటాము. పదాన్ని ఉన్నదున్నట్లుగా ఒత్తి పలుకుతాము.
19 కానీ ఈ రకమైన స్వరభేదం నుండి మీరు మరింత ప్రయోజనం పొందాలంటే స్థాయిలో మార్పును ఇంతకన్నా ఎక్కువే ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆదికాండము 18:3-8; 19:6-9 వచనాలను బిగ్గరగా చదవడానికి ప్రయత్నించండి. ఈ వచనాలలో వేగాన్ని, స్థాయిని ఎన్నెన్ని విధాలుగా మార్చవలసి ఉంటుందో గమనించండి. విచారం లేదా చింతకన్నా ఉద్రేకం, ఉత్సాహానికి ఎల్లవేళల స్థాయిని ఎక్కువగా పెంచవలసి ఉంటుంది. ఈ భావోద్రేకాలు మీ సమాచారంలో కన్పించినప్పుడు, వాటిని అలాగే వ్యక్తపర్చండి.
20 ఈ ప్రసంగ లక్షణములో బలహీనత ఉండడానికిగల ప్రధాన కారణాలలో ఒకటేమంటే తగినంత స్వరం లేకపోవడమే. మీకా సమస్య ఉంటే దాని విషయంలో కృషి చేయండి. ఈ పాఠ్యభాగంలో అంతకు ముందు సిఫారసు చేయబడినటువంటి ఒక అభ్యాసాన్ని ప్రయత్నించండి. ఈ విషయంలోనైతే వేగంలో మార్పుచేసే బదులు స్థాయి పెంచడం, తగ్గించడంలో కృషి చేయండి.
21-24. స్వరభేదమెందుకు విషయానికి లేదా భావోద్రేకానికి సరిపడేదై యుండాలి?
21 విషయానికి లేదా భావోద్రేకానికి సరిపడు స్వరభేదం. ఈ లక్షణాన్ని గూర్చి మనమింత వరకు చర్చించిన దానిని బట్టి కేవలం వైవిధ్యాన్ని సంపాదించడానికే స్వరంలో భేదం చూపించడమనేది జరుగదని స్పష్టంగా తెలుసుకున్నాం. మీరు చెబుతున్న దాని భావస్థితికి తగినట్లుగా మీ మాటలు ఉండాలి. మరైతే స్వరభేదం ఎక్కడ ప్రారంభమౌతుంది? నిశ్చయంగా అది మీరు ప్రసంగించడానికి సిద్ధపడిన సమాచారంతో ప్రారంభమౌతుంది. మీ ప్రసంగంలో తర్కన లేదా ఉద్బోధ తప్ప మరింకేమి లేకపోతే మీరు ప్రసంగించే విధానంలో కొంత వైవిధ్యం ఉంటుంది. గనుక మీరు సంక్షిప్తప్రతిని తయారు చేయడం ముగించిన తరువాత దానిని విశ్లేషించి వివిధ రీతుల్లోను అలాగే అర్థవంతంగాను ఉండే ప్రసంగానికి కావలసిన మిశ్రమాలన్నీ దానిలో ఉన్నాయో లేదో చూచుకోండి.
22 కొన్నిసార్లు ప్రసంగం మధ్యలో వేగాన్ని మార్చవలసిన అగత్యత ఉన్నదని మీరు గుర్తించవచ్చు. మీ ప్రసంగం భారంగా సాగుతున్నట్లు మీకు అన్పించవచ్చును. మీరేమి చేయవచ్చు? మరలా ఇక్కడ కూడా సిద్ధపడి ధారాళంగా యిచ్చే ప్రసంగానికి ప్రయోజనం ఉంది. మీరు ప్రసంగిస్తుండగా మీ ప్రసంగ రూపాన్నే మార్చివేయ గల్గుతారు. ఎలా? ఒక పద్ధతేమంటే, మాట్లాడ్డం మానివేసి బైబిలు నుండి ఒక వచనాన్ని చదవడం ప్రారంభించడమే. లేదా నొక్కిచెప్పడానికి కొంత వ్యవధినిచ్చి, ఏదొక వాగ్మూలాన్ని మీరు ప్రశ్నారూపకంగా మార్చవచ్చు. మీ సంక్షిప్తప్రతిలో ఉన్న ఒక తర్కనకు పొందికచేస్తూ మీరొక ఉపమానాన్ని యిమడ్చవచ్చును.
23 అయితే, ప్రసంగించేటప్పుడు ఉపయోగించబడు ఈ మెళకువలన్నీ అనుభవజ్ఞులైన ప్రసంగీకులకే. కానీ మీరు కూడా మీ ప్రసంగం కొరకు ముందుగా సిద్ధపడుతున్నప్పుడు వాటిని ఉపయోగించ వచ్చును.
24 స్వరభేదమనేది ప్రసంగానికి మసాలా వంటిదని చెప్పబడుతుంది. సరియైన రకాన్ని సరియైన పరిమాణంలో ఉపయోగిస్తే, మీ సమాచారానికి మంచి రుచిని చేకూర్చి, మీ ప్రేక్షకులకు ఉల్లాసంగా ఉండేటట్లు చేస్తుంది.
[అధ్యయన ప్రశ్నలు]